జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352)
విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు, యుద్ధం సంభవించినప్పుడు, దేశంలో సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు ప్రధానమంత్రి సిఫారసు మేరకు రాష్ర్టపతి అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారు.రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన - ప్రకరణ 356
రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి లేదా రాష్ర్టపతి పాలన (ప్రకరణ 356). రాజ్యాంగం విధించిన నియమ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో పరిపాలన సాగడం లేదని, అక్కడి పాలనాయంత్రాంగం విఫలమైందని రాష్ర్టపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధిస్తారు.
ఆర్థిక అత్యవసర పరిస్థితి - ప్రకరణ 360
ప్రకరణ 360 ప్రకారం దేశ ఆర్థిక పరిస్థితికి ప్రమాదం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు.
ఆర్థికఅత్యవసర పరిస్థితిని పార్లమెంటు రెండు నెలల్లోగా ఆమోదించాల్సి ఉంటుంది.