» కరెన్సీ నోట్స్‌ప్రెస్ నాసిక్ (మహారాష్ట్ర)
- ఇక్కడ 10, 50, 100 రూపాయల నోట్లు ముద్రిస్తారు.
- ప్రస్తుతం 1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశారు.
» ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ - నాసిక్ (మహారాష్ట్ర)
- ఇక్కడ పోస్టల్ స్టాంపులు, మెటీరియల్, జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ స్టాంపులు, చెక్కులు, బాండ్లు, ఎన్‌ఎస్‌సీలు, ఇందిరా వికాస్, కిసాన్ వికాస్ పత్రాలను ముద్రిస్తారు.
» బ్యాంక్ నోట్ ప్రెస్ - దేవాస్ (మధ్యప్రదేశ్)
- ఇక్కడ 20, 50, 100, 500, 1000 రూపాయల నోట్లు ముద్రిస్తారు.
» సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్
- దీన్ని 1982లో ఏర్పాటు చేశారు. ఇక్కడ కోర్టు స్టాంపులు, స్మృతి స్టాంపులు, కిసాన్ వికాస్ పత్రాలు, ఎన్‌ఎస్‌ఎస్ సర్టిఫికెట్లు ముద్రిస్తారు.
» సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హోషంగాబాద్ (మధ్యప్రదేశ్):
- ఇక్కడ కరెన్సీ నోట్లకు అవసరమైన కాగితాన్ని తయారుచేస్తారు.
- కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ ముద్రణను 1996లో ప్రవేశపెట్టారు.
- 2012 జనవరి నుంచి కరెన్సీ నోట్లపై రూపాయి చిహ్నాన్ని సూచించే '₹’ గుర్తును ముద్రిస్తున్నారు.
- ‘₹’ గుర్తు రూపకర్త - ఉదయ్‌కుమార్ ధర్మలింగం. ఇతడు తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు.
ప్రతి కరెన్సీ నోటుపై 17 భాషల్లో దాని విలువ ముద్రించి ఉంటుంది. నోటు వెనుకవైపు కింది భాగంలో ఒక వైపు హిందీ, మరోవైపు ఇంగ్లిష్ భాషల్లో, నోటుకు ఎడమవైపు పైభాగంలో ఒక పట్టికలో 15 భాషల్లో (మొత్తం 22 అధికార భాషల నుంచి) ఆ నోటు విలువ ముద్రిస్తారు.