Type Here to Get Search Results !

Vinays Info

కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలు

కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలు

కిరణజన్య సంయోగ క్రియశ్వాసక్రియ
1. ఆకు పచ్చని మొక్కలలో, పత్ర హరితం కలిగిన కొన్ని బ్యాక్టీరియాలలో జరుగుతుంది.

1. ఇది అన్ని జీవులలో జరుగును.

2. పగటిపూట మాత్రమే జరుగును.

2. అన్ని వేళలలో జరుగును.

3. కిరణజన్య సంయోగ క్రియ జరుపకుండా మొక్క కొద్ది రోజులే జీవించగలదు

3. ఇది నిరంతర ప్రక్రియ. ఇది లేకుంటే జీవి కొద్ది నిమిషాలే జీవిస్తుంది.
4. హరితరేణువుల్లో జరుగుతుంది. దీనికి సూర్యకాంతి అవసరం4. మైటో కాండ్రియాలలో జరుగును. దీనికి సూర్యకాంతి అవసరం లేదు.
5. కార్బన్ డై ఆక్సైడ్, ముడి పదార్థాలు5. పిండి పదార్థాలు, కర్బన పదార్థాలు, ఆక్సీజన్, వినియోగపడతాయి.
6. CO2 వినియోగం చెంది O2విడుదల అవుతుంది.6. O2 వినియోగం చెంది CO2విడుదల అవుతుంది
7. కాంతిశక్తిని ఉపయోగించి ATP ని ఉత్పత్తి చేస్తుంది. (క్రాంతి భాస్వీకరణము)7. గ్లూకోజ్‌ను ఆక్సీకరణం చేసి ATP ని ఉత్పతి చేస్తుంది.(ఆక్సీడేటివ్‌ పాస్పారిలేషన్)
8. నీటి అణువులోని H2 ను ఉపయోగించుకొనిNADPను NADH2 గా క్షయకరణం చేస్తుంది.8. NADH2 అనేది పిండిపరదార్థాలలలోని హైడ్రోజన్ నుండి ఏర్పడుతుంది.
9. ATP,NADH2లు కర్బన సమ్మేళనాల తయారీకి ఉపయోగపడతాయి.9. ATP,NADH2 లు కణంలోని చర్యలకు ఉపయోగపడతాయి.
10. ఇది నిర్మాణాత్మక చర్య (ఎనబాలిక్)10. ఇది విచ్ఛిన్నక్రియ (కెటబాలిక్)

11. పిండి పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి జీవి బరువు పెరుగుతుంది.

11. ఇది శక్తిని విడుదల చేసే క్రియ. కాబట్టి జీవి బరువుని తగ్గిస్తుంది.

12. ఇది ఉష్ణగ్రాహక చర్య

12. ఇది ఉష్ణమొచక చర్య

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section