రక్త వర్గాలు(Blood Groups)
కార్ల్ లాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త 1900లో A, B, O అనే మూడు రక్త వర్గాలను కనుగొన్నాడు. ఇతడిని ‘రక్తవర్గాల పితామహుడి’గా పేర్కొంటారు. AB రక్త వర్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు డీకాస్టెల్లా, స్టర్లీ (1902). ఏటా జూన్14న 'ప్రపంచ రక్తదాన దినోత్సవం' జరుపుకొంటారు.
పరిపూర్ణ ఆరోగ్యవంతమైన వ్యక్తి తన జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు. దానం చేసిన తర్వాత వారం రోజుల్లో రక్తం తిరిగి ఉత్పత్తి అవుతుంది.
ప్రపంచంలో అధికంగా (72 80%) ఉండే రక్త వర్గం B+Ve.
ప్రపంచంలో అతి తక్కువగా (1%) ఉండే రక్త వర్గం AB–Ve.
ప్రమాదం జరిగిన వ్యక్తి రక్త వర్గం తెలియనప్పుడు O Rh–Ve వర్గం రక్తాన్ని ఇవ్వవచ్చు. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా దీన్ని అందించవచ్చు.
O రక్త వర్గం వారిని ‘విశ్వ దాత’ (Universal Donor) అంటారు. ఈ రక్త వర్గంలో Antigens (ప్రతిజనకాలు) ఉండవు.
AB రక్త వర్గం ఉన్న వారిని ‘విశ్వ గ్రహీత’ (Universal Recipient) అంటారు. ఈ రక్త వర్గంలో Antibodies (ప్రతిరక్షకాలు) ఉండవు.
సాధారణంగా రక్త వర్గాలను ఎర్ర రక్త కణాల (RBC)పై ఉండే Antigen (A or B) ఆధారంగా నిర్ణయిస్తారు. ప్లాస్మాలో రెండు రకాల ప్రతిరక్షక దేహాలుంటాయి. అవి.. ప్రతిరక్షకం A, ప్రతిరక్షకం B.
రక్త గ్రూపులు వంశ పారంపర్యంగా వస్తాయి. వీటిని నిర్ణయించే జన్యువులు 9వ క్రోమోజోమ్‌పై ఉంటాయి. ప్రతి వ్యక్తిలో రక్త గ్రూప్‌నకు సంబంధించిన రెండు జన్యు కారకాలు ఉంటాయి. ఇందులో ఒకటి తల్లి నుంచి, మరొకటి తండ్రి నుంచి వస్తుంది. ఈ రెండింటిలో సంతానానికి ఒక జన్యు కారకమే చేరుతుంది. రెండు రకాల కారకాలు ఒకే రకంగా ఉన్నప్పుడు పురుషుల్లో ఒకే రకమైన శుక్రకణాలు లేదా స్త్రీలలో ఒకే రకమైన అండాలు ఏర్పడతాయి.
- భారత్‌లో సగటున
1) A రక్తవర్గం ఉన్నవారు - 24 శాతం
2) B రక్తవర్గం ఉన్నవారు - 38 శాతం
3) AB రక్తవర్గం ఉన్నవారు - 8 శాతం
4) O రక్తవర్గం ఉన్నవారు - 30 శాతం
రక్తం గ్రూప్ | RBCపైన ప్రతిజనకం | ప్లాస్మాలో ప్రతిరక్షకం | ఎవరికి ఇవ్వొచ్చు | ఎవరి నుంచి తీసుకోవచ్చు | ఎవరి నుంచి తీసుకోకూడదు |
A | A | B | A, AB | A, O | B, AB |
B | B | A | B, AB | B, O | A, AB |
AB | AB | ఉండవు | AB | విశ్వగ్రహీత AB, A, B, O | అందరి నుంచి తీసుకోవచ్చు |
O | ఉండవు | AB | విశ్వదాత O, A, B, AB | O | A, B, AB |
Rh కారకం
Rh కారకాన్ని కార్ల్ లాండ్ స్టీనర్, వీనర్ 1940లో కనుగొన్నారు. ఇది Rh కూడా ఒక రకమైన ప్రతిజనకం. ఇవి కూడా RBCలపై ఉంటాయి. Rh కారకాన్ని మొదట ఆగ్నేయాసియాలో మాత్రమే కనిపించే రీసస్ కోతుల (Macacul rhesus)లో గుర్తించారు. దీన్ని 'D' యాంటీజెన్ అని కూడా అంటారు.
రీసస్ కోతులు మధ్యప్రదేశ్‌లోని పెంచ్ జాతీయ పార్క్ లో ఉన్నాయి.
భారతదేశ జనాభాలో 93 శాతం Rh కారకం ఉంటుంది. మిగిలిన 7 శాతం జనాభాలో Rh కారకం ఉండదు.
ఒక వ్యక్తి RBCలపై Rh కారకం (Antigen) ఉంటే.. B రక్త వర్గాన్ని Rh+ve అని, Rh కారకం లేకుంటే ఆ రక్తవర్గాన్ని Rh–ve అని పిలుస్తారు.
యూరప్ జనాభాలో Rh+ve, Rh–ve జనాభా నిష్పత్తి వరసగా 85 శాతం, 15 శాతం.
ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్
Rh+ve రక్త వర్గం ఉన్న పురుషుడు, Rh–ve రక్త వర్గం ఉన్న స్త్రీకి జన్మించిన శిశువు రక్తవర్గం Rh+ve అయితే శిశువు రక్త వర్గానికి వ్యతిరేకంగా తల్లి రక్తంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇది చాలా నెమ్మదిగా జరిగే చర్య. ఇవి ఉత్పత్తి అయ్యే సమయానికి శిశువు జన్మిస్తుంది.
ఒకవేళ రెండో కాన్పులోనూ Rh+ve శిశువు జన్మిస్తే తల్లి శరీరంలో ఉత్పత్తై Antibodies శిశువులో RBCలను విచ్ఛిన్నం చేయడం వల్ల శిశువు మరణిస్తుంది. దీన్ని ‘ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్’ అంటారు. దీని నివారణకు మొదటి కాన్పు తర్వాత తల్లికి Anti Rh Antibody (or) Anti–D Injection ఇంజెక్షన్ ఇస్తారు. దీన్ని జేమ్స్ హరిసన్ కనుగొన్నాడు.
రక్త దానం
ఒక వ్యక్తి రక్తాన్ని మరో వ్యక్తికి అతడి సిరల ద్వారా ఎక్కించడాన్ని రక్త ప్రవేశం అంటారు.
ప్రతిజనకం, ప్రతిరక్షకాల చర్య వల్ల రక్త గుచ్ఛీకరణం జరుగుతుంది. రక్త కణాలు గుంపులుగా ఏర్పడటాన్ని ‘గుచ్ఛీకరణం’ (Agglutination) అంటారు.
16-60 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యవంతమైన స్త్రీ, పురుషులు రక్తదానం చేయవచ్చు.
రక్త దాతలకు హెపటైటిస్-బి, లుకేమియా, ఎయిడ్స్, మలేరియా లాంటి వ్యాధులు ఉండకూడదు.
ఒక వ్యక్తి 3 లేదా 4 నెలలకు ఒకసారి ఒక యూనిట్ (300 ఎం.ఎల్.) రక్తాన్ని దానం చేయవచ్చు.
మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల అంగవైకల్యం, హిమోఫిలియా వ్యాధితో పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. దీనికి కారణం బ్లడ్ గ్రూప్ కలవకపోవడం.