జాతీయ క్రీడా పురస్కారాలు(National Sports Awards)
2020 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న ప్రకటించింది. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29(ద్యాన్‌చంద్ 115వ జయంతి)న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న అవార్డులను అందజేస్తారు.Current Affairs
వర్చువల్‌గా అవార్డుల స్వీకరణ...
కరోనా వైరస్ విజృంభణ కారణంగా 2020 ఏడాది క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో ప్రదానం చేశారు. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్‌రత్న, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది 2020 ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా ఆగస్టు 29న 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు.
రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (5):
2020 ఏడాదికిగాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురు ఎంపికయ్యారు. గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్‌రత్న’ అవార్డును ఇచ్చారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్‌రత్న’ అవార్డును ప్రవేశపెట్టారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | రోహిత్ శర్మ | క్రికెట్ |
2 | వినేశ్ ఫొగాట్ | మహిళల రెజ్లింగ్ |
3 | రాణి రాంపాల్ | మహిళల హాకీ |
4 | మనికబత్రా | మహిళల టేబుల్ టెన్నిస్ |
5 | మరియప్పన్ తంగవేలు | పారా అథ్లెటిక్స్ |
2020 ఏడాదికి మొత్తం 27 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | సాత్విక్ సాయిరాజ్ | బ్యాడ్మింటన్ |
2 | చిరాగ్ శెట్టి | బ్యాడ్మింటన్ |
3 | ఇషాంత్ శర్మ | క్రికెట్ |
4 | దీప్తి శర్మ | క్రికెట్ |
5 | మనీశ్ కౌశిక్ | బాక్సింగ్ |
6 | లవ్లీనా బొర్గోహైన్ | బాక్సింగ్ |
7 | మను భాకర్ | షూటింగ్ |
8 | సౌరభ్ చౌధరీ | షూటింగ్ |
9 | దివ్య కాక్రన్ | రెజ్లింగ్ |
10 | రాహుల్ అవారే | రెజ్లింగ్ |
11 | ఆకాశ్‌దీప్ సింగ్ | హాకీ |
12 | దీపిక | హాకీ |
13 | దివిజ్ శరణ్ | టెన్నిస్ |
14 | అతాను దాస్ | ఆర్చరీ |
15 | ద్యుతీ చంద్ | అథ్లెటిక్స్ |
16 | విశేష్ భృగువంశీ | బాస్కెట్‌బాల్ |
17 | అజయ్ అనంత్ సావంత్ | ఈక్వేస్టియ్రన్ |
18 | సందేశ్ జింగాన్ | ఫుట్‌బాల్ |
19 | అదితి అశోక్ | గోల్ఫ్ |
20 | దీపక్ హుడా | కబడ్డీ |
21 | సారిక కాలే | ఖో-ఖో |
22 | దత్తు బబన్ భొఖనాల్ | రోయింగ్ |
23 | మధురిక పాట్కర్ | టేబుల్ టెన్నిస్ |
24 | శివ కేశవన్ | వింటర్ స్పోర్ట్స్ |
25 | సుయశ్ నారాయణ్ జాదవ్పారా | స్విమ్మింగ్ |
26 | సందీప్ | పారా అథ్లెటిక్స్ |
27 | మనీశ్ నర్వాల్ | పారా షూటింగ్ |