TS 5th Class : EVS 11.భద్రత చర్యలు(Safety Measures)
- ప్రమాదాలు జరగకుండా మనం తీసుకునే చర్యలనే - భద్రత చర్యలు అని అంటారు.
- తమిళనాడులో ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది.
- భూకంపం వలన భూమి తీవ్రంగా కుదుపులకు లోను కావడం జరుగుతుంది.
- భూకంపాలు రిక్టర్ స్కెలు మీద నమోదు చేస్తారు.దీని మీద 6-7 పాయింట్లు దాటితే ప్రమాదాలు సంభవిస్తాయి.
- మనదేశంలో మహారాష్ట్ర లోని లాతుర్ జిల్లాలో 1993 లో తీవ్రమైన భూకంపం వచ్చింది.
- గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతాల్లో అనగా భుజ్ లో 2001లో అతిపెద్ద భూకంపం వచ్చింది.
- 1977లో - దీవి సీమ ఉప్పెన
- 2009లో - కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి.
- వరదల్లో నడవాల్సి వస్తే - పొడవాటి కర్ర సహాయంతో దారి చూసుకుంటూ నడవాలి.
- వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందే రోగి లేదా భాదితునికి వెంటనే అందించే చికిత్సను - ప్రథమ చికిత్స అంటారు.
- భయాన్ని పోగొట్టడం, ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రథమ చికిత్సలో భాగమే.
- 104 - 30 జూన్ 2013 న ప్రారంభమైంది.
- Dettol లాంటి యాంటీసెప్టిక్ లోషన్ని నేరుగా వాడకూడదు.
- గాయం పైన ఆయింట్ మెంట్ రాసి గాజ్(Gauze) గుడ్డతో కట్టాలి.
- మంచు గడ్డను నేరుగా గాయం మీద రాయకూడదు.
- ప్రమాదం జరిగిన మొదటి గంటను గొల్డెన్ అవర్ అంటారు. ఎందుకంటే మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భంలలో ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు.
- ప్రాణ రక్షక సూత్రాలు - 03