Type Here to Get Search Results !

Vinays Info

జాతీయ విజ్ఞాన దినోత్సవం - National Science Day

స‌ర్ సీవీ రామ‌న్ "రామన్ ఎఫెక్ట్‌" కనుగొన్న జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని (ఎన్‌ఎస్‌డీ) నిర్వహిస్తారు.

లక్ష్యం:

  • విజ్ఞానశాస్త్రం (Science) యొక్క ప్రాముఖ్యత మరియు దాని ఉపయోగం యొక్క సందేశాన్ని ప్రజలలో ప్రచారం చేయడం.

ఎప్పటి నుంచి?

  • 1986 లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC- National Council for Science and Technology Communication) ఫిబ్రవరి 28 ను జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day) గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.
  •  భారతదేశం 1986 లో ఈ రోజును జాతీయ విజ్ఞాన దినంగా అంగీకరించింది మరియు ప్రకటించింది.
  • 1987 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఫిబ్రవరి 28 నే ఎందుకు?Why National Science Day Celebrated on February 28?

  • చంద్రశేఖర్ వెంకటరామన్ (CV Raman) 'రామన్‌ ఎఫెక్ట్‌' కనుగొన్న (పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన) రోజైన ఫిబ్రవరి 28 (1928) జ్ఞాపకార్థం జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.

మొద‌టిసారి ఎన్ఎస్‌డీని ఫిబ్రవరి 28, 1987న జరుపుకుంది. రామ‌న్ ఎఫెక్ట్ క‌నుగొనందున స‌ర్ సీవీ రామ‌న్ నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్నాడు.

ఈ ఎన్ఎస్‌డీకి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన‌ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ కమిటీ (ఎన్‌సీఎస్‌టీసీ) మ‌ద్ధ‌తు ఇస్తుంది. విద్య, నైపుణ్యాలు, ప‌నిపై ప్రభావాల గురించి ఇది వివ‌రిస్తుంది. రామన్ ఎఫెక్ట్ అనేది ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్ కనుగొన్న స్పెక్ట్రల్ ఫినోమేన‌న్. దీన్ని 1928లో క‌నుగొన‌గ 1930లో ఆయ‌న‌కు నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌దానం చేశారు. ఇది సైన్స్ రంగంలో భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి.

కాంతి పుంజం అణువుల ద్వారా విక్షేపం అయినప్పుడు సంభవించే కాంతి తరంగదైర్ఘ్యంలో మార్పును రామన్ ఎఫెక్ట్ అంటారు. పుంజం దుమ్ము లేని, పారదర్శక సమ్మేళనం నమూనా గుండా వెళుతున్నప్పుడు, పుంజంతో చాలా త‌క్కువ భాగం ఇన్‌కమింగ్ పుంజానికి వ్య‌తిరేక దిశ‌లో ప‌య‌నిస్తుంద‌ని ఆయ‌న క‌నుగొన్నారు.


థీమ్ (Theme of National Science Day)

  • 2016: దేశ అభివృద్ధికి శాస్త్రీయ సమస్యలు (Scientific Issues for Development of the Nation)
  • 2017: అవయవ వైఫల్యం కలిగినవారి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ (Science and Technology for Specially Abled Persons)
  • 2018: స్థిరమైన భవిష్యత్తు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ (Science and Technology for a sustainable future)
  • 2019: ప్రజల కోసం సైన్స్ మరియు సైన్స్ కోసం ప్రజలు (Science for the People, and the People for Science)
  • 2020: సైన్స్ లో మహిళలు (Women in Science)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section