1). బ్రిటన్
పార్లమెంటరీ ప్రభుత్వం,, స్పీకర్ వ్యవస్థ,, శాసన ప్రక్రియ,, పార్లమెంటరీ కమిటీలు,, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ,, సమన్యాయ పాలన, అఖిల భారత సర్వీసులు,అటార్నీ జనరల్, కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (కాగ్ ), ఎన్నికల విధానం, ద్విసభా విధానం.. అనే అంశాలను బ్రిటన్ దేశంనుండి తీసుకుని మన భారత రాజ్యంగంలో పొందుపరచడం జరిగింది.
2). అమెరికా
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రవేశిక, ఉపరాష్ట్రపతి వ్యవస్థ,, ప్రాథమిక హక్కులు, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ,,న్యాయ సమీక్ష,, చట్టంలో సమదృష్టి, మహాభియోగ తీర్మానం మొదలైనటువంటి అంశాలను అమెరికా నుండి గ్రహించి మన భారత దేశ రాజ్యంగంలో పొందుపరిచారు.
3).కెనడా
సమాఖ్య ప్రభుత్వం,, అవశిష్టా అధికారాలు,,గవర్నర్ వ్యవస్థ,, రాష్ట్రపతి సుప్రీమ్ కోర్ట్ సలహాలు కోరే విధానం మొదలైనటువంటి అంశాలనుకెనడా దేశం నుండి తీసుకుని భారత రాజ్యంగంలో పొందుపరిచారు.
4).ఐర్లాండ్
ఆదేశిక సూత్రాలు,, రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే విధానం మొదలైన అంశాలను ఐర్లాండ్ దేశం గ్రహించి నుంచి భారత దేశం రాజ్యాంగం లో పొందుపరిచారు.
5).దక్షిణాఫ్రికా
రాజ్యాంగ సవరణ,, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం మొదలైనటువంటి అంశాలను భారతదేశ రాజ్యాంగం కొరకు దక్షిణాఫ్రికా దేశం నుండి గ్రహించారు.
6). ఆస్ట్రేలియా
ఉమ్మడి జాబితా, పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశం,, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు,,వర్తక వాణిజ్య చట్టాలు అనే అంశాలను ఆస్ట్రేలియా దేశం నుండి గ్రహించి మన భారతదేశ రాజ్యంగంలో పొందుపరిచారు.
7).ఫ్రాన్స్
గణతంత్ర,, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, తాత్కాలిక స్పీకర్ అనే అంశాలను భారత దేశ రాజ్యాంగం కొరకు ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించారు.
8). రష్యా
ప్రాథమిక విధులు,, సౌమ్యవాదం,, న్యాయం,, ప్రణాళికలు అనే అంశాలను మన భారతదేశ రాజ్యంగంలో పొందుపరచడానికి రష్యా దేశం నుండి గ్రహించారు.
9). జపాన్ :
జీవించే హక్కు అనే అంశాన్ని జపాన్ దేశం నుండి మన భారత దేశ రాజ్యాంగం కొరకు గ్రహించారు.
10).జర్మనీ :
అత్యవసర పరిస్థితి అనే అంశాన్ని మన భారత దేశ రాజ్యాంగం కొరకు జర్మనీ దేశం నుండి గ్రహించారు.
Very Useful , Thank u all
ReplyDelete