- కార్మిక సంక్షేమం | Labour Welfare
రాష్ట్రంలో మొత్తం 10,36,190 మంది భవన, ఇతర నిర్మాణ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు
ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబ సభ్యులకు అందించే ఆర్థిక సహాయం Rs. 6 లక్షలు
ప్రమాదం వలన పూర్తి శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికునికి అందించే ఆర్థిక సహాయం Rs. 5 లక్షలు
ప్రమాదం వలన పాక్షిక శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికులకు అందించే ఆర్థిక సహాయం Rs. 4 లక్షలు
సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబ సభ్యులకు అందించే ఆర్థిక సహాయం Rs.1 లక్ష
మరణించిన కార్మికుల అంత్యక్రియల నిమిత్తం అందించే ఆర్థిక సహాయం Rs. 30,000
మహిళా కార్మికురాలి వివాహం లేదా కార్మికుల ఇద్దరు కుమార్తెల వివాహం సందర్భంగా ఒక్కొక్కరికి అందించే ఆర్థిక సహాయం Rs. 30,000
మహిళా కార్మికులకు, కార్మికుని భార్యకు మరియు కార్మికుని ఇద్దరి కుమార్తెలకు ప్రసూతి సహాయం(2 కాన్పులకు) కింద అందజేసే మొత్తం Rs. 30,000
కార్మికులకు ప్రమాదం లేదా అనారోగ్యం వలన తాత్కాలిక అశక్తత కలిగి చికిత్స నిమిత్తం 5 రోజులు ఆపై ఆసుపత్రిలో చేరిన వారికి రోజుకు Rs. 300 చొప్పున నెలకు Rs. 4,500 కు మించకుండా (మూడు నెలల వరకు) ఆర్థిక సహాయం చేయబడును
కార్మిక శాఖ టోల్ ఫ్రీ నంబర్: 1800-3070-8787
- ప్రమాద బీమా పథకం
రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్ లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఏడాదికి నలభై ఆరు రూపాయల ప్రీమియంతో ఐదులక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది.
గీత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా
గీత కార్మికులకు Rs. 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. మరణించినా, శాశ్వత వైకల్యం పొందిన సమాన పరిహారం అందివ్వనున్నారు.
- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం
మహిళా కార్మికుల ఇద్దరు కూతుర్ల వివాహ కానుకగా ఒక్కొక్కరికి Rs. 30 వేల చొప్పున ఇద్దరు కూతుళ్ల కాన్పుల ప్రయోజనం కింద ఒక్కొక్కరికి Rs. 30 వేల చొప్పున, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి Rs. 6 లక్షల చొప్పున సహాయం అందిస్తారు.