Type Here to Get Search Results !

Vinays Info

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం | World Day of Social Justice

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం | World Day of Social Justice
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.
◾చరిత్ర
పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను అధిగమించడానికి చేయవలసిన కృషికోసం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకోవాలన్న ప్రతిపాదనను 2007, నవంబరు 26న జరిగిన ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, ఎ/ఆర్ఈఎస్/62/10 పై తీర్మానించగా 2009, ఫిబ్రవరి 20న తొలిసారిగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపబడింది.

◾విధులు
  1. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తించి పేదరికం, లింగ సమానత్వం, నిరుద్యోగం, మానవ హక్కులు, సామాజిక రక్షణ వంటి అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం
  2. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య స్నేహ బాంధవ్యాలు ఏర్పాటుచేయడం, సామరస్య వాతావరణం సాధించడం, వివిధ దేశాలమధ్య సమాన ప్రాతిపదికపై సంబంధాలు నెలకొల్పడం
  3. విలువలు, స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, భద్రత, ఆర్థిక సామాజిక పురోభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఎటువంటి వివక్షత పాటించకుండా సామాజిక న్యాయం అమలయ్యేలా చూడడం
➝కార్యక్రమాలు
  1. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక సంస్థలు ఈ దినోత్సవం రోజున సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన కొరకు ప్రచారం చేస్తాయి. సెమినార్లు, సమావేశాలు జరుగుతాయి. పేదలకు సహాయం చేయడానికి నిధులు సేకరించబడతాయి.
  2. సామాజిక న్యాయం యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు బోధించడానికి అనువైన విషయాలలో పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలు ప్రధానమైనవి.
  3. దేశాల వారిగా వివిధ రకాల బోధన విషయాలు ఐక్యరాజ్య సమితి వద్ద అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section