కాటి పాపలు | Kaati Papalu
- అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కాటిపాపలు ఇంద్రజాల ప్రదర్శన చేస్తారు.
- తెలంగాణ జిల్లాలో అధికంగా కనిపిస్తారు.
- గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి శవయాత్రలో పాల్గొని చనిపోయిన వ్యక్తుల గురించి కీర్తించి యాచిస్తారు.
కాటిపాపలు
- కాష్టం / కాడులో పాపలాగా పడుకుంటారు కాబట్టి వీరికి కాటిపాపలు అని పేరు వచ్చింది.
- వీళ్లు బుడిగె జంగం కులంలో ఒక శాఖ వారు. వీళ్లు ఏ కులం వారు చనిపోయినా శవ సంస్కార సమయంలో ఇద్దరు లేక ముగ్గురు పురుషులు ఒక బృందంగా శవం ముందు నడుస్తూ, చనిపోయిన వ్యక్తి గుణ గణాలను, గొప్పదనాన్ని రాజులతో పోల్చి పాట రూపంలో పాడుతారు.
- ఒకరు పాట పాడితే, మిగిలిన ఇద్దరు రామ రామ అని వంత పాడుతూ కర్రతో చేసిన గంటను వాయించుకుంటూ వెళతారు.
- వీళ్లు శవం బయలుదేరినప్పుటి నుండి ఖననం/దహనం చేసేంత వరకు శవం వెంటే ఉంటారు.
- శవం పాడెపైన పెట్టే ముందు వీళ్లు పాడె పైన పడుకుంటారు. అదే విధంగా పదవ రోజు బూడిద ఎత్తే ముందు కాష్టంలో పండుకొని వీరు అడిగినంత డబ్బు ఇచ్చినట్లైతేనే లేస్తారు. లేకపోతే బూడిద ఎత్తనీయరు. అదేవిధంగా పిండం పెట్టేటప్పుడు అడిగిన సంభావన ఇవ్వకపోతే పిట్టను ముట్టనీయకుండా తరుముతూ పీడించి మరీ సంభావనలు గుంజుతుంటారు.
- వీళ్లు మిగతా సమయాల్లో అడుక్కుంటారు. శికారి (వేట) చేస్తారు. ఆడవాళ్లు ఈత చాపలు అల్లుతారు లేదా కూలీ చేస్తారు.