ఇది రాజ్యాంగబద్ద సంస్థ. ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాదు.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వ వ్యయాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేసే స్వతంత్ర సంస్థ.
భారత సంఘటిత నిధి & రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చేసిన వ్యయాన్ని పరిశీలించడం.
ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీలన్నింటిని ఆడిట్ చేస్తుంది.
నోట్: కాగ్ అధికార విధుల గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు. పార్లమెంట్ చట్టం ద్వారా అధికార విధులను నిర్ణయిస్తుంది.
1971లో కాగ్ అధికార విధుల గురించి పార్లమెంట్ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం కాగ్ అంటే.. CAAG (Comptroller Accounts&Auditor General). 1976లో చట్టానికి సవరణ చేసి కాగ్‌ను CAG (Comptroller & Auditor General)గా మార్చారు. ఈ చట్ట సవరణ ద్వారా కాగ్ నుంచి అకౌంట్స్ విధులు వేరుచేశారు. కేవలం ఆడిట్ సంస్థ మాత్రమే.
150 ఆర్టికల్- కేంద్ర, రాష్ర్టాల జమా ఖర్చులు (అకౌంట్స్) కాగ్ సలహాపై రాష్ట్రపతి నిర్ణయించిన విధంగా ఉండాలి.
151 ఆర్టికల్- ఆడిట్ రిపోర్టులు
కేంద్ర ప్రభుత్వ జమా ఖర్చుల ఆడిట్ రిపోర్ట్‌ను కాగ్ రాష్ట్రపతికి సమర్పిస్తుంది. దానిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా చూడాలి.
కాగ్‌తో పాటు కింది అధికారులు, ఉద్యోగులుంటారు
6000 మంది అధికారులు
60,000 మంది ఉద్యోగులు
10 మంది డైరెక్టర్ జనరల్స్ ఉంటారు.
ప్రతి అంశంపైనా కాగ్ 3 దశల్లో ఆడిట్ చేస్తుంది.
ముఖ్యాంశాలు
కాగ్‌ను బహుళ సభ్య సంఘంగా మార్చాలని షుంగ్లు కమిటీ సిఫారసు చేసింది.
కాగ్‌పై విమర్శలు
ఆడిటర్లకు ఆడిటింగ్ మాత్రమే తెలుసునని, పరిపాలనలో వారి పాత్ర పాదచారుల దారివలే చాలా ఇరుగ్గా ఉంటుంది- పాల్ ఆపిల్.బి
కాగ్‌కు తన ఆఫీస్ సిబ్బందిపై ఎలాంటి పరిపాలన నియంత్రణ ఉండదు. అందుకే ఇతన్ని ‘alone wolf without chief’గా పేర్కొన్నది- సర్ ఫ్రాంక్ ట్రైబ్