అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
- మొదటిసారిగా 1833 చార్టర్ చట్టం ద్వారా అటార్నీ జనరల్ నియామకం చేశారు. దీనిని ‘లా మెంబర్'గా పిలిచేవారు.
- రాజ్యాంగం ఈ పదవిని బ్రిటిష్ నుంచి గ్రహించింది.
- భారత ప్రభుత్వ (కేంద్ర) అత్యున్నతమైన అధికారి- అటార్నీ జనరల్. రాజ్యాంగంలో 76, 78 ఆర్టికల్స్ అటార్నీ జనరల్ గురించి పేర్కొంటున్నాయి.
- 76 ఆర్టికల్- నియామకం, అర్హతలు, పదవీకాలం గురించి పేర్కొంటుంది.
- నియామకం- రాష్ట్రపతి ద్వారా
- అర్హతలు- సుప్రీంకోర్ట్ జడ్జిగా నియమించడానికిగల అర్హతలు ఉండాలి.
- పదవీకాలం- రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతారు.
- జీతభత్యాలు- రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జి పొందే జీతభత్యాలుగా పరిగణించాలి. అటార్నీజనరల్ పొందే పారితోషికం ‘Retainer’గా పేర్కొంటారు.
విధులు
- భారత ప్రభుత్వానికి న్యాయ సంబంధమైన సలహాలు ఇవ్వడం
- రాష్ట్రపతి సూచించిన విషయాలపై సుప్రీంకోర్టుకు న్యాయసలహాలు సూచించడం
- పార్లమెంట్ ఏదైనా శాసనం ద్వారా నిర్దేశించిన ఇతర బాధ్యతలను నిర్వర్తించడం
- కేంద్రప్రభుత్వం తరఫున న్యాయవాదిగా ఏ న్యాయస్థానంలోనైనా హాజరుకావచ్చు
- 88 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ సభా కార్యక్రమాలకు హాజరుకావచ్చు.