Type Here to Get Search Results !

Vinays Info

Current affairs

Telangana
Telangana

జీహెచ్‌ఎంసీకి జాతీయ పురస్కారం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి 2016-17కి గాను జాతీయ పర్యాటక పురస్కారం లభించింది. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక అభివృద్ధికి దోహదపడుతున్న రాష్ర్టాలు, కార్పొరేషన్లు, స్వచ్ఛంద సంస్థలకు ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ అవార్డులను ప్రదానం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఉత్తమ పౌరసేవలను కల్పించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.

కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

కరీంనగర్-లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్ గోహెన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సెప్టెంబర్ 26న ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు కాజీపేట, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర చోట్ల రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రైల్వే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు ఆయన శంకుస్థాపనచేశారు. రూ. 106 కోట్లతో మంచిర్యాల-పెద్దంపేట మధ్య నిర్మించిన 3వ లైన్‌ను ప్రారంభించారు. రూ. 1693.45 కోట్లతో చేపట్టిన కాజీపేట-కొండపల్లి మధ్య 3వ రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు.International
Ibrahim-Mohamed-Solih
మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ సోలిహ్మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 23న వెలువడిన ఫలితాల ప్రకారం విపక్షాల అభ్యర్థి సోలిహ్ 58.3 శాతం ఓట్లతో విజయం సాధించారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌కు 41.7 శాతం ఓట్లు వచ్చాయి.

వార్మ్స్ ఎడిటర్‌గా భారతీయుడు

వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెరైన్ స్పీసిస్ వార్మ్స్ ఎడిటర్‌గా భారత్‌కు చెందిన బయోస్పీయాలజిస్ట్ డాక్టర్ షాబుద్దీన్ షేక్ సెప్టెంబర్ 24న నియమితులయ్యారు. ఈ పదవిని పొందిన తొలి భారతీయుడు ఆయనే. ఆయన ఇప్పటివరకు 40 కొత్త జీవులను కనుగొన్నారు. అందులో ఒకదానికి ఆంధ్రా కొయిడస్ షాబుద్దీన్‌గా నామకరణం చేశారు.

హొంజొ, అలిసన్‌లకు మెడిసిన్‌లో నోబెల్

జపాన్‌కు చెందిన తసుకు హొంజొ, అమెరికా శాస్త్రవేత్త జేమ్స్ అలిసన్‌లకు 2018కిగాను మెడిసిన్‌లో నోబెల్ బహుమతి లభించింది. క్యాన్సర్ చికిత్సలో పరిశోధనకు గాను వీరికి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్‌లో అలిసన్, జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీలో హొంజొ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. National
national

పరాక్రమ్ పర్వ్

పరాక్రమ్ పర్వ్-2018 ఎగ్జిబిషన్‌ను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రధాని మోదీ సెప్టెంబర్ 28న ప్రారంభించారు. 2016 సెప్టెంబర్ 29న నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ఏడు ఉగ్రవాద స్థావరాలపై భారతసైన్యం సర్జికల్ ైస్ట్రెక్స్‌లను నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు.

టైమ్స్ ర్యాంకింగ్స్‌లో కేఐఐటీ

టైమ్స్ హయ్యర్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్-2019లో భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)కి తొలిసారిగా చోటు లభించింది. ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో సెప్టెంబర్ 26న ఈ జాబితాను విడుదల చేసింది.

ప్రభుత్వ సంస్థగా జీఎస్‌టీఎన్

జీఎస్టీకి ఐటీ వ్యవస్థను అందించే జీఎస్టీ నెటవర్క్ (జీఎస్‌టీఎన్) ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 26న ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్‌టీఎన్‌లో కేంద్రం, రాష్ర్టాలకు కలిపి 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌ఎస్‌ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఉంది.

నూతన టెలికం విధానానికి ఆమోదం

నూతన టెలికం విధానం నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్‌డీసీపీ) 2018కి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 26న ఆమోదం తెలిపింది. 100 బిలియన్ డార్ల పెట్టుబడులను రాబట్టడంతోపాటు 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ విధానం లక్ష్యాలు.

అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల అస్త్ర క్షిపణిని శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 26న విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమబెంగాల్‌లోని కలైకుండా ఐఏఎఫ్ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి దీన్ని ప్రయోగించారు. 154 కిలోల బరువు, 3.57 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి 20 కి.మీ. నుంచి 110 కి.మీ. దూరంలో గగన తలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.Persons

మోదీకి చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు

అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటుకు కృషిచేసినందుకు భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రన్‌లకు ఐక్యరాజ్యసమితి చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు లభించింది. సౌరశక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు కూడా ఈ అవార్డు లభించింది. ఈ అవార్డులను ఐరాస సెప్టెంబర్ 26న వెల్లడించింది.

ఫోర్బ్స్ జాబితాలో సింధు, ఉపాసన

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజీన్ రూపొందించిన ఫోర్బ్స్ టైకూన్స్ జాబితాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, అపోలో లైఫ్ ఎండీ ఉపాసన కామినేనికి చోటు లభించింది. క్రీడ, వ్యాపార, నటన రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన 22 మంది భారత యువ సాధకులతో రూపొందించిన ఈ జాబితాను సెప్టెంబర్ 24న విడుదల చేసింది.

సుశీల్ కుమార్ మోదీ

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి (జీఓఎం) అధ్యక్షునిగా బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28న ప్రకటించింది. ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై జీఓఎంను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీలో అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్ సభ్యులుగా ఉన్నారు.

బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీలకు కొత్త చీఫ్‌లు

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ)లకు కొత్త చీఫ్‌లను కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 27న నియమించింది. బీఎస్‌ఎఫ్‌కు 1984 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన రజినీకాంత్ మిశ్రా, ఎస్‌ఎస్‌బీకి 1984 బ్యార్ హర్యానా ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఎస్‌ఎస్ దేశ్వాల్ నియమితులయ్యారు.

ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా పద్మజ చంద్రూ సెప్టెంబర్ 27న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆమె ఎస్‌బీఐలో గ్లోబల్ మార్కెట్స్ విభాగానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ ప్రొ.కుమార్

ఓయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొ.ఎం.కుమార్‌కు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా-టీఎస్ శాఖ ప్రతి ఏటా అందించే ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించారు. ఇటీవల జరిగిన ఇంజినీర్స్ డే సందర్భంగా సంస్థ అవార్డును ప్రదానం చేసింది. Book Review
book

సైదులు కరెంట్ అఫైర్స్

ఇటీవల జరిగిన గ్రూప్-4, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రశ్నల సరళి పరిశీలిస్తే వాటి ప్రాధాన్యత అర్థమవుతుంది. ఎటువంటి క్లిష్టమైన ప్రశ్నలు ఇచ్చినా జవాబులు గుర్తించాలంటే పరీక్షల నాడి పట్టుకోవాలి. ఈ రంగంలో రెండుదశాబ్దాల అనుభవం గడించిన వేముల సైదులు గత తొమ్మిది నెలల అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ విషయాలను సంక్షిప్తంగా.. సరళంగా పొందుపర్చిన పుస్తకమే 9 నెలల కరెంట్ అఫైర్స్. ఎంసీరెడ్డి పబ్లికేషన్స్ నుంచి రివైజ్డ్ ఎడిషన్ విడుదలైంది. దీనిలో సెప్టెంబర్ చివరి వరకు జరిగిన ప్రతి సంఘటనను పరీక్షల కోణంలో చక్కగా రూపొందించారు. తక్కువ సమయంలో కచ్చితంగా అవసరమైన విషయాలను చదవడానికి ఉద్యోగార్థులకు ఈ బుక్ ఎంతో ఉపయుక్తంగా ఉంది. పేజీలు:240, ధర: రూ.200/- పుస్తకాల కోసం ఎంసీరెడ్డి పబ్లికేషన్స్, అశోక్‌నగర్ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్. సెల్ నంబర్లు: 9246577890, 9949833833.Sports
ASIA-CUP-2018

ఆసియా కప్ విజేత భారత్

ఆసియా కప్ వన్డే టోర్నీ-2018 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్‌లో సెప్టెంబర్ 29న జరిగిన 14వ ఆసియా కప్ (13 సార్లు వన్డే, ఒక సారి టీ20) ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ కప్‌ను భారత్ సాధించడం ఇది ఏడోసారి.

మహిళల టీ20 సిరీస్ విజేత భారత్

భారత్-శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 4-0తో సిరీస్‌ను గెలుచుకుంది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ జరగలేదు. ఈ సిరీస్‌లో భారత మహిళ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section