హైదరాబాద్ సంస్థానంలో 1943-44 నాటికి ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4 వేలకు
పెరిగింది. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడటంతో ప్రాథమిక విద్యకు
నిధుల కొరత ఏర్పడింది. విద్యారంగానికి కేటాయించిన వాటాలో అధిక భాగం
యూనివర్సిటీకి కేటాయించడంతో ఈ కొరత ఏర్పడింది.
- హైదరాబాద్ సంస్థానంలో మొదటి ఇంగ్లిష్ పాఠశాలగా నేటి సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌ను పేర్కొంటున్నారు. దీన్ని 1834లో చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ పీఠాధిపతి ఏర్పాటు చేశారు. తర్వాత రోమన్ క్యాథలిక్‌లు మరో పాఠశాలను నెలకొల్పారు. అదే ప్రస్తుతం ఆల్‌సెయింట్స్ స్కూల్‌గా పేరొందింది. 1843లో అమీర్ కబీర్ షంగల్ ఉమ్రా హైదరాబాద్‌లో స్థాపించిన మదర్సా పకారియాతో రాష్ట్రంలో జాతీయ విద్యారంగంలో నూతన శకం ప్రారంభమైంది. షంగల్ ఉమ్రా ప్రసిద్ధ విద్యావేత్త.
- నాటి ప్రధాని సాలార్‌జంగ్ 1856లో దారుల్ ఉలూమ్ అనే పాఠశాలను పత్తర్‌గట్టీలోని తన దేవిడిలో స్థాపించారు. ప్రభుత్వ పాఠశాల స్థాపనకు జరిగిన తొలి ప్రయత్నం ఇది. మొదట్లో ఇందులో 130 మంది విద్యార్థులుండేవారు. వీరి సంఖ్య క్రమంగా పెరగడంతో అఫ్జల్‌గంజ్, యాకుత్‌పురా, చాదర్‌ఘాట్, పురానాపూల్, అలియాబాద్ బస్తీల్లో దీని శాఖలను ఏర్పాటుచేశారు. దారుల్ ఉలూమ్ పంజాబ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. ప్రస్తుత సిటీ కాలేజీ ఆ రోజుల్లో దారుల్ ఉలూమ్ ఇంగ్లిష్ విభాగంగా ఉండేది.
- 1859లో ఒక గస్తీ (జీఓ) విడుదలైంది. దీని ప్రకారం జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఒకటి చొప్పున పార్సీ పాఠశాలలను, స్థానిక భాషల పాఠశాలను స్థాపించడానికి అవకాశం దక్కింది. వీటి నిర్వహణ రెవెన్యూ అధికారులు చూసుకునేవారు. 1870లో మొదటిసారిగా విద్యకు ఒక ప్రత్యేకశాఖ ఏర్పడింది. విలియం విల్‌కిన్సన్ విద్యాశాఖ మొదటి కార్యదర్శి. 1882లో విద్యాశాఖ డైరెక్టరేట్ ఏర్పడింది. దీని స్థాపనతో మహతమీన్, ఇన్‌స్పెక్టర్ల నియామకం అమల్లోకి వచ్చింది.
- ఆ రోజుల్లో సుబాకు ఒక ఇన్‌స్పెక్టర్‌ను నియమించేవారు. సంస్థానంలో మొత్తం నాలుగు సుబాలుండేవి. ఒక్కో సుబాలో నాలుగు జిల్లాలు, ఆ నాలుగు జిల్లాలకు ఒక ఇన్‌స్పెక్టర్ ఉండేవాడు. 1873లో నార్మల్ స్కూళ్ల స్థాపన జరిగింది. ఇది విజయవంతం కావడంతో వరంగల్, గుల్బర్గాల్లో ఒకటి చొప్పున ప్రారంభించారు. ఇవి దారుల్ ఉలూమ్‌కు అనుబంధంగా ఉండేవి. 1877లో స్థానిక భాషల పాఠశాలను రద్దుచేశారు.
- 1880లో చాదర్‌ఘాట్ హైస్కూల్ (హైదరాబాద్ కాలేజీ) స్థాపన జరిగింది. ఇది ఫస్ట్ గ్రేడ్ కాలేజీగామారి మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. కేవలం తమ కుటుంబం పిల్లల విద్యకోసం సాలార్‌జంగ్ స్థాపించిన మదర్సా ఆలియా 19 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. 1901 నాటికి ఈ సంఖ్య 200లకు చేరింది. జాగీర్దార్లు, ధనికుల పిల్లల కోసం మలక్‌పేట మదర్సా ఐజాను ఆలియాతో పాటే స్థాపించారు.
- ఇవి రెండు ఇంగ్లిష్ విద్యాబోధన సంస్థలు. ఇందులో సామాన్యుల పిల్లలకు ప్రవేశం లభించేది కాదు. మదర్సా ఆలియాలో రెండంచెల పాఠ్య ప్రణాళిక ఉండేది. ఇంగ్లిష్, లాటిన్, చరిత్ర, భూగోళం, విజ్ఞానశాస్త్రం, గణితం మొదటి అంచెలో, అరబ్బీ, పార్సీ, ఉర్దూ వంటి ఇతర స్థానిక భాషల బోధన రెండో అంచెలో ఉండేది. మొదటిసారిగా కిండర్‌గార్డెన్ తగతులు ప్రారంభమైనది ఈ పాఠశాలలోనే. హైదరాబాద్ సివిల్ సర్వీస్ తరగతులు కూడా ఇక్కడే నిర్వహించేవారు. 1896లో హైదరాబాద్ కాలేజీ నిజాం కాలేజీగా మారింది. హైదరాబాద్ కాలేజీలోని హైస్కూల్ తరగతులను మదర్సా ఆలియాలో కలిపివేశారు.
- ప్రారంభంలో నిజాంకాలేజీలో విద్యార్థుల సంఖ్య 55 మాత్రమే. మొదటి ప్రిన్సిపల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ. 1883లో మదర్సా నిజామియా ఏర్పాటయ్యింది. ఇందులో ఇస్లాం మత బోధన ప్రధాన అంశంగా ఉండేది. మదర్సా ఆలియా, మదర్సా ఐజాలు విద్యారంగంలో దూసుకుపోవడాన్ని గమనించిన పాత బస్తీ ఖత్రీ కులస్థులు 1879లో ముఫీదుల్ ఆనాం హైస్కూల్‌ను, కాయస్తులు 1880లో ధర్మవంత్ హైస్కూలును స్థాపించారు. ఆల్‌సెయింట్స్ గ్రామర్‌స్కూల్, బొల్లారం హైస్కూల్, రోమన్ క్యాథలిక్ మిషన్ స్కూళ్లను దాదాపు ఒకేసారి ఏర్పాటు చేశారు.
- నిజాం కాలేజీలా మరో కాలేజీని 1892లో ఔరంగాబాద్‌లో ప్రారంభించారు. ఆశించినస్థాయిలో విద్యార్థులు లేకపోవడంతో 1905లో మూసివేశారు. దీనికి ప్రధాన కారణం మద్రాసు పద్ధతి అయిన హెచ్‌ఎస్‌ఎల్‌సీ విద్యా విధానానికి ఆదరణ లేకపోవడం.
- 1882 వరకు హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రంలోని మరొక ప్రాంతంలో హైస్కూల్‌ను ప్రారంభించలేదు. మొత్తం సంస్థానంలో రెండు జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇంగ్లిష్, స్థానిక భాషల్లో మిడిల్ స్కూళ్లు పనిచేశాయి. 1883లో నవాబ్ ఇమాదుల్ ముల్క్ డీపీఐగా వచ్చిన తర్వాత 1890 నాటికి వరంగల్, ఔరంగాబాద్, బీదర్‌లో ఉన్నత పాఠశాలలు ఏర్పడ్డాయి. మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో మాధ్యమిక పాఠశాలలు మాత్రమే ఉండేవి.
- దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి అక్షరాస్యత 14 శాతం మాత్రమే. హైదరాబాద్ సంస్థానంలో 1943-44 నాటికి ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4 వేలకు పెరిగింది. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడటంతో ప్రాథమిక విద్యకు నిధుల కొరత ఏర్పడింది. విద్యారంగానికి కేటాయించిన వాటాలో అధిక భాగం యూనివర్సిటీకి కేటాయించడంతో ఈ కొరత ఏర్పడింది.
- యూనివర్సిటీ స్థిరపడాలంటే సంస్థానంలోని వివిధ ప్రాంతాల్లో సెకండరీ పాఠశాలలను ఏర్పాటుచేయాలి. దీంతో 1923-27 మధ్యకాలంలో ప్రాథమిక విద్యారంగంలో స్తబ్ధత ఏర్పడింది. 1929లో ఏర్పడిన అంజుమన్-ఏ-తరక్కీ హైదరాబాద్ అనే సంస్థ ప్రాథమిక నిర్బంధ విద్యను సంస్థానంలో ప్రవేశపెట్టాలని సూచించింది. 1917 ఏప్రిల్ 24న ఉర్దూ బోధనా భాషగా ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది.
- ఉర్దూ నిజాం ప్రభుత్వ అధికార భాష
- ఇతర దేశ భాషలతో ఉర్దూకు సన్నిహిత సంబంధం ఉండటం
- 225 మంది విద్యార్థులు 25 మంది అధ్యాపకులతో ఇంటర్మీడియట్ తరగతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. 1923 నాటికి ఎంఏ, ఎల్‌ఎల్..... తరగతులు ప్రారంభించారు. వరంగల్, గుల్బర్గా, ఔరంగాబాద్‌లలో ఇంటర్మీడియట్ కళాశాలలు ఏర్పడ్డాయి.
- 1924లో ఇంటర్ మహిళా కళాశాల ఏర్పడింది. పాఠ్యగ్రంథాలను ఉర్దూలో రచించడానికి దారుల్ తర్జుమాను అబ్దుల్ హక్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు.
- పాఠ్యగ్రంథ రచనలో, ప్రభుత్వ రంగంలోనూ ఉత్తరాది ఉర్దూనే ప్రాథమిక భాషగా గుర్తించి వాడారు. దీన్నే బాబా-ఏ-ఉర్దూ అనేవారు. స్థానికంగా వాడుకలో ఉన్న ఉర్దూను దక్కనీ ఉర్దూ అని పిలిచేవారు. ఉర్దూ భాషకు అప్పటి నుంచే ముల్కీ, నాన్ ముల్కీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఓయూ ఏర్పాటుతో మెజారిటీ ప్రజలైన హిందువులకు సంస్థానంలో పెద్దగా లాభం చేకూరలేదని కింది గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు.
- 1881-1931 వరకు ముస్లింలలో చదువుకున్న వారి సంఖ్య రెట్టింపయ్యింది. ఇది హిందువుల్లో మాత్రం 0.4 శాతం మాత్రమే.
- దేశంలో గొప్ప విద్యాకేంద్రంగా పేరుగాంచిన మద్రాసు విశ్వవిద్యాలయం ఏర్పడిన 50 ఏండ్ల తర్వాత ఇక్కడ విద్యారంగం మేల్కొన్నది. మద్రాసు మెట్రిక్ (హెచ్‌ఎస్‌ఎల్‌సీ) పాస్ కాలేక చాలామంది విద్యార్థులు పరీక్ష తప్పేవారు. పంజాబ్, అలహాబాద్ విశ్వవిద్యాలయాలు అప్పుడప్పుడే ఏర్పడినా వాటి ప్రమాణాలు కలకత్తా, మద్రాసు విశ్వవిద్యాలయాల కంటే తక్కువగా ఉండేవి.
- పంజాబ్ విశ్వవిద్యాలయ విద్య సులభమని సంస్థాన ప్రజలు అటువైపు మొగ్గు చూపేవారు. హైదరాబాద్ సంస్థానంలో ఉద్యోగాలు ఉన్నత కుటుంబాల వారికి, పలుకుబడి కలిగిన ముస్లింలకు మాత్రమే దక్కేవి. హైస్కూల్ స్థాయిలో విద్యను పటిష్టపర్చాలనే ఉద్దేశంతో 1904 నుంచి మిడిల్ కఠినతరం చేశారు. దీంతో మిడిల్ కంటే మెట్రిక్ పాస్ కావడమే సులభం అనిపించే విధంగా విద్యావిధానం ఉండేది.
- మిడిల్ పాస్‌కావడం కష్టతరం కావడంతో మెట్రిక్ పరీక్షకు కూర్చునేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ పోయింది. పంజాబ్ విశ్వవిద్యాలయం వారు మిడిల్ పాస్ కావడానికి 35 మార్కులు పెట్టి, మెట్రిక్ పాస్ కావడానికి 30 మార్కులు నిర్ణయించారు. - సంస్థానంలో ఒక నిర్దిష్టమైన విద్యావిధానం లేక ప్రజలకు తెలివిగలిగితే ఎదురుతిరుగుతారనే ఉద్దేశంతో అనాటి నిజాం పాలకులు వ్యవహరించారు. 1989లో హైదరాబాద్ విద్యామహాసభకు పునాదులుపడ్డాయి. ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత ఈ సంస్థ నిర్వీర్యం అయింది. నిజాంల 200 ఏండ్ల పాలనలో తెలుగు దిక్కులేని భాష అయింది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రసిద్ధిగాంచిన తెలుగు భాష.. తెలంగీ బేడంగీ (ముక్కు ముఖం లేని భాష)గా అపకీర్తిని మూటగట్టుకుంది. పాలకుల ఆదరణ కోల్పోయినా తెలుగు భాష ప్రజల హృదయాల్లో మాత్రం పదిలంగానే ఉంది.
- నాటి తెలంగాణలో తెలుగు దీపం ఆరిపోకుండా కృషి చేసినవారు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు. ఈయన కృషివల్లనే 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం ఏర్పడింది. తెలంగాణలోని మొదటి సాహిత్య సంస్థ ఇదే. ఆంధ్ర సారస్వత పరిషత్తు, విజ్ఞానవర్ధిని పరిషత్తు, ఆంధ్ర చంద్రిక, అణా గ్రంథమాల మొదలైన సంస్థలు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి దోహదపడ్డాయి. 1904లో హనుమకొండలో శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయంతో ఈ సాహితీ ఉద్యమం ఊపందుకుంది. ఆంధ్రోద్యమం ఆ తదుపరి గోల్కొండ పత్రికతో పటిష్ఠపడి ఆంధ్రపితామహుడు మాడపాటి హనుమంతరావు రాసిన మహోంధ్రోదయంతో ముందుకు సాగింది.
- ఆంధ్ర జనసంఘం 1931 నాటికి ఆంధ్రమహాసభగా పరిణామం చెందింది. తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువుకునే అవకాశం కల్పించాలనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. మాతృభాష ద్వారా చదువుకునే అవకాశం కల్పించాలనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా 1940లో మాడపాటి హనుమంతారావు పరోపకారి బాలికా పాఠశాలను స్థాపించాడు. ఇది కొంతకాలం అఫ్జల్‌గంజ్‌లోని బాలసరస్వతి ఆంధ్రభాషానిలయంలో నడిచింది. రెసిడెన్సీ బజారు (ఇప్పటి సుల్తాన్ బజార్) బ్రిటిష్‌వారి ఆధిపత్యంలో ఉండేది.
- దీంతో అక్కడ తెలుగు, మహారాష్ట్ర భాషల్లో బాలికల కోసం 1928లో ఒక పాఠశాలను స్థాపించారు. ఆర్థిక సమస్యలతో ఈ పాఠశాలలు నడవలేక మూతపడ్డాయి. అప్పుడు మాడపాటి హనుమంతరావు వడ్డకొండ నరసింహారావు సహాయంతో దాన్ని ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలగా మార్చి నడిపారు. దీనికి ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు గుర్తింపు ఇవ్వడానికి నిరాకరిస్తే మాడపాటి హనుమంతరావు కృషితో పూణే మహిళా విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు లభించింది.
- 1945 నుంచి ఈ పాఠశాల బాలికలకు ఆంధ్ర విశ్వవిద్యాలయ మెట్రిక్ పరీక్షకు కూర్చునే అవకాశం లభించింది. 1944లో ఆంధ్ర విద్యాలయం స్థాపించారు. 1947లో అది ఉన్నత పాఠశాలగా మారి తర్వాత ఏవీ కళాశాలగా ఉన్నత శిఖరాలను అందుకుంది.
- అంటరానితనం నిర్మూలనకు 1925లో హైదరాబాద్‌లో ఆదిహిందూ నేషనల్ సర్వీస్ లీగ్ ఏర్పడింది. దీనికి భాగ్యరెడ్డివర్మ కార్యదర్శి. ఇందులో వామన్నాయక్, మాడపాటి హనుమంతరావు, వడ్డకొండ నరసింహారావు, బొజ్జం నర్సింలు మొదలైన వారు సభ్యులుగా ఉండేవారు. బొజ్జం నర్సింలు హైదరాబాద్‌లో 22 పాఠశాలలను బాలికల కోసం స్థాపించారు. 1936-37లో మహాత్మాగాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఈ 22 పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు గాంధీకి గౌరవ వందనం సమర్పించారు.
- 1874 నుంచి సంస్థానంలో మొదటిసారిగా లిఖిత పరీక్ష విధానం ఏర్పడింది. 1884లో ఉర్దూను అధికార భాషగా ప్రకటించారు. 1898 విద్యాశాఖ వివరాల ప్రకారం ఆర్ట్స్ కళాశాలలు హైదరాబాద్, ఔరంగాబాద్‌లో, ఒక దారుల్ ఉలూమ్ ఓరియంటల్ కాలేజీ, 15 హైస్కూళ్లు, 47 మిడిల్‌స్కూళ్లు, 682 ప్రైమరీ స్కూళ్లు, ఆరు స్పెషల్ స్కూళ్లు ఉన్నాయి. ప్రతి ఏడాది వీటిపై రూ.6 లక్షలు ఖర్చు చేశారు. 15 హైస్కూళ్లలో 11 హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
- సికింద్రాబాద్‌లోని వెస్లియన్ స్కూల్ హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ హైస్కూళ్లు బాలికల విద్య కోసం ఏర్పడిన తొలినాటి బాలికల పాఠశాలలు. 1882 నాటికి రాష్ట్రంలో బాలికల విద్య కోసం మూడు మిడిల్ స్కూళ్లు, 8 ప్రైమరీ స్కూళ్లు ఏర్పడ్డాయి. 1891 నుంచి 1912 వరకు 13,601 మంది విద్యార్థులు మిడిల్ పరీక్ష రాస్తే అందులో 4,140 మంది ఉత్తీర్ణులయ్యారు.
- ఉత్తీర్ణత శాతం ఏడాదికి మూడు మాత్రమే. 1879 నుంచి 1910 వరకు 2,674 మంది మెట్రిక్ పరీక్షకు హాజరైతే కేవలం 555 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి సంఖ్య ఏటేటా నూటికి నలుగురు మాత్రమే. అదేవిధంగా బీఏ పరీక్షలో 1883 నుంచి 1912 వరకు ఏడాదికి ఇద్దరు చొప్పున పాసయ్యేవారు.

బోధనా భాషగా ఉర్దూ-కారణాలు
- ఉర్దూ దేశంలో విస్తృత ప్రచారంలో ఉన్న భాష- ఉర్దూ నిజాం ప్రభుత్వ అధికార భాష