Type Here to Get Search Results !

Vinays Info

ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్లండి

పారిశ్రామిక కారిడార్లు మొదటి దశంలో అభివృద్ధి చేసేవి... హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-భువనగిరి. రెండోదశలో.. హైదరాబాద్-మంచిర్యాల, హైదరాబాద్-నల్లగొండ,
హైదరాబాద్-ఖమ్మం.

THubPhase

ఐటీ పరిశ్రమ

- ఇది రాజధాని చుట్టుపక్కల మాత్రమే విస్తరించి ఉంది.
- దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది.
- ఈ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) పాలసీ-2010-15ను ప్రకటించారు.
- దీనివల్ల మల్టీనేషనల్ కంపెనీ (ఎంఎన్‌సీ)లు, ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్, ఒరాకిల్, డెల్, మోటరోలా, అమెజాన్ వంటి కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి.- దేశంలో ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు మార్గదర్శిగా తెలంగా మొదటి స్థానంలో ఉంది.
1. హైటెక్‌సిటీ-మాదాపూర్ (హైదరాబాద్)
2. టీ-హబ్- ఐఐఐటీ క్యాంపస్, గచ్చిబౌలి
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల సహాయసహకారాలను అందించడానికి దీన్ని ఏర్పాటు చేశారు.
- దేశంలో ప్రభుత్వరంగంలో ఏర్పాటుచేసిన మొదటి ఇంక్యుబేటర్.
- టీ-హబ్ మొదటి దశకు క్యాటలిస్ట్ (భవనం పేరు) అని పేరుపెట్టారు.
- దీని వ్యవస్థాపక భాగస్వాములుగా ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ ఉన్నాయి.
- టీహబ్ ద్వితీయశ్రేణి పట్టణంగా వరంగల్‌ను గుర్తించారు.
- ప్రైవేట్, ప్రజా సంస్థల భాగస్వామ్యంలో రాష్ట్రప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల ప్రత్యక్షంగా 15 లక్షలు, పరోక్షంగా 53 లక్షల మంది ఉపాధిపొందుతున్నారు.
- టీ హబ్ నినాదం- ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్లండి.

నూతన పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలు టీఎస్ ఐపాస్

- నూతన పారిశ్రామిక విధాన చట్టమైన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ ఐపాస్)ను 2014లో రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.
- నూతన పారిశ్రామిక విధానం 2015, జూన్ 12న అమల్లోకి వచ్చింది.
- నినాదం: ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్‌కార్పొరేట్.
- ఇది సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతి.
- ఉద్దేశం: అన్ని విభాగాలకు సంబంధించిన అనుమతులు సింగిల్‌విండో పద్ధతిలో త్వరితగతిన పరిశ్రమలకు సొంత పూచీతో అనుమతులు మంజూరు చేయడం.
- టీఎస్-ఐపాస్ చట్టం- 2014 మార్గదర్శకాల ప్రకారం రూ. 200 కోట్లపైన మూలధనవ్యయం ఉన్నవి- మెగా ప్రాజెక్టులు
- దీనికి 15 రోజుల్లో అనుమతివ్వాలి. లేదంటే రోజుకు రూ. 1000 చొప్పున జరిమానా విధిస్తారు.
- రూ. 10 కోట్లు - 200 కోట్లు మూలధన వ్యయం కలిగినవి- భారీ పరిశ్రమలు
- రూ. 5 కోట్లు - 10 కోట్లు మూలధన వ్యయం కలిగినవి- మధ్యతరహా పరిశ్రమలు
- రూ. 25 లక్షలు- 5 కోట్లు మూలధన వ్యయం కలిగి నవి- చిన్నతరహా పరిశ్రమలు
- రూ. 25 లక్షల వరకు మూలధన వ్యయం కలిగినవి- సూక్ష్మ పరిశ్రమలు
- వీటన్నింటికి 30 రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలి.
- టీఎస్ ఐపాస్ కింద 2017, జనవరి 24 నాటికి అనుమతులు మంజూరైన సంస్థలు- 3,327.

టీ-ప్రైడ్

- తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రైజెస్ (టీ-ప్రైడ్) ప్రధాన ఉద్దేశం... ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించడం.

టీ-ఐడియా

- తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్ (టీ-ఐడియా) ఉద్దేశం.. నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం సాధారణ కేటగిరీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించడం.

టీ-హార్ట్

- రాష్ట్రంలోని సంప్రదాయ కళలు, హస్తకళల అభివృద్ధి తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్డినెన్స్ రివైవల్ విత్ టెక్నాలజీ ప్రోగ్రామ్ (టీ-హార్ట్) ప్రధాన ఉద్దేశం.

టీ-అసిస్ట్

- తెలంగాణ స్టేట్ యాక్సెలరేటెడ్ ఎస్‌ఎస్‌ఐ స్కిల్స్ ట్రైనింగ్ (టీ-అసిస్ట్) ద్వారా పారిశ్రామికంగా ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.
రిచ్ (రిసెర్చ్ అండ్ ఇన్వెన్షన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్)
- పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, వెంచర్ పెట్టుబడిదారులు, ఇంక్యుబేషన్‌లకు వేదిక హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కరణల సర్కిల్ (రిచ్).

ఫార్మాసిటీ

- రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 14 వేల ఎకరాల్లో ఔషధాలు, కాస్మొటిక్స్ తయారీ మొదలైనవాటికి సంబంధించి సకల సౌకర్యాలను కల్పిస్తారు. దేశంలో బల్క్ డ్రగ్స్ తయారీలో 1/3వంతు తెలంగాణలో ఉత్పత్తి అవుతాయి.
- ఎయిరోస్పేస్ పార్క్- ఆదిభట్ల
- టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్)- ఇది ప్రభుత్వం, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలకు సంబంధించింది.
- హార్డ్‌వేర్ పార్క్- రావిర్యాల
- నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి)- సంగారెడ్డి
- మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్- ఈదుల నాగులపల్లి
- గేమింగ్ అండ్ యానిమేషన్- రాయదుర్గం. ఈ పార్కులో స్టూడియోలు, ల్యాబ్‌లు, బిజినెస్ సెంటర్ల వంటి సౌకర్యాలు ఉంటాయి.
కాకతీయ మెగా జౌళి పార్కు
- వరంగల్ రూరల్ జిల్లాలోని చింతలపల్లి, శాయంపేట (సంగెం, గీసుకొండ మండలాలు) మధ్య ఏర్పాటు.
- ఈ పార్కుకు సీఎం కేసీఆర్ 2017, అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు.
- నినాదం: కాటన్ టు క్లాత్, ఫాం టు ఫ్యాషన్

లక్ష్యాలు

- ఇది దేశంలో అతిపెద్ద జౌళి పార్కు.
- ఇతర రాష్ర్టాలకు వలసలను అరికట్టడం, అన్నిరకాల వస్ర్తాలను ఉత్పత్తి చేయడం.
- 20వేల మందికి ప్రత్యక్షంగా 5వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం.
- పెట్టుబడిదారు పారిశ్రామిక అనుమతి పొందడం ఒక చట్టబద్ధ హక్కుగా కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
- 2016లో సులభ వాణిజ్యంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 98.78 స్కోర్‌తో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.
గమనిక: 2017లో సులభ వాణిజ్యంలో తెలంగాణ 98.33 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచింది.

పారిశ్రామిక కారిడార్లు

మొదటి దశలో అభివృద్ధి చేసే కారిడార్డు
1. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్
2. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్
3. హైదరాబాద్-భువనగిరి పారిశ్రామిక కారిడార్

రెండో దశ

1. హైదరాబాద్-మంచిర్యాల పారిశ్రామిక కారిడార్
2. హైదరాబాద్-నల్లగొండ పారిశ్రామిక కారిడార్
3. హైదరాబాద్-ఖమ్మం పారిశ్రామిక కారిడార్

పారిశ్రామిక విధాన మౌలిక విలువలు

- ప్రభుత్వ నియంత్రణ చట్టం పారిశ్రామిక వృద్ధికి దోహదపడాలి.
- పారిశ్రామికీకరణ సమ్మిళితంగా ఉండాలి, సామాజిక సమానత్వానికి దోహదపడాలి.
- పారిశ్రామికీకరణ ప్రయోజనాలు రాష్ట్రంలోని అట్టడుగు, సామాజికంగా అణగారిన వర్గాలవారికి చేరాలి.
- పారిశ్రామికాభివృద్ధి భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు తద్వారా స్థానిక యువతరానికి ప్రయోజనాలు.

ప్రాక్టీస్ బిట్స్

1. పరిశ్రమలు ఉత్పాదకాలను బట్టి ఏరంగానికి చెందినవి? 1) ప్రాథమికరంగం
2) ద్వితీయరంగం
3) తృతీయరంగం
4) ఏదీకాదు

2. తెలంగాణ పారిశ్రామికరంగం రాష్ట్ర జీవీఏలో ఎంతశాతం వాటాను కలిగి ఉంది?

1) 24
2) 17
3) 30
4) 27

3. పారిశ్రామిక రంగంవల్ల రాష్ట్రంలోని మొత్తం శ్రామికశక్తిలో ఎంతశాతం మందికి ఉపాధి లభిస్తుంది?

1) 16
2) 17
3) 37
4) 14

4. రాష్ట్రంలో అత్యధిక-అత్యల్ప పారిశ్రామిక యూనిట్లు ఉన్న జిల్లా?

1) హైదరాబాద్-ఆసిఫాబాద్
2) మేడ్చల్ మల్కాజిగిరి-జయశంకర్ భూపాలపల్లి
3) మేడ్చల్ మల్కాజిగిరి-జోగుళాంబ గద్వాల
4) కరీంనగర్-రంగారెడ్డి

5. దేశంలో అతిపురాతన, ఎక్కువమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ?

1) ఇనుము ఉక్కు పరిశ్రమ
2) జనపనార పరిశ్రమ
3) వస్త్రపరిశ్రమ
4) తోళ్లపరిశ్రమ

6. రాష్ట్రంలో అధిక నూలువస్త్ర పరిశ్రమలున్న జిల్లా?

1) ఆసిఫాబాద్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) హైదరాబాద్జవాబులు: 1-2,
2-1,
3-2,
4-2,
5-3,
6-4

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section