Type Here to Get Search Results !

Vinays Info

4th Class EVS Lesson 2.ఆటలు - నియమాలు

నాలుగో తరగతి - ఈవియస్
2.ఆటలు - నియమాలు

కబడ్డీ ఆట నియమాలు

1) కూత మద్యగీత మొదలు పెట్టి, మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి. కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లు.
2) ఆటగాళ్లు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లు.
3) అవుటైన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి.
4) జట్టుకు పాయింట్ వచ్చినపుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి.
5) ఆటగాళ్లు గోళ్లు పెంచుకోరాదు.
6) శరీరానికి నూనెలాంటి పదార్థాలు రాసుకొని ఆడరాడు.
7)ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు, జడపట్టుకొని లాగడం చేయరాదు.

1) రోడ్లపై ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు నియమాలు (Traffic Rules) ఉంటాయి.
అనగా
▪ఎర్రలైటు వెలిగినపుడు - ఆగడం
▪ఆరెంజ్ లైటు వెలిగినపుడు - వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం
▪ పచ్చలైటు వెలిగినపుడు - ముందుకు వెళ్లడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు.

2) పట్టణాల్లో నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ను ఏర్పాటు చేస్తారు.
3) రద్దీ సమయంలో వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోకుండా నియంత్రణకై, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. వీటి వల్ల ప్రమాదాలు నివారించబడుతాయి.
4) రోడ్డు పై వెళ్లేవారు తమ ఎడమవైపు నడవడమనేది రోడ్డుకు సంబంధించిన విషయం.
5) రోడ్డుపైన చారలు గీసి ఉన్నచోట మనుష్యులు రోడ్డు దాటడానికి ఉపయోగిస్తారు. దీనినే జీబ్రా క్రాసింగ్ అంటారు. ఇవి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడుతాయి. దీని వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి.

▪సైనానెహ్వాల్ - బ్యాడ్మింటన్
▪విశ్వనాథన్ ఆనంద్ - చెస్
▪మిథాలీరాజ్ - క్రికెట్
▪మేరీకోమ్ - బాక్సింగ్
▪కోనేరు హంపీ - చెస్
▪కరణం మల్లీశ్వరి - వెయిట్ లిఫ్టింగ్
▪గగన్ నారాంగ్ - షూటింగ్
▪సానియా మీర్జా - బ్యాడ్మింటన్

6) ఆటలో ఓడిపోవడం, గెలవడం రెండు ఉంటాయి. ఎదో ఒక జట్టు మాత్రమే గెలుస్తుంది.
7) గెలిచిన జట్టును విజేత అంటారు.
8) ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని అభినందించుకోవడాన్ని - క్రీడాస్ఫూర్తి అంటారు.

ఆటలు ఆడటం - పిల్లల హక్కు

1) ప్రతిరోజు ఆడ, మగ అనే తేడా లేకుండా పిల్లలందరూ తప్పనిసరిగా ఆదుకోవాలి. ఇది పిల్లల హక్కు.

2) సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఉన్న సమయం ఆటల సమయం.
3) ఆటలు బాగా ఆడటం వల్ల మనకు గుర్తింపు వస్తుంది.
4) మనదేశం కబడ్డీ జట్టు కబడ్డీ ఆటలో బంగారు పతకం సాధించింది. అట్లే 2011లో మనదేశ క్రికెట్ జట్టు ప్రపంచకప్పు గెలిచింది.
5) కరణం మల్లీశ్వరి, సైనానెహ్వాల్, మేరీ కోమ్, గగన్ నారాంగ్, విజేందర్ సింగ్, పి.టి ఉష, పి.వి.సింధు, సాక్షిమాలిక్ వంటి వాళ్ళు మనదేశ పక్షాన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించారు.
6) వీరి వల్ల మనదేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడించాయి.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section