Type Here to Get Search Results !

Vinays Info

జూనియర్ పంచాయతీ కార్యదర్శి మోడల్ పేపర్ - Paper 2

1. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018 ఎప్పటి నుంచి అమల్లో వచ్చింది?

1) 2018, ఏప్రిల్ 1
2) 2018, ఏప్రిల్ 4
3) 2018, ఏప్రిల్ 13
4) 2018, ఏప్రిల్ 18

2. బల్వంత్‌రాయ్ కమిటీకి సంబంధించి కింది వాటిలో సరికానిది?

1) కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసు కార్యక్రమాల పనితీరును పరిశీలించడం కోసం ఏర్పాటు చేశారు
2) ఈ కమిటీ 1957, జనవరిలో ఏర్పాటైంది
3) ఈ కమిటీ సిఫారసులను 1959, జనవరిలో ఎన్‌డీసీకి సమర్పించింది
4) ఈ కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసింది

3. తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎంత?

1) 27.98 లక్షల హెక్టార్లు
2) 28.98 లక్షల హెక్టార్లు
3) 26.98 లక్షల హెక్టార్లు
4) 25.98 లక్షల హెక్టార్లు

4. కింది వాటిలో గ్రామ పంచాయతీలకు అధికంగా రాబడినిచ్చే పన్ను ఏది?

1) ఇంటి పన్ను
2) నల్లా పన్ను
3) సీవరేజి పన్ను
4) పార్కింగ్ పన్ను

5. రాష్ట్రంలో ఎన్ని చేనేత సహకార సంఘాలు ఉన్నాయి?

1) 528
2) 627
3) 648
4) 731

6. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారా సుమారుగా ఎంతమందికి ఉపాధి కల్పించారు?

1) 2 లక్షలు
2) లక్ష మందికి
3) 1.5 లక్షలు
4) 4 లక్షలు

7. సక్రమంగా విధులు నిర్వర్తించనప్పుడు గ్రామ పంచాయతీ పాలకమండలిని ఎవరు రద్దు చేస్తారు?

1) కలెక్టర్
2) పంచాయతీరాజ్ కమిషనర్
3) రాష్ట్ర ప్రభుత్వం
4) పంచాయతీరాజ్ శాఖ మంత్రి

8. గ్రామ సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో కింది వారిలో ఎవరికి సంబంధం లేదు?

1) కమిషనర్
2) జిల్లా కలెక్టర్
3) రెవెన్యూ డివిజనల్ అధికారి
4) ఎంపీడీవో

9. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు కానివారు?

1) జిల్లా కలెక్టర్
2) మండల పరిషత్‌లోని అన్ని గ్రామాల సర్పంచులు
3) జిల్లా పరిషత్ చైర్మన్
4) పంచాయతీరాజ్ శాఖ మంత్రి

10. గ్రామసభకు సంబంధించి సరికానిది ఏది?

1) గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులు
2) గ్రామసభ రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది
3) 1000 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో గ్రామసభ నిర్వహించడానికి కావాల్సిన కోరం 50 మంది
4) పైవన్నీ సరైనవే

11. కింది వారిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు లేనివారు?

1) ఎస్సీలు
2) బీసీలు
3) వికలాంగులు
4) మహిళలు

12. ఉపసర్పంచ్‌పై పదవీ కాలంలో ఎన్నిసార్లు అవిశ్వాసం పెట్టవచ్చు?

1) మూడు
2) ఒకటి
3) నాలుగు
4) రెండు

13. గ్రామ పంచాయతీలో ఎక్స్ అఫీషియో సభ్యులు?

1) సర్పంచ్
2) వీఆర్‌వో
3) జడ్పీటీసీ సభ్యుడు
4) పంచాయతీ కార్యదర్శి

14. గ్రామ కార్యదర్శి నిర్వహించని రిజిస్టర్?

1) అక్విటెన్స్ రిజిస్టర్
2) క్యాష్‌బుక్
3) ధర్మదాతలు, ట్రస్టుల రిజిస్టర్
4) కాస్మొటిక్స్ రిజిస్టర్

15. గ్రామ పంచాయతీ ఆస్తుల లీజును రెండోసారి పొడిగించాలంటే ఎవరి అనుమతి అవసరం?

1) జిల్లా పంచాయతీ అధికారి
2) ఎంపీడీవో
3) జిల్లా కలెక్టర్
4) గ్రామ పంచాయతీ

16. చెట్ల ఫలసాయం అమ్మడంవల్ల వచ్చే ఆదాయాన్ని ఏ రిజిస్టర్‌లో నమోదు చేయాలి?

1) చిట్టా
2) ఆదాయం వస్తున్న ఆస్తుల రిజిస్టర్
3) మిసిలీనియస్ డిమాండ్ రిజిస్టర్
4) క్యాష్‌బుక్

17. సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికి ఉద్దేశించిన పథకం?

1) ప్రధాన మంత్రి కృషి సించయ్ యోజన
2) భూమి హీన కిసాన్ పథకం
3) ప్రధాన మంత్రి కౌశల్ యోజన
4) పరంపరాగత్ కృషి వికాస్ యోజన

18. గ్రామీణ యువత పట్టణాలకు వలస వెళ్లకుండా నిరోధించడానికి ఉద్దేశించిన పథకం?

1) ఉన్నతి స్కిల్స్
2) శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్
3) రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తికరణ్ అభియాన్
4) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన

19. గ్రామజ్యోతి పథకానికి సంబంధించి సరికానిది?

1) ఈ పథకాన్ని 2015, ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించారు
2) ఈ పథకం మన ఊరు - మన ప్రణాళిక కార్యక్రమానికి కొనసాగింపు
3) గ్రామాభివృద్ధికి తొమ్మిది కమిటీలు ఉంటాయి
4) పారిశుద్ధ్య, తాగునీటి కమిటీకి చైర్మన్ సర్పంచ్

20. 14వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం గ్రామ పంచాయతీలకు తలసరి సహాయం రూపాయల్లో?

1) 500
2) 446
3) 447
4) 448

21. తెలంగాణలో రైతు బీమా పథకంలో భాగంగా ఒక్కో రైతుకు చెల్లించే వార్షిక ప్రీమియం ఎంత?

1) రూ. 2251.50
2) రూ. 2271.50
3) రూ. 2571.50
4) రూ. 2871.50

22. జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ)ను ఎవరు గుర్తిస్తారు?

1) రాష్ట్ర ఎన్నికల సంఘం
2) పంచాయతీరాజ్ కమిషన్
3) జిల్లా కలెక్టర్
4) ఆర్డీఓ

23. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు కానివారు?

1) జిల్లా కలెక్టర్
2) వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు
3) తహసీల్దార్
4) మండలంలోని సర్పంచులు

24. జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ కేటాయింపులో వినియోగించే రొటేషన్ పద్ధతి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి?

1) ఎస్సీ (మహిళ), ఎస్టీ (మహిళ), ఎస్టీ, ఎస్సీ
2) ఎస్సీ, ఎస్సీ (మహిళ), ఎస్టీ, ఎస్టీ (మహిళ)
3) ఎస్టీ, ఎస్టీ (మహిళ), ఎస్సీ, ఎస్సీ (మహిళ)
4) ఎస్టీ, ఎస్టీ (మహిళ), ఎస్టీ (మహిళ), ఎస్సీ

25. కింది వాటిలో ఏ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్ వర్తించదు?

1) జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక
2) మండల పరిషత్ చైర్మన్ ఎన్నిక
3) గ్రామ సర్పంచ్ ఎన్నిక
4) జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ ఎన్నిక

26. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ని స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు?

1) నాలుగు
2) మూడు
3) ఐదు
4) ఒకటి

27. మండల పరిషత్ సమావేశాలకు హాజరయ్యే ఎవరికి అలవెన్సులు చెల్లిస్తారు?

1) ఎమ్మెల్యే
2) పార్లమెంట్ సభ్యులు
3) మండల పరిషత్ వైస్ చైర్మన్
4) పైవారందరూ

28. కింది వారిలో రహస్య ఓటింగ్ పద్ధతిలో ప్రజల ద్వారా ఎన్నిక కానివారు?

1) జడ్పీటీసీ సభ్యుడు
2) ఎంపీటీసీ సభ్యుడు
3) గ్రామ సర్పంచ్
4) మండల పరిషత్ వైస్ చైర్మన్

29. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద గ్రామ పంచాయతీల శ్రామికుల బడ్జెట్ ప్రణాళికలను ఎవరు ఆమోదిస్తారు?

1) గ్రామ పంచాయతీ
2) జిల్లా పరిషత్
3) మండల పరిషత్
4) జిల్లా కలెక్టర్

30. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి సరికానిది?

1) ఒక్క యూనిట్‌కి 21 గొర్రెలను ఇస్తారు
2) లబ్ధిదారుల ఎంపిక బృందంలో తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు
3) యూనిట్ వ్యయం రూ.1,25,000 ఉంటుంది. ఇందులో 75 శాతం రాయితీ
4) ఈ పథకం కాలపరిమితి నాలుగేండ్లు

31. రైతుబంధు పథకానికి సంబంధించి సరికాని అంశం ఏది?

1) 2018, మే 1న ప్రారంభించారు
2) శాలపల్లి, ఇందిరానగర్‌లో కేసీఆర్ ప్రారంభించారు
3) ఎకరానికి ఏడాదికి ఒక రైతుకు రూ.8,000 సహాయం
4) పైవన్నీ సరైనవే

32. తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణం ఎంత?

1) 58.70 లక్షల హెక్టార్లు
2) 59.70 లక్షల హెక్టార్లు
3) 57.70 లక్షలక్ష హెక్టార్లు
4) 60.30 లక్షల హెక్టార్లు

33. తెలంగాణలో అత్యధిక స్థూల సాగు విస్తీర్ణం గల జిల్లా?

1) నల్లగొండ
2) సంగారెడ్డి
3) నిజామాబాద్
4) మహబూబ్‌నగర్

34. అత్యధిక పంటల సాంద్రత గల జిల్లా?

1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) వరంగల్
4) నిజామాబాద్

35. తెలంగాణలో మొత్తం ఆహారేతర పంటల్లో అత్యధికంగా పండించే పంట ఏది?

1) పసుపు
2) పత్తి
3) వేరుశనగ
4) సోయాబీన్

36. తెలంగాణలో మొత్తం రైతుల్లో ఉపాంత, చిన్న రైతులు ఎంత శాతం ఉన్నారు?

1) 60 శాతం
2) 70 శాతం
3) 75 శాతం
4) 80 శాతం

37. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి సరికాని అంశం?

1) 2016, ఖరీఫ్ కాలంలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
2) వాణిజ్య, ఉద్యాన పంటలకు బీమా ప్రీమియం బీమా మొత్తంలో 5 శాతం
3) ఖరీఫ్‌లో ఆహార పంటలకు బీమా ప్రీమియం బీమా మొత్తంలో 2 శాతం
4) ఖరీఫ్‌లో నూనె గింజలకు ప్రీమియం బీమా మొత్తంలో 3 శాతం

38. తెలంగాణలో సుమారుగా ఎన్ని ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు?

1) 20 లక్షలు
2) 12 లక్షలు
3) 15 లక్షలు
4) 9 లక్షలు

39. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో అత్యధిక యూనిట్లు గల పరిశ్రమలు?

1) సూక్ష్మ పరిశ్రమలు
2) చిన్నతరహా పరిశ్రమలు
3) మధ్యతరహా పరిశ్రమలు
4) ఏదీకాదు

40. రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమలు ఎంఎస్‌ఎంఈ రంగంలో ఎంత శాతం ఉపాధి కల్పిస్తున్నాయి?

1) 60 శాతం
2) 42 శాతం
3) 52 శాతం
4) 62 శాతం

41. తెలంగాణలో భౌగోళిక గుర్తింపునకు సంబంధించి సరైన జత?

1) పోచంపల్లి - ఇక్కత్
2) గద్వాల- చీరలు
3) సిద్దిపేట - గొల్లభామ చీరలు
4) పైవన్నీ సరైనవి

42. కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగాటెక్స్‌టైల్స్ పార్కును ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు?

1) వరంగల్ అర్బన్
2) వరంగల్ రూరల్
3) మహబూబాబాద్
4) భద్రాద్రి కొత్తగూడెం

43. రాష్ట్రంలో అత్యధిక స్వయం సహాయక బృందాలు ఉన్న జిల్లా ఏది?

1) నల్లగొండ
2) ఖమ్మం
3) రంగారెడ్డి
4) హైదరాబాద్

44. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల సంఖ్య ఎంత?

1) 4.20 లక్షలు
2) 5 లక్షలు
3) 4.70 లక్షలు
4) 5.10 లక్షలు

45. స్వయం సహాయక బృందాలను మొదటగా ఏర్పాటు చేసింది?

1) మహమ్మద్ అలీ
2) మహమ్మద్ యూనస్
3) మహమ్మద్ యూసఫ్
4) జవహర్‌లాల్ నెహ్రూ

46. డ్వాక్రా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1980-81
2) 1981-82
3) 1982-83
4) 1983-84

47. ఆరోగ్యలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?

1) 2015, జనవరి 1
2) 2014, జనవరి 1
3) 2016, జనవరి 1
4) 2007, జనవరి 1

48. కింది వాటిలో గ్రామ పంచాయతీ విధించే ఐచ్ఛిక పన్ను కానిది?

1) వ్యవసాయ భూములపై పన్ను
2) ఖాళీ స్థలాలపై పన్ను
3) ప్రకటనలపై పన్ను
4) పైవన్నీ

49. కింది వాటిలో ఇంటి పన్ను నుంచి మినహాయింపు పొందినవి?

1) ప్రభుత్వ పాఠశాలలు
2) పబ్లిక్ లైబ్రరీలు
3) ప్రభుత్వ దవాఖానలు
4) పైవన్నీ

50. గ్రామ పంచాయతీ వేసే వేలానికి సంబంధించి మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు?

1) సర్పంచ్
2) ఎంపీడీఓ
3) డివిజనల్ పంచాయతీ అధికారి
4) జిల్లా కలెక్టర్

51. పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు? (2)

1) ఏప్రిల్ 18
2) ఏప్రిల్ 24
3) ఏప్రిల్ 22
4) ఏప్రిల్ 25

52. 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటగా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తమిళనాడు
4) రాజస్థాన్

53. రాజ్యాంగంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏ నిబంధనలో పేర్కొన్నారు?

1) 243K
2) 243
3) 243 H
4) 243 I

54. గ్రామాలను లిటిల్ రిపబ్లిక్స్‌గా అభివర్ణించిన వారు?

1) లార్డ్ రిప్పన్
2) చార్లెస్ మెట్కాఫ్
3) లార్డ్ హోర్డింగ్
4) లార్డ్ మేయో

55. ఇటావా ప్రయోగం (1948) ఎక్కడ అమలు చేశారు?

1) బీహార్
2) ఉత్తరప్రదేశ్
3) పంజాబ్
4) రాజస్థాన్

56. జవహర్‌లాల్ నెహ్రూ ఏ పథకాన్ని నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించారు?

1) సమాజ అభివృద్ధి పథకం
2) సేవాగ్రాం ప్రయోగం
3) జాతీయ విస్తరణ సేవా ప్రయోగం
4) ఇటావా ప్రయోగం

57. పంచాయతీ వ్యవస్థను పేర్కొన్న రాజ్యాంగంలోని విభాగాలు?

1) 11వ షెడ్యూలు
2) రాజ్యాంగంలోని 9వ భాగం
3) ఆర్టికల్ 40
4) పైవన్నీ

58. హైదరాబాద్ సంస్థానంలో మొదటిసారి పంచాయతీరాజ్ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1940
2) 1939
3) 1941
4) 1942

59. ప్రతి గ్రామపంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి ఉండాలని ఏ సెక్షన్ పేర్కొంటుంది?

1) 42
2) 41
3) 40
4) 43

60. సర్పంచ్ పదవికి ఉపఎన్నికలు ఎన్ని రోజుల్లో జరపాలి?

1) 180 రోజులు
2) 150 రోజులు
3) 120 రోజులు
4) 80 రోజులు

61. లే అవుట్ అనుమతులు ఎవరి నుంచి పొందాలి?

1) గ్రామసభ
2) గ్రామ పంచాయతీ
3) తహసీల్దార్
4) ఎంపీడీవో

62. గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ గురించి కింది వాటిలో సరైనది?

1) తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018, సెక్షన్ 141లో పేర్కొన్నారు
2) ఈ ట్రిబ్యునల్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు
3) స్థానిక సంస్థలపై అవగాహన కలిగి ఉన్న ఒకరిని ప్రభుత్వం సభ్యుడిగా నియమిస్తుంది
4) పైవన్నీ

63. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 29 అధికారాలను కొత్త చట్టంలో ఏ షెడ్యూల్‌లో పేర్కొన్నారు?

1) షెడ్యూల్ 1
2) షెడ్యూల్ 2
3) షెడ్యూల్ 3
4) షెడ్యూల్ 4

64. మండల పరిషత్ ఎన్ని అధికారాలు, విధులను నూతన పంచాయతీరాజ్‌చట్టంలోని షెడ్యూల్‌లో పేర్కొన్నారు?

1) 14
2) 11
3) 15
4) 18

65. జీతాల ఖాతా?

1) నామమాత్రపు ఖాతా
2) అస్థిత్వ ఖాతా
3) వ్యక్తిగత ఖాతా
4) వాస్తవిక ఖాతా

66. నామమాత్రపు ఖాతాల స్వభావం?

ఎ. ఖర్చులు, నష్టాలు డెబిట్ చేయాలి
బి. లాభాలు, ఆదాయాలు క్రెడిట్ చేయాలి
1) 1, 2 సరైనవి
2) 1, 2 సరైనవికావు
3) 1 సరైంది 2 కాదు
4) 1 సరికాదు 2 సరైంది

67. వ్యక్తిగత స్వభావం?

ఎ. ప్రయోజనం పొందే వ్యక్తిని డెబిట్ చేయాలి
బి. ఇచ్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి
1) ఎ, బి రెండూ తప్పు
2) ఎ, బి రెండూ సరైనవి
3) ఎ సరైంది బి సరైంది కాదు
4) ఎ, బికి సరైన వివరణ కాదు

68. కింది అంశాలను జతపర్చండి?

1. అమ్మకాల చిట్టా
ఎ. సరుకును నగదుకు కొనుగోలు
2. నగదు చిట్టా
బి. సరుకు అరువు కొనుగోలు
3. అమ్మకాల వాపస్ చిట్టా
సి. సరుకు అరువు అమ్మకాలు
4. కొనుగోలు చిట్టా
డి. ఖాతాదారుల నుంచి వాపసు
5. నగదు వసూళ్లు
ఇ. నగదు చెల్లింపులు
1) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
2) 1-సి, 2-ఇ, 3-డి, 4-బి
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-డి
4) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి

69. మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం ఉద్దేశించిన పథకం?

1) నయీ రోష్ని
2) షాదీ ముబారక్
3) అమృత
4) దిల్దార్

70. సంసద్ ఆదర్శ గ్రామ యోజనను ప్రధాన మంత్రి ఎక్కడ ప్రారంభించారు?

1) వారణాసి
2) జైపూర్
3) హైదరాబాద్
4) అయోధ్య

71. గ్రామ ఉదయ్ భారత్ అభియాన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?

1) 2015
2) 2016
3) 2017
4) 2014

72. ఆరోగ్య లక్ష్మి పథకం ముఖ్యోద్దేశం?

1) గర్భిణుల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం
2) మహిళా శిశు మరణాల రేటును తగ్గించడం
3) బాలింతలకు, గర్భిణులకు ఒక పూట పూర్తిభోజనాన్ని ప్రతిరోజు అందించడం
4) పైవన్నీ సరైనవే

73. ఈ- పంచాయతీ కార్యక్రమాన్ని మొదట ఎక్కడ ప్రారంభించారు?

1) బీబీనగర్
2) బీబీపేట
3) సిద్దిపేట
4) గజ్వేల్

74. అన్నారం బ్యారేజీ ఏ జిల్లాలో ఉంది?

1) జయశంకర్ భూపాలపల్లి
2) పెద్దపల్లి
3) మంచిర్యాల
4) ఖమ్మం

75. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు?

1) పదో ప్రణాళిక
2) పదకొండో ప్రణాళిక
3) తొమ్మిదో ప్రణాళిక
4) ఎనిమిదో ప్రణాళిక

76. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఎన్ని?

1) 790
2) 890
3) 298
4) 1012

77. ్ర పాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో స్పాన్సర్డ్ బ్యాంకుల వాటా?

1) 50 శాతం
2) 15 శాతం
3) 35 శాతం
4) 40 శాతం

78. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు?

1) ఆర్బీఐ
2) నాబార్డ్
3) ఎస్‌బీఐ
4) ఏదీకాదు

79. కిసాన్ క్రెడిట్ కార్డుల చెల్లుబాటు కాలం ఎంత?

1) రెండేండ్లు
2) మూడేండ్లు
3) 50 ఏండ్లు
4) ఏడాది

80. కోనేరు రంగారావు కమిటీని ప్రభుత్వం ఎప్పుడు నియమించింది?

1) 2004, అక్టోబర్ 1
2) 2004, సెప్టెంబర్ 1
3) 2004, డిసెంబర్ 1
4) 2004, నవంబర్ 1

81. పబ్లిక్ రోడ్లపై మురుగునీరు ప్రవహింపజేసినట్లయితే ఎంత జరిమానా విధించవచ్చు?

1) రూ. 100
2) రూ. 1000
3) రూ. 500
4) రూ. 5000

82. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీల 29 అధికారాలను పేర్కొంటుంది?

1) 243I
2) 243J
3) 243G
4) 243H

83. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉండవచ్చు?

1) 30 శాతం
2) 27 శాతం
3) 24 శాతం
4) 34 శాతం

84. జిల్లా పరిషత్ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించి నియంత్రించే అధికారం ఉన్నవారు?

1) జిల్లా పంచాయతీ అధికారి
2) జిల్లా కలెక్టర్
3) జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి
4) జడ్పీటీసీ సభ్యుడు

85. జిల్లా పరిషత్ సీఈవో రూపొందించిన బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?

1) జిల్లా కలెక్టర్
2) రాష్ట్ర ప్రభుత్వం
3) పంచాయతీరాజ్ కమిషనర్
4) జిల్లా పంచాయతీ అధికారి

86. నూతన పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటును తెలియజేసే సెక్షన్ ఏది?

1) 196
2) 197
3) 195
4) 199

87. గ్రామ కో-ఆప్టెడ్ సభ్యునిగా ఎవరిని నియమించవచ్చు?

1) పదవీ విరమణ చేసిన ఉద్యోగి
2) గ్రామీణ అభివృద్ధిని కాంక్షించే సీనియర్ సిటిజన్
3) గ్రామ పంచాయతీ దాత
4) పైవారందరూ

88. తెలంగాణలో అత్యధిక గ్రామపంచాయతీలు ఉన్న జిల్లా?

1) నల్లగొండ
2) సంగారెడ్డి
3) మహబూబ్‌నగర్
4) జయశంకర్ భూపాలపల్లి

89. తెలంగాణలో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఎన్ని?

1) 1336
2) 1326
3) 1316
4) 1306

90. హరితహారంలో భాగంగా అడవులను రాష్ట్రంలో ఎంత శాతానికి పెంచాలని లక్ష్యం?

1) 30 శాతం
2) 27 శాతం
3) 33 శాతం
4) 50 శాతం

91. అకౌంటింగ్ విధులు కానిది?

1) గుర్తించండం
2) నమోదు చేయడం
3) వర్గీకరించడం
4) అభివృద్ధి చేయడం

92. కింది వాటిలో వాస్తవిక ఖాతాలు కానివి?

1) భూముల ఖాతా
2) భవనాల ఖాతా
3) గుడ్‌విల్ ఖాతా
4) డిస్కౌంట్ ఖాతా

93. దక్షిణ వ్యవసాయ వాతావరణ మండలంలో లేని జిల్లా?

1) వికారాబాద్
2) సంగారెడ్డి
3) హైదరాబాద్
4) నల్లగొండ

94. పంచాయతీ కార్యదర్శి తన విధుల్లో భాగంగా తన గ్రామ పరిధిలో గుర్తించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు గరిష్ఠంగా ఎన్ని గంటల్లోపు ఫిర్యాదు ఇవ్వాలి?

1) 12 గంటలు
2) 24 గంటలు
3) 36 గంటలు
4) 48 గంటలు

95. అకౌంటింగ్ అంటే ఆర్థిక సమాచారాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు సమాచారాన్ని గుర్తించి కొలిచి తెలిపే ప్రక్రియ అని తెలిపింది?

1) అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అకౌంట్స్
2) అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్
3) అకౌంట్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికన్
4) చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ అమెరికా

96. అకౌంటింగ్ చక్రం?

1) చిట్టా, ఆవర్జా, అంకణ, వర్తకపు లాభనష్టాల ఖాతా, ఆస్తిఅప్పుల పట్టిక
2) ఆవర్జా, అంకణ, వర్తకపు లాభనష్టాల ఖాతా, ఆవర్జా, ఆస్తిఅప్పుల పట్టిక
3) అంకణ, వర్తకపు లాభనష్టాల ఖాతా, ఆవర్జా, ఆస్తిఅప్పుల పట్టిక
4) వర్తకపు లాభనష్టా ఖాతా, ఆస్తిఅప్పుల పట్టిక, అంకణ

97. పంచాయతీరాజ్ అభ్యర్థుల అర్హతలు అనర్హతలు నిర్వచించే ఆర్టికల్ ఏది?

1) 243 D
2) 243E
3) 243F
4) 243G

98. 2015, జూన్ 25న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది?

1) పీఎంజీఎస్‌వై
2) పీఎంఏవై
3) ఎస్‌ఏజీవై
4) ఆర్‌జీఎస్‌ఏ

99. చేపల పంపిణీ పథకం ద్వారా ఎంత శాతం చేపలను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?

1) 30 శాతం
2) 40 శాతం
3) 50 శాతం
4) 60 శాతం

100. అంత్యోదయ అన్న యోజన పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందించే బియ్యం పరిమాణం?

1) 30 కిలోలు
2) 35 కిలోలు
3) 40 కిలోలు
4) 36 కిలోలు
Ans1
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section