Type Here to Get Search Results !

Vinays Info

Deserts in the World

World  Deserts ప్రపంచ ఎడారులు

ప్రపంచంలో వాతావరణ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో ఎడారులు ప్రత్యేకమైనవి. ఒక పక్క అత్యధిక ఉష్ణోగ్రతలు, మరో పక్క ఎముకలు కొరికే చలితో.. ఎడారి ప్రాంతాలు విభిన్నంగా ఉంటాయి. ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ ప్రాంతాల్లో వర్షాన్ని చూడగలం. అయినా ఇక్కడ కూడా ప్రజలు నివసిస్తున్నారు. భూమిపై 1/3వ వంతు వైశాల్యంలో ఎడారులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎడారులు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి మీకోసం...

*సహారా ఎడారి*

 *సహారా అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద ఎడారి అని అర్థం.*
 ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారుల్లో ఇదీ ఒకటి. సహారా ఎడారి ప్రధానంగా ఆఫ్రికాలో ఉంది.
 ఈ ఎడారి వైశాల్యం దాదాపు 9,000,000 చదరపు కిలోమీటర్లు.
వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలంత పెద్దది, ఆస్ర్టేలియా కంటే పెద్దది కూడా.
 ఈజిప్టు, లిబియా, మొరాకో, అల్జీరియా, మాలీ, నైగర్‌ సెనెగల్‌, ట్యునీషియా, చాద్‌, సూడాన్‌ మొదలైన పన్నెండు దేశాల్లో ఇది విస్తరించి ఉంది.
 ఒంటెలు, ఉష్ట్రపక్షులు, తేళ్లు, అడాక్స్‌, డంగ్‌ బీటిల్‌ వంటివి ఇక్కడ కనిపిస్తాయి.
 చాద్‌ వంటి సరస్సులతో పాటు ఒయాసిస్సులు, మానవ నిర్మిత జోహాడ్‌(చిన్న తరహా నీటి గుంతలు) ఇక్కడ ఉన్నాయి.

*థార్‌ ఎడారి*

*థార్‌ ఎడారి భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో ఉంది. దీన్నే ‘గ్రేట్‌ ఇండియన్‌ డిసెర్ట్‌’ అని పిలుస్తారు.*
 ఇది రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
 పాకిస్తాన్‌ ఉన్న ఎడారి భూభాగాన్ని ‘ఖలిస్తాన్‌’ అని పిలుస్తారు.
 భారత్‌లో ఇదే అతి పెద్ద ఎడారి.అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ఎడారి ప్రదేశం. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 83 మంది నివసిస్తున్నారు. ఇతర ఎడారుల్లో ఈ సంఖ్య 7 మాత్రమే.
 థార్‌ ఎడారిలో అనేక ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి.
 ఒయాసిస్‌లు, జోహాడ్‌లు ఇక్కడ ఉన్నాయి.
 దీని విస్తీర్ణం 2,38,700 చదరపు కిలోమీటర్లు.
 ఈ ఎడారిలో ప్రపంచంలోని మిగిలిన ఎడారుల్లో కంటే ఎక్కువ జీవులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 23 రకాల పాకే జీవులు, 25 జాతుల సర్పాలు ఉన్నాయి. దాదాపు 140 పక్షి జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి.

*గోబీ ఎడారి*

ఇది ఆసియాలోకెల్లా అతి విస్తారమైన ఎడారి. ప్రపంచంలోనే శీతలమైన ఎడారి కూడా ఇదే.
 ఇది చైనాలోని ఉత్తర, వాయువ్య ప్రాంతంలోనూ, మంగోలియాలోని దక్షిణ భాగంలోనూ వ్యాపించి ఉంది.
 విశిష్టమైన మంగోల్‌ సామ్రాజ్యంతో పాటు, సిల్క్‌ రోడ్డు వంటి ప్రముఖ నగరాలను కలిగిన ప్రాంతంగా గోబీ ఎడారికి ప్రత్యేక స్థానం ఉంది.
 ఇక్కడ వర్షం పడటం చాలా అరుదు. ఎందుకంటే.. వర్షాన్ని కలిగిన మేఘాలు గోబీ ప్రాంతాన్ని చేరకుండా హిమాలయ పర్వతాలు అడ్డుపడుతుండటమే అందుకు కారణం. సంవత్సరానికి సగటున ఇక్కడ 194 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది.
 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ అత్యంత ఎక్కువ, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం విశేషం.
 మొట్టమొదటి డైనోసర్‌ గుడ్లతో సహా ఎన్నో శిలాజాలకు గోబీ ఎడారి కేంద్ర బిందువుగా ఉంది.
 బాక్ర్టియన్‌ ఒంటెలు, మంగోలియన్‌ అడవి గాడిదలు, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, గాజెల్లు వంటి అనేక జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఎన్నో మూలికా వృక్షాలకు గోబీ ఎడారి నిలయం.

*అటకామా ఎడారి*

 ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది.
 ఎడారిలో వర్షపాతం దాదాపు శూన్యం. ప్రతి 6, 7 ఏళ్లకు ఒకసారి ఇక్కడ వర్షం పడుతుంది. ఆ సమయంలో ఎడారి ‘పూల వనం’లా మారిపోతుంది. *200 రకాల భిన్నమైన మొక్కల పూలు విచ్చుకుంటాయి. అటకామాలో అరుదుగా సంభివించే మాయను ‘ఫ్లవరింగ్‌ డిజర్ట్‌’ లేదా ‘డిజర్టో ఫ్లొరిడో’ అని అంటారు.*
 ఇది 1000 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది.
*ప్రపంచంలోనే అతి పొడి ఎడారి ఇదే.*
 ఈ ఎడారి వయసు 200 మిలియన్‌ సంవత్సరాలు.

*మీకు తెలుసా?*

*ఆఫ్రికాలో ఉన్న ‘లిబియా’ ఎడారి సహజ వాయువులు, పెట్రోలియం నిల్వలకు ప్రసిద్ధి.*  కలహారి ఎడారి ఇదే దేశంలో ఉంది.
ఇవే కాకుండా అరిజోనా, సోనార, పెటగోనియా, విక్టోరియా, గ్రేట్‌ శాండే, మంగోలియా, తక్లామకాన్‌, ఎడారులు ఉన్నాయి.
*మ్యాపుల్లో ఎడారులను బూడిద రంగులో చూపిస్తారు.*
           🍃🌷🌷🍃

Top Post Ad

Below Post Ad

Ads Section