Type Here to Get Search Results !

Vinays Info

Loksaba and Rajya Saba

Loksabha and Rajya Saba

లోకసభ
» 1954లో లోక్‌సభ స్పీకర్ జి.వి.మౌలాంకర్ హౌస్ ఆఫ్ పీపుల్‌కు 'లోక్‌సభ' అని నామకరణం చేశారు.
» దీన్ని ప్రజాప్రతినిధుల సభ, ప్రజల సభ, దిగువ సభ అని కూడా వ్యవహరిస్తారు.
» ఇది తాత్కాలిక సభ.
» లోక్‌సభలో మొత్తం గరిష్ఠ సభ్యుల సంఖ్య 552. (రాష్ట్రాల నుంచి 530 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 స్థానాలు, ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు)
» ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం సభ్యులు 545.
(530 మంది సభ్యులు రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు)
» ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
» లోక్‌సభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు.
» లోక్‌సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.
» లోక్‌సభలో ఒక పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటే 10% స్థానాలు కైవసం చేసుకోవాలి.
» లోక్‌సభలో తొలి ప్రతిపక్ష నాయకుడు వై.బి.చవాన్.
» లోక్‌సభ సభ్యులను వయోజన ఓటుహక్కుతో ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
» లోక్‌సభ రెండు సమావేశాల మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించకూడదు.
» 5వ లోక్‌సభ 6 సంవత్సరాలు పనిచేసింది.
» అవిశ్వాస తీర్మానం ద్వారా మంత్రిమండలిని తొలగించే అధికారం లోక్‌సభకు ఉంది.

రాజ్యసభ

» రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు.
» 1954లో రాజ్యసభగా నామకరణం చేశారు.
» రాజ్యసభను పెద్దల సభ, ఎగువ సభ, మేధావుల సభగా వ్యవహరిస్తారు.
» ఇది శాశ్వత సభ.
» సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు.
» ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు.
» రాజ్యసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 250.
» వీరిలో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు.
» సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజిక సేవల్లో ప్రసిద్ధులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
» ప్రస్తుత రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245.
» వీరిలో 233 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు.
» రాజ్యసభలో అధిక స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రాలు వరుసగా ఉత్తర్‌ప్రదేశ్ (31), మహారాష్ట్ర (19) తమిళనాడు (18).
» తెలంగాణకు 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.
» ఆంధ్రప్రదేశ్‌కు 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.
» కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీకి 3 స్థానాలు, పాండిచ్చేరికి ఒక స్థానం ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలకు రాజ్యసభ స్థానాలు లేవు.
» రాజ్యసభలో తొలి ప్రతిపక్ష నాయకుడు కమలాభాయ్ త్రిపాఠి.
» రాజ్యసభ సభ్యురాలిగా చేసిన తొలి నటి జయప్రద.
» రాజ్యసభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు 30 సంవత్సరాలు.
» రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.
» అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం కేవలం రాజ్యసభకు మాత్రమే ఉంది.
» ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
» రాజ్యసభకు ఉపరాష్ట్రపతి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
» రాజ్యసభ ఆర్థిక బిల్లును 14 రోజుల వరకు నిలుపుదల చేయవచ్చు.

మ‌రిన్ని విష‌యాలు

» ద్రవ్య సంబంధమైన బిల్లులను లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.

» ఆర్థిక బిల్లులను తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు. 14 రోజుల లోపు రాజ్యసభకు పంపాలి.

» ప్రస్తుత లోక్‌సభ 16వది.

» లోక్‌సభలో అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రాలు వరుసగా ఉత్తర్‌ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48), పశ్చిమ్‌బంగ (42).

» అతి ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన లోక్‌సభ 16వది.

» 16వ లోక్‌సభలో మహిళల సంఖ్య 62

.» 16వ లోక్‌సభ తర్వాత అతి ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన సభ 15వది.

» 15వ లోక్‌సభలో మహిళల సంఖ్య 59.

» ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎక్కువమంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

» ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (కె.గీత, బి.రేణుక)

» తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క మహిళా ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.(కె.క‌విత‌)

» కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగి ఉంది.

» మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఒక్కో లోక్‌సభ స్థానాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.

» ఒక్కో లోక్‌సభ స్థానం మాత్రమే కలిగి ఉన్న రాష్ట్రాలు నాగాలాండ్, సిక్కిం, మిజోరాం.

Top Post Ad

Below Post Ad

Ads Section