Type Here to Get Search Results !

Vinays Info

World Day for Migrated Birds | ప్రపంచ వలస పక్షుల దినోత్సవం

World Day for Migrated Birds |  ప్రపంచ వలస పక్షుల దినోత్సవం
_పక్షులు వచ్చాయంటే ఆ సంవత్సరం వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయనేది  స్థానికుల నమ్మకం._
◆ఈ వలస పక్షుల దినోత్సవంను 2006సం" నుంచి ప్రతి సంవత్సరం మే నెల రెండవ వారాంతం లో జరుగుతున్నది.
2017 theme "Their Future is our Future"
*★ఈ దినోత్సవం నాడు వలస పక్షులు,*
*వాటి నివాస ప్రదేశాల రక్షణ గురించి ప్రచారం, అవగాహనా కార్యక్రమాలు,పక్షులపండుగలు, వలస పక్షుల విజ్ఞాన విషయాలు, వలస పక్షుల పరిశీలనకై వాటి నివాస ప్రదేశాల సందర్శన మొదలగునవి జరుపుతారు.*
★ నేస్తాలూ! మనం అప్పుడప్పుడు అమ్మా నాన్నతో కలిసి బజారుకెళ్తుంటాం కదా.
అక్కడ మనం ఏదైనా షాప్ లో బొమ్మల్నే చూస్తూ నిలబడిపోయారనుకోండి. తర్వాత చూస్తే పక్కన మీ వాళ్లు ఎవరూ లేరనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? అక్కడినుండి ఇంటికెలా వెళ్లాలో తెలిస్తే సరే. తెలియకపోతే చాలా భయమేస్తుంది. ఏడుపు కూడా వస్తుంది కదూ. అవతల మీవాళ్ల పరిస్ధితీ అంతే. తప్పిపోయిన మీకోసం వాళ్లంతా వెతుకుతుంటారు. బజారుకెళ్లి ఒక్కళ్లమే తిరిగి రావడానికి మనం చాలా ప్రయాస పడ తాం. మన వాళ్లనూ కంగారుపెడతాం.
◆ కానీ కేజీ బరువు కూడా లేని పక్షులకు ఇలాంటి బాధల్లేవు. అవి ఎవరి సాయం లేకుండానే దేశదేశాలు దాటి వెళ్తాయి. వెళ్లడమే కాదు. క్షేమంగా వెనక్కి తిరిగి వస్తాయి. మునుపు కట్టుకున్న గూటిలోనే కాపురం పెడతాయి. ఈ పక్షులు ఖండాంత రాల్లో పెట్టిన గుడ్ల నుండి బయటికొచ్చిన పిల్లలు అంతకు ముందెప్పుడూ చూడని తమ స్వస్ధలాలకు క్షేమంగా చేరతాయి. విచిత్రంగా వుంది కదూ. కానీ ఇది నిజం. వాతావరణ పరిస్ధితులు పక్షుల్ని వలస బాట పట్టించాయి.
*◆ ఆ వలస పక్షులకు కొన్ని ప్రత్యేకతలను ఆపాదించింది. వాటిని అర్ధం చేసుకోవడానికి మానవుడు ప్రయత్నించాడు. కొన్నిటికి కారణాలు కనుక్కోగలిగినా,జవాబు దొరకని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఇంతకీ పక్షుల వలసల్లోని వింతల్ని, విశేషాల్ని తెల్సుకుందా మా!*

*◆ పక్షులు ఋతువులను బట్టి తమ నివాస ప్రదేశాలను మార్చుతుంటాయి! భూమధ్య రేఖ దగ్గర్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ధృవాల దగ్గరకు వెళ్లే కొద్దీ చలి పెరుగుతుంది. పక్షులు ఎక్కువ వేడిని భరించలేవు. అలాగే ఎక్కువ చలిని భరించలేవు. అందువల్ల శీతల ప్రాంత పక్షులు వేడి ప్రాంతాలకూ, వేడి ప్రాంతాల్లోని పక్షులు చలి ప్రదేశాలకూ ఎగిరిపోతుంటాయి.*
◆ అలాగే ఒకే ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పక్షులు ఒకేసారి కనిపించవు. చెట్లు చిగురించే కాలంలో కోయిలలు వస్తాయి. కానీ తరువాత అవి కనిపించవు. ఇక కాకీ, గద్ద, పావురాళ్లు మాత్రం నిత్యం కనిపిస్తూనే ఉంటాయి!
*◆ మన దృష్టిలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడమంటే ఊరు వెళ్లి, రావడమే. కానీ పక్షులకు మాత్రం ఆ ప్రయాణం ఖండాలను దాటే ప్రయాణమే!*
■  పక్షుల ప్రయాణానికి సంబంధించి శాస్త్ర వేత్తలు ఎన్నో ప్రయోగాలు నిర్వహించారు. వాటివల్ల చాలా విషయాలు తెలిశాయి. 
*★ కొన్ని పక్షులు రెండు రోజులపాటు నిర్విరామంగా ఎగిరి 2,500 మైళ్లు ప్రయాణించాయి. అలా రెండు రోజులపాటు ఆగకుండా ఎగరడానికి అవి తీసుకున్న ఆహారం కేవలం రెండు ఔన్సులు మాత్రమే!*
*★అవి గంటకు 50మైళ్ల వేగంతో ఇంగ్లాండు నుండి దక్షిణ అమెరికా చేరాయి. ఈ వలస పక్షులు బయల్దేరే సమయమొస్తే ఎవరో పిలిచినట్టు ఎక్కడెక్కడున్నా అన్నీ ఒకేసారి బయల్దేరతాయి!*
★ ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ వెళ్తాయి. కొత్త ప్రదేశం చేరిన తర్వాత మళ్లీ గూళ్లు కట్టుకుంటాయి. అనుకూల కాలం రాగానే మళ్లీ ఎవరో చెప్పినట్టు అన్నీ ఒకేసారిగా బయల్దేరి తమ పాత ప్రాంతాలకు వచ్చేస్తాయి. వచ్చి, మళ్లీ తమ పాత గూళ్లకే వెళ్లిపోతాయి!
*◆ అసలు ఈ పక్షులకు విదేశాల దారి ఎవరు చూపిస్తారు? ఋతువులు మార్పు గురించి వాటికెలా తెలుసు? అన్నీ కలిసి వెళ్లడం, రావడం అది దారి తప్పకుండా ఇదెలా సాధ్యం?*
*◆ అంత బుల్లి బుల్లి పక్షులు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాయి? అనే ప్రశ్నలకు ఇంతవరకు జవాబు దొరకలేదు. మరో అద్భుతం ఏంటంటే చలి ప్రాంతం నుండి ఎగిరి వెళ్లిన పక్షులు వేడి ప్రదేశాల్లో గుడ్లు పెడ్తాయి. వాటిని పొదిగి, పిల్లల్ని చేస్తాయి. ఈ పిల్లలు ఒక్కోసారి పెద్దవాటికంటే ముందే ప్రయాణం మొదలుపెడతాయి. ఎవరో దారి చూపిస్తు న్నట్లుగా అవి తిన్నగా తమ మాతృదేశానికి బయల్దేరతాయి. పెద్ద పక్షులు వచ్చేలోగానే ఈ పిల్ల పక్షులు గూడు చేరతాయి! విచిత్రంగా వుంది కదూ...*
*అంతరించిపోతున్న వలస పక్షులు..*
■ జీవ వైవిధ్యానికి ముఖ్యంగా మానవ మనుగడలో ముఖ్యపాత్ర వహిస్తున్న అనేక లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్ర ప్రమాదాన్ని కలుగచేస్తున్నాయి.
*■ ఫ్లెమింగోలు, స్టార్కు జాతి కొంగలు పెలికాను పక్షులు, గ్రద్ధ జాతి పక్షులు, ఇతర అనేక జాతుల పక్షులు వాటి సుదూర ప్రయాణంలో విద్యుత్‌ తీగల గ్రిడ్‌లకు తగిలి విద్యుద్ఘాతముతో చనిపోతున్నాయి. వలస పక్షులకు ఇప్పటికే వాటి నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాలు సంతానోత్పత్తి ప్రదేశములు నశించి పోవటం, పాడై పోవటం, గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ముప్పు వాటిల్లడమే కాకుండా అదనంగా విద్యుత్‌ ఘాతము వలన వాటికి కలిగే ముప్పు తీవ్రతరమౌతున్నది. ఇది పెద్ద పక్షి జాతులు నశించి పోయేందుకు కారణం.*
■ ఇండియాలోనూ, ఆఫ్రికాలోనూ అధిక మొత్తంలో ఎలక్ర్టిక్‌ పవర్‌ లైనులు వేస్తుండ టం వలన ఈ సమస్య తలెత్తబోతుందని తెలిపారు. అయితే ఇండియాలో కూడా ఈ సమస్య ఇప్పటికే ఉన్నది. గుజరాత్‌లో ప్రతి సంవత్సరం కొన్ని వందల ఫ్లెమింగో పక్షులు విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నాయి. ఈ విద్యుత్‌ తీగలను ఫ్లెమింగో పక్షుల నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాల గుండాను, పక్క నుంచి నిర్మించుట వలన వాటి తలల విద్యుత్‌ తీగలకు గుద్దుకొని చనిపోతున్నాయి.
*★ పక్షులకు జరిగే తీవ్ర నష్టాన్ని తగ్గించడానికి వాటి సంతానోత్పత్తి, ఆహార ప్రదేశాలకు, నివాస ప్రదేశాలకు దూరంగా విద్యుత్‌ లైనులు నిర్మించాలి. ఇన్సులేటెడ్‌ వైర్లను ఉపయోగించాలి.*
*■ భారత్‌కు ఆయా దేశాల నుండి సుమారు 350 రకాల జాతుల వలస పక్షులు వచ్చాయని రాజ్యసభ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాలుష్యం, వేడి , ఇతర కారణాల వలన ఆయా జాతులకు చెందిన పక్షులు ఇండియాకు చేరుకున్నాయని తెలిపింది. ఈజిప్షియన్ రాబందులు, ప్లోవర్స్, బాతులు, కొంగలు, రాజహంసలు, ప్లెమింగో లు, జకనాలు, ఇబిసెసస్,పోచార్డ్స్‌తోపాటు ఇతర పక్షులు భారత్‌కు చేరినట్టు కేంద్ర పర్యావరణ శాఖ ప్రకాశ్‌జవదేకర్ వెల్లడించారు.*
★ కావున జీవవైవిధ్యంలో, మానవుని మనుగడలో ముఖ్యపాత్ర వహిస్తున్న పక్షులను రక్షించుటకు, వాటి ఆహార, నివాస, సంతానోత్పత్తి ప్రదేశాలను రక్షించుటకు వీలుగా మనమూ నడుం కట్టాలి.
అతి పెద్ద పక్షి: నిప్పుకోడి
అతి చిన్న పక్షి: హమ్మింగ్ బర్డ్           

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section