Type Here to Get Search Results !

Vinays Info

👉 National Technology Day | జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే)

జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే)

★  "నీవెవరో .. నేనెవరో.. సృష్టి మూలమెక్కడిదో .."అని ఆరంభమైన జిజ్ఞాస. అనేక వైజ్ఞానిక విన్యాసాలకు ఊతమిచ్చింది.

*■ అంతేకాక బలోపేతమైన ప్రాకృతిక శక్తుల్ని ఆరాధిస్తూనే శక్తిమూలాల్ని ఆరాతీస్తూ, హేతువుకు పదునుపెట్టి విజ్ఞాన సేతువులను నిర్మించింది. మరోపక్క గణిత అద్భుతాలను, సంభ్రమకర సాహసాలను ఈ సహస్రాబ్ది కిచ్చి. మానవ చరిత్రను ప్రగతిదాయకమైన మలుపులు తిప్పుతూ. విజ్ఞాస పూరిమైన విన్యాసాలకు గురిచేసింది. ఈ వైజ్ఞానిక ప్రపంచంలో వివిద దేశాలతో పాటు భారత్‌ కూడా ఎన్నో విజ్ఞాన విజయ శిఖరాలను అందుకుంది.*

*★ఆ టెక్నాలజీ బాటలో భారత్‌ దాటిన ఎన్నో మైలురాళ్లతో పాటు..1998 మే 11వ తేదీన భారత్‌ రెండవసారి (మొదటి అణు పరీక్షలు మే 18, 1974లో జరిగాయి) రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ వద్ద అణుపరీక్షలు నిర్వహించింది. అప్పటి నుండి ఈ తేదీన.. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ అణుపరీక్షలకు ‘ఆపరేషన్‌ శక్తి’ అని పేరుపెట్టారు. ఈ అణు పరీక్షలతో భారత్‌ అణ్వస్త్ర దేశంగా అవతరించింది.*

■ ఆ వైజ్ఞానిక కాంతుల్లో ఎన్నో వింతలు మానవుణ్ని గుక్క తిప్పుకోలేనంత ప్రగతివైపు పయనింప చేస్తుంటే అందులో భాగమైన సైబర్‌ యుగం విజ్ఞాన విపణిలో విహరింప చేస్తోంది. ఈ సైబర్‌ శఖం పుణ్యమా అని వివిధ రంగాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటింటా 'ఇంటర్నెట్‌' వాడకం పెరిగింది.దేన్నైనా క్షణాల్లో అందుకో గలుగుతున్నాము.

■ గత శతాబ్దిలో మానవాళి వేసిన ప్రగతి దాయకమైన ముందడుగు ఫలితంగా సాంకేతిక సమాచార రంగాభివృద్ధి నేడు కొత్త పుంతలు తొక్కుతుంది.

*■ సమాచార రంగంలో వచ్చిన ఈ విప్లవంతో ప్రఖ్యాత సమాచార ప్రసార నిపుణుడు 'మార్షల్‌ మక్లూహన్‌ 'అన్నట్లు "ప్రపంచమొక పల్లెగా మారిపోయింది".*

🌐సేకరణ:సురేష్ కట్టా-నెల్లూర్ సోషల్ టీచర్
                   

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section