Type Here to Get Search Results !

Vinays Info

International Mothers Day | అంతర్జాతీయ మాతృదినోత్సవం

అంతర్జాతీయ మాతృదినోత్సవం
         మే రెండవ ఆదివారం

తల్లిని గౌరవిస్తేనే సమాజం బాగుంటుంది

★ ఈ ప్రపంచం విశాలమైనదా? అమ్మ హృదయం విశాలమైనదా? అని అడిగితే వచ్చే సమాధానం ఒక్కటే! అమ్మ హృదయం అని! అవును మరి! ఈ ధరిత్రికి ఉన్న ఓర్పు ఈ ప్రపంచంలో ఒక్క అమ్మకు తప్ప మరెవరికి ఉంది? అందుకే తల్లి ...పుడమితో సమానం.  ఈ ప్రపంచానికి భావితరాలను అందించే వ్యక్తి ఆమే కదా!

*■ నవ మాసాలూ మోసి బిడ్డను కనడం మహిళకు మరో జన్మ అంటారు. ఎందరో మహిళలు  జన్మనిచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. అయినా అమ్మ ఆ భారాన్ని మోస్తూనే వస్తోంది. భవిష్యత్తులోనూ దాన్ని ఓ భారం అనుకోకుండా మోస్తూనే ఉంటుంది. ఓ పసిగుడ్డుకు ప్రాణం పోయడానికి ఎంత శ్రమపడాల్సి ఉంటుందో తెలిసినా ఆ తల్లి ఈ ప్రపంచానికి ఒక తరాన్ని అందించడానికి తన ప్రాణాలను పణంగా పెడుతూనే ఉంది. అందువల్లనే అమ్మకు అత్యున్నత స్థానం లభించింది.*

*■ అమ్మగా అనేకపనులు ఆడపిల్లగా పుట్టిన  క్షణం నుండి ఓ కుటుంబంలో ఆమె ప్రయాణం ఆరంభమై, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, వదినగా, అత్తగా, ఆడపడుచుగా, అమ్మమ్మగా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి తాను ఒక్కటిగా, అందరికీ అవసరమైన వ్యక్తిగా కుటుంబంలో, సమాజంలో నిలుస్తుంది.*

*🍥ఓ టీచర్‌గా....*

■ బిడ్డ పుట్టిన తర్వాత చనుబాలు ఇవ్వడంతో తల్లి తన బిడ్డకు ఒక గురువుగా మారుతుంది. ఆ బిడ్డ ప్రతి కదలికలోనూ తల్లి మార్గదర్శకత్వం ఉంటుంది. ఎలా నడవాలి,  ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా జీవించాలి, జీవితపు ఆఖరు క్షణాలను  హుందాగా ఎలా ఆహ్వానిం చాలి... అన్నీ తల్లే నేర్పిస్తుంది.

*★ రామకృష్ణ పరమహంస తన భార్యలో కూడా తల్లిని దర్శించిన మహనీయుడు. ఆయన అంతటి గొప్ప వ్యక్తి కావడానికి స్ఫూర్తి ఆయన తల్లే.*

*★ అలాగే వివేకానందుని జీవితం కూడా. తల్లి నేర్పిన జీవిత పాఠాలే ప్రపంచానికి ఆయన ఆదర్శమూర్తి కావడానికి కారణం.*

*★ ఇక గాంధీ మహాత్ముని గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిందేముంది? ఆయన స్వయంగా తన ఆత్మకథలో అమ్మ గురించి ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నాడు.*

*★అమ్మంటే గుర్తుకు వచ్చే మరో గొప్పవ్యక్తి ఛత్రపతి శివాజీ. తన తల్లి చిన్నతనం లో నూరిపోసిన ధైర్యం, దేశభక్తి, వంటి విలువలువల్ల ,పరాయి స్త్రీల లో తన తల్లిని చూడగలిగాడు.*

ప్రపంచానికే ఆదర్శమూర్తులైన ఆ వ్యక్తుల తల్లులు ఇంకెంత గొప్ప ఆదర్శమూర్తులో ఆలోచించండి?

*🍥ఒక గృహిణిగా...*

■ ప్రతి తల్లీ ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరనే చెప్పాలి. కలెక్టర్ ఒకజిల్లాలోని అన్ని శాఖలను ఎలా సమన్వయం చేసి నడుపుతాడో ఒక తల్లి కూడా ఇంటిలో ఉండే అన్ని శాఖలను, వ్యవహారాలను సమన్వయం చేసి ముందుకు నడుపుతుంది. ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూస్తుంది. పిల్లల మధ్యన గొడవలు రాకుండా, ఇంట్లోని వ్యక్తుల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడంలో చొరవ తీసుకుంటుంది. అన్నింటినీ నేర్పుతో నిర్వహిస్తుంది. ఖర్చు చేయడంలో, పొదుపు చేయడంలో ఆమెకు సాటి మరొకరు లేరు.
ఈ క్రమంలో..

*🍥 ఏటా మే నెల రెండో ఆదివారం నిర్వహిస్తు న్న ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉన్నాయి...*

◆ గ్రీస్‌లో 'రియా' అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్‌గా భావించి ఏడాదికోసారి నివాళుల ర్పించేవారు.

◆ 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపారు.

*◆జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది.బోస్టన్‌లో ఇందు కోసం సమావేశాన్ని నిర్వహిం చింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ 'మదర్స్ డే 'జరిపించేందుకు చాలా కృషి చేసింది.*

◆ఆమె 1905 మే 9న మృతి చెందగా, ఆమె కూతురు మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది.

*◆ ఫలితంగా 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించాడు. కాలక్రమేణా ప్రపంచ మంతా వ్యాపించింది. అప్పటి నుంచి ఏటా మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.*

*★ప్రపంచంలో ఈ పరిణామాలు జరుగుతున్న తరుణంలోనే 1905 లో మాక్సిం గోర్కీ 'అమ్మ' తొలిసారి నవల వెలువడింది.(గోర్కీ అసలు  పేరు 'అలెగ్జీ మాగ్జిమోవిచ్‌'. ఆయన క్లర్కుగా పనిచేస్తూ మాగ్జిం గోర్కీ అన్న కలంపేరుతో ఖాళీవేళల్లో కథలు రాసేవారు.) ప్రపంచ సాహిత్యంలో దానితో పోల్చదగిన పుస్తకం మరొకటి లేదని సాహిత్యవేత్తలు అంగీకరించారు.*

■ తల్లిని కళ్ళెదుట కనిపించే దైవంగా కొలిచే కొడుకులు ఉన్నారు. కొన్ని చోట్ల తల్లికి గుడి కట్టిన కొడుకులూ ఉన్నారు.

*★ అందరూ అమ్మగొప్పతనాన్ని గుర్తిస్తున్నారా అంటే సందేహమే. నవమాసాలూ మోసి, కని పెంచిన అమ్మను వార్ధక్యంలో పట్టించుకోకుం డా, వదిలేసిన సంతానమూ లేకపోలేదు.*

*★ తన సర్వం బిడ్డలే అనుకుని జీవితంలో ప్రతిక్షణం వారి క్షేమం కోసం తపించే తల్లులకు వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టేందుకు నేటి పిల్లలు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిని అనాథులుగా వదిలేస్తున్నారు. ఇలా ఎంతో మంది తల్లులు దిక్కులేక కొంతమంది వృద్ధాశ్రమాల్లో జీవిస్తుంటే మరికొందరు యాచకులుగా మారుతున్నారు...*

● మారాలి..!సమాజం మారాలి..!!
మార్పు శాశ్వతమే అయినా, పరిపూర్ణమైన మార్పు కావాలి.
● అందుకే, ముందుగా కుటుంబంలోని ప్రతి పురుషుడు..ఈ మాతృదినోత్సవ సందర్భంగా మరలా ఒకసారి ఆలోచించి ముందడుగు వేద్దాం. స్త్రీలకు గౌరవం ఇచ్చి,ప్రతివారిలో అమ్మను చూద్దాం..మార్పు వస్తుందనే ఆశతోనే జీవిద్దాం..

ఇందువెంట మాక్సిం గోర్కీ 'అమ్మ' నవలను మన "చరిత్రలో ఈరోజు గ్రూప్ " మిత్రులకు పంపుతున్నాను..అందులోని సజీవమైన స్త్రీ పాత్రలు అందరినీ ఆకట్టుకుంది.తప్పక చడవగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section