ప్రపంచ కుటుంబ దినోత్సవం
కలసివుంటే కలదు సుఖం
●కలలో.: జగమంత కుటుంబం మనది.." మనది..మనదే!_
_●ఇలలో.: ఎవరికీ వారే యమునా తీరి.." నీదీ..నాదీ.. నాదే!!_
*■ ప్రపంచవ్యాప్తంగా కుటంబాలలో వస్తున్న మార్పులు, విచ్ఛిన్నమవుతున్న కుటంబాలను కాపాడడమే ముఖ్య లక్ష్యంగా..."ప్రపంచ కుటుంబ దినోత్సవం" జరుపుకుంటున్నాము.*
■ దీనిని 'యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ '1993లో మొదటి సారి ఈ సంప్రదాయానికి తెర తీసింది.
*🍥కుటుంబం నుంచి కుటుంబాలు....👨👩👧👦*
*■ ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న ,ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్లిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి.*
★ అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహాజం.
*■ ఈఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో.కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేక పోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మనదేశం పుట్టిల్లు. ఇప్పుడు ఆ సంస్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదంటే అతిశయోక్తి కాదు. అనేక కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజూ చూస్తూ ఉన్నదే.*
★అయినప్పటికీ మన దేశంలో అనేక
కుటుంబాల మధ్య కనిపించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు.
*🍥సిరిసంపదల ఉమ్మడి కుటుంబాలు....*
*■ భారతీయ సంస్కృతికి,సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపర చబడి ఉంది. నాగరిక ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబవ్యవస్థ మూడుపు వ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.*
■ ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమిష్టి సంపదనే, సమిష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది.తల్లిదండ్రులు,అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు,బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవరాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానికే తావు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు.
*🍥విచ్ఛిన్నమవుతున్న అనుబంధాలు...*
*★ విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రపంచంలో విచ్ఛిన్న మయ్యాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నవ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించలేని పరిస్థితి నెలకొంది.*
*★ డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం చిక్కడం లేదంటే మనకుటుంబాలు ఎంతగా విచ్ఛిన్న మయ్యా యో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబాలలో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్లయిన మరునాడే వేరుకాపురాలు పెట్టుకుని జంటలుగా ఒంటరై పో తున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీ యులు దూరం కావడం, కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం.*
*🍥ఉమ్మడి కుటుంబాలు అవసరమే(నా)....👩👩👧👧👨👩👦👦*
■ నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత...ఇవేవీ నేటి కుటుంబాలలో మనకు కనిపించవు. ఇరుకు గదుల మధ్య మనసులు కూడా ఇరుకు చేసుకొని జీవించడం తప్ప ఆత్మీయానురాగాలకు చోటెక్కడా కనిపించదు. ఇటువంటి తరుణం లోనే విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే దృఢ సంకల్పంతో ఐక్య రాజ్యసమితి వరల్డ్ ఫ్యామిలీడేను నిర్వహిస్తోంది...
*■ కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జా తీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవా లను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయం లో సరైన సమాచారాన్ని, సహకారన్ని అందిం చడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతు లు నెల కొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము...*
★అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మళ్లీ ఉమ్మడి కుటుంబాలకు జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
🌐సేకరణ:సురేష్ కట్టా-నెల్లూర్ సోషల్ టీచర్