సబల (RGSEAG – Rajiv Gandhi Scheme for Empowerment of Adolescent Girls Scheme)
👉ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం దీనిని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2011, ఏప్రిల్ 1న ప్రారంభించారు.
👉ఈ పథకం లక్ష్యాలు:
👉->యుక్త వయసు బాలికల సాధికారత, స్వీయ అభివృద్ధికి తోడ్పాటును అందించటం
👉->పౌష్టికాహారాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించటం
👉->యుక్తవయసు బాలికల్లో కుటుంబం, బాలికా సంరక్షణ, లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన శాస్త్రీయ అవగాహనను పెంపొందించటం
👉->గృహ నిర్వహణ నైపుణ్యాలు పెంపొందించటం,
👉->జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా బాలికల్లో జీవన నైపుణ్యాలను పెంచటం.
👉->విద్య మానేసిన బాలికలకు నియత విద్య అందించటం
👉->ఈ పథకాన్ని 11-18 ఏండ్ల వయసు బాలికల కోసం ఏర్పాటుచేశారు.
👉->ఇందులో రెండు విభాగాలు ఏర్పాటు చేశారు. 11-15 ఏండ్ల మధ్య వయసున్న బాలికలు ఒక విభాగం, 15-18 ఏండ్ల వయసున్న బాలికలను మరో విభాగంగా పరిగణిస్తారు.
👉->దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ->ఈ పథకం లబ్ధిదారులకు 300 రోజులపాటు ప్రతిరోజు 600 కేలరీలు, 18-20 గ్రాముల ప్రొటీన్, మైక్రోన్యూట్రియంట్స్‌తో కూడిన పౌష్టికాహారం అందిస్తారు.