Type Here to Get Search Results !

Vinays Info

దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (DAY – NULM: Deendayal Antyodaya Yojana – National Urban Livelihood Mission)

దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (DAY – NULM: Deendayal Antyodaya Yojana – National Urban Livelihood Mission)

దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన (డీఏవై) పథకాన్నే ఎన్‌యూఎల్‌ఎంగా పిలుస్తున్నారు. స్వర్ణజయంతి షహరి రోజ్‌గార్ యోజన (ఎస్‌జేఎస్‌ఆర్‌వై) పథకం స్థానంలో 2013, సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఎన్‌యూఎల్‌ఎంను తీసుకువచ్చింది. పట్టణప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించేందుకు ఈ పథకం ప్రధానంగా ఉద్దేశించినది. 2011 జనగణన ప్రకారం దేశంలో లక్ష అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో ఈ పథకాన్ని 12వ ప్రణాళికా కాలంలో అమలు చేశారు. ప్రస్తుతం ఈ పథకం 790 పట్టణాళ్లో అమలవుతున్నది. ఈ పథకం కింద ఖర్చుచేసే నిధులను కేంద్రం, రాష్ర్టాలు 75:25 నిష్పత్తిలో సమకూరుస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ర్టాలతోపాటు ఈశాన్యరాష్ర్టాల్లో ఈ పథకం నిధులను 90:10 నిష్పత్తిగా నిర్ణయించారు.అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు ఈ ప్రత్యేక రాష్ర్టాల పరిధిలోకి వస్తాయి. పట్టణాల్లోని పేదలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధితో జీవించేలా ఈ పథకం కింద చర్యలు తీసుకొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసాలు లేని పేదలకు ఇంటి వసతిని కల్పించటం, వీధులవెంట చిరు వ్యాపారాలు చేసే పేదలకు రుణ సదుపాయాలు కల్పించటం, మార్కెట్ అవకాశాలను కల్పించే చర్యలు చేపడుతున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section