Type Here to Get Search Results !

Vinays Info

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (Housing for All – Rural)(PMGAY – Pradhan Mantri Grameen Awas Yojana)

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (Housing for All – Rural)(PMGAY – Pradhan Mantri Grameen Awas Yojana)

ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ జూన్ 25, 2015లో ప్రారంభించారు. దేశంలో ఇండ్లులేని గ్రామీణ ప్రాంత ప్రజలకు 2022వ సంవత్సరం నాటికి 2.95 కోట్ల పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలనేది రప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం ముఖ్య ఉద్దేశం. దీన్ని రెండు విడతలుగా అమలు చేయనున్నారు. మొదటి విడతగా రాబోయే మూడేండ్లలో అంటే 2016-2019 వరకు ఒక కోటి ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది ఈ పథకం లక్ష్యం. ఈ ఇండ్ల నిర్మాణానికి రూ. 81,975 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ పథకానికి లబ్ధిదారులను సోసియో ఎకనమిక్ అండ్ కాస్ట్‌సెన్స్ ఆఫ్ 2011 (ఎస్‌ఈసీసీ) ద్వారా ఎంపిక చేయనున్నారు. మైదాన ప్రాంతాల్లోని ఒక ఇంటికి రూ. 1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లో ఇంటిని నిర్మించడానికి రూ. 1.30 లక్షలు ఇస్తారు. పక్కా ఇండ్ల నిర్మాణం కోసం గ్రామీణ ఆవాస్ యోజన కింద రూ. 21.975 కోట్లును ఖర్చు చేయనున్నారు. ఈ రుణాన్ని కేంద్రం పూచికత్తుగా నాబర్డ్ నుంచి తీసుకోనున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2022 తర్వాతి బడ్జెట్‌లో కేటాయిస్తుంది. లక్ష్యం చేరుకోవడం కోసం జాతీయ స్థాయిలో సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. రెండో విడతలో అంటే 2019-2022 వరకు మిగతా లక్ష్యాన్ని పూర్తి చేస్తారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section