జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM – National Rural Livelihood Mission)
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM – National Rural Livelihood Mission)
పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011లో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టిసారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్యోద్ధేశం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణజయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన (ఎస్‌జీఎస్‌వై) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎస్‌జీఎస్‌వైకి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాల్లో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతే కాదు ఒక బిలియన్ డాలర్లను ఆర్థికసాయంగా అప్పు గా ఇచ్చింది. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సాయం అందిస్తారు. వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థికసాయంతో పాటు ఆ రంగం లో రాణించడానికి అవసరమైన నైఫుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు.