ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY – Pradhan Mantri Krishi Sinchai Yojana)
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY – Pradhan Mantri Krishi Sinchai Yojana)
కేంద్రం ఈ పథకాన్ని 2016, జనవరిలో ప్రారంభించింది. ప్రధానమంత్రి కృషి సించయి యోజన (పీఎంకేఎస్‌వై) ముఖ్యోద్దేశం క్షేత్రస్థాయిలో సేద్యపు పెట్టుబడులు ఆకర్షించడం. నీటి వృథా తగ్గించి సేద్య పరిమాణం పెంచడం. మున్సిపాలిటీల్లోని మురుగునీటిని వృథా చేయకుండా సేద్యానికి ఉపయోగపడే పద్ధతులును అనుసరించడం. నీటి పారుదల రంగంలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చుక్కనీటితో ఎక్కువ పంట పండించడం. పీఎంకేఎస్‌వై కింద యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ పోగ్రామ్ (AIBP), ఇరిగేషన్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (IWMP), ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్‌మెంట్ మొదలైన పథకాలు అమలు చేయబడుతున్నాయి. వర్షం నీటి సంరక్షణ, చెరువులు, చిన్న చెక్‌డ్యామ్‌లు, కాంటూర్ గట్ల నిర్మాణం, సూక్ష్మ నీటి పారుదలకు స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టం, రెయిన్ గన్స్ అందించడం దీని ప్రధాన లక్ష్యాలు ఇది ముఖ్యంగా డిస్ట్రిక్ ఇరిగేషన్ ప్లాన్ (DIP), స్టేట్ ఇరిగేషన్ ప్లాన్ (SIP)లు సొంతంగా ప్రణాళికలను తయారు చేసుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, సాంకేతికతను ఉపయోగిచుకోవడానికి, వాటికి అవరమైన పరిపాలనా అనుమతులు, పర్యవేక్షణ మొదలైనని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షిస్తుంది. దీని పర్యవేక్షణకు ఇంటర్ మినిస్ట్రియల్ నేషన్ స్టీరింగ్ కమిటీ (NSC) ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేస్తారు.