రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (Rashtriya Swasthya Bima Yojana)
అసంఘటిత కార్మికులందరికీ వర్తించేలా ఆరోగ్య బీమా పథకమైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని కింద 1000 వ్యాధులకు చికిత్సను అందిస్తుండగా, ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 50వేలు అందిస్తున్నారు. రాష్ట్రంలో 22.02 లక్షల కుటుంబాలు అసంఘటితరంగంలో ఉన్నాయని 2011-12 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పథకాన్ని ఇటీవలే ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఈ పథకం కింద కేంద్రం వాటాగా 75 శాతం చెల్లిస్తుండగా 25 శాతం లబ్ధిదారులు చెల్లించేవారు. ప్రస్తుతం లబ్ధిదారుల ప్రీమియంలో 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 50,000 వరకు అందిస్తున్న చికిత్స రూ. 2 లక్షల వరకు పొందేవరకు అవకాశం ఉది. 1642 చికిత్సలకు వైద్యసదుపాయాలు పొందే అవకాశముంది. రాష్ట్రంలో ఈ పథకం కింద 22.02 లక్షల కుటుంబాలు వస్తాయి.