ప్రధానమంత్రి కౌశల్ యోజన (Pradhan Mantri Kaushal Yojana)
ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా 2015, జూలై 15న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధి-పారిశ్రామిక జాతీయ విధానం- 2015, నైపుణ్య పథకాలను ప్రారంభించారు. దేశంలో 35 ఏండ్లలోపు ఉన్న యువతను వివిధరంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించారు. 2016 చివరికల్లా 24 లక్షల మందికి సాంకేతిక పరిజ్ఞానం, వృత్తివిద్యలో నైపుణ్య శిక్షణనివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2022 నాటికి 40 కోట్ల మందిని గుణాత్మక నిపుణులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. నైపుణ్యం శిక్షణ పొందిన యువతకు స్కిల్‌లోన్ పేరుతో రూ. 5 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు రుణ సదుపాయ కల్పిస్తారు.