స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా (Startup India – Standup India Program)

VINAYS INFO
VINAYS INFO

స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా (Startup India – Standup India Program)

దేశంలో పరిశ్రమల వ్యవస్థాపనను ప్రోత్సహించడానికి ఉద్యోగాల కల్పనకు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా అనే నినాదంతో పథకాన్ని ప్రధాని మోదీ 2015, ఆగస్టు 15న ప్రకటించారు. వినూత్న వ్యాపార ఆలోచనలు, పరిశ్రమలు నెలకొల్పే ఆలోచనలున్నవారికి చేయూతనివ్వడం కోసం ఈ కార్యక్రమ ప్రణాళికలను 2016, జనవరి 16న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో విడుదల చేశారు. మేక్‌ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారీ మాత్రమే కాదు, దేశం కోసం ఉత్పత్తి చేయడం (మేక్ ఫర్ ఇండియా), 35 లక్షల మంది యువకులకు ఉపాధి కల్పిస్తారు. ఇప్పటికే 4200 స్టార్టప్‌ల వ్యవస్థాపనతో అమెరికా, బ్రిటన్‌ల తరువాత భారత్ మూడో స్థానంలో ఉంది. స్టార్టప్ ఇండియా ప్రధానాంశాలు: ->స్టార్టప్ పరిశ్రమలకు మూడేండ్ల పాటు ఆదాయపన్ను మినహాయింపు. ->స్టార్టప్‌లకు నిధులందించేందుకు మొదట రూ. 2500 కోట్ల నిధిని ఏర్పాటుచేస్తారు. దీన్ని వచ్చే నాలుగేళ్లలో రూ. 10,000 కోట్లకు పెంచుతారు. ->మూలధన లాభాలపై పన్ను మినహాయింపు. ->స్టార్టప్‌లకు మద్దతుగా రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వ నిధి ->స్టార్టప్ పరిశ్రమ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులకు సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు. ->తక్కువ ఖర్చుతో న్యాయ సహాయం, సత్వర మేధో హక్కుల పరిశీలన ->దివాలా బిల్లు-2015 సత్వర ఆమోదంతో స్టార్టప్ పరిశ్రమలు సులభంగా మూపివేసే అవకాశం ->రంగాలవారీగా కొత్త పరిశ్రమలకు సదుపాయాల కల్పనల కేంద్రా (ఇంక్యుబేటర్)లు.

You may like these posts

Post a Comment