జాతీయ సామాజిక సహాయ పథకం (NSAP – National Social Assistance Program)
👉 జాతీయ సామాజిక సహాయ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1995, ఆగస్టు 15న దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. దేశంలో పేదరికరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడమే దీని ముఖ్యోద్దేశం.
👉 దేశంలో ఒకే జాతీయ విధానంలో భాగంగా ప్రస్తుతం లేదా భవిష్యత్‌లో ప్రయోజనాలను అందించేలా వీలు కల్పిచింది.
👉సామాజిక సహాయం కింద కనీస జాతీయ ప్రమాణంలో భరోసా కల్పించే లక్ష్యంగా రూపొందించారు.
👉ఇందులో జాతీయ వృద్ధాప్య పింఛను పథకం (NOPS), జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS), జాతీయ గర్భిణుల ప్రయోజన పథకం (NMBS) అనే విభాగాలను అమల్లోకి తెచ్చింది.
👉కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహణలో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిల్లోని ప్రభుత్వాలు అమలు పరుస్తాయి.
👉ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం (IGNOAPS), ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛను పథకం (IGNWPS), ఇందిరాగాంధీ అంగవైకల్య పింఛను పథకం (IGNDPS), జాతీయ కుటుంబ ప్రయోజన (NFBS) పథకాలుగా అమలు చేస్తున్నది. పింఛన్లలో వృద్ధులు (60 ఏండ్లు పైన), వితంతువులు (40 ఏండ్లు పైన), అంగవైకల్యం (18 ఏండ్లు పైన) కలిగిన వారు అర్హులుగా పరిగణలోకి తీసుకుంది. జాతీయ గర్భిణుల ప్రయోజన పథకాన్ని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహణ కిందకు బదిలీచేసింది. అయితే ఆయా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలు తమ నిబంధనల మేరకు కొన్ని మార్పులను చేసి పింఛను పథకాల నిర్వహణ కొనసాగిస్తున్నాయి.