జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (NRDWP – National Rural Drinking Water Programme)
👉గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ తాగునీటి పథకాన్ని 2009లో సవరించింది. పెరుగుతున్న గృహావసరాల దృష్ట్యా తాగునీటిని సమృద్ధిగా నల్లా కనెక్షన్ ద్వారా అందించడం దీని ముఖ్యోద్దేశం.
👉12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా తాగునీటిని ఇంటింటికీ సరఫరా చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. నీటి సరఫరా బాధ్యతను పూర్తిగా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిల్లో పంచాయతీరాజ్ సంస్థలకు అప్పగించింది.
👉కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు నిధుల కేటాయింపులో 10శాతం వెయిటేజీ అందిస్తుంది. గ్రామీణ జనాభా ఆధారంగా నీటి సరఫరా పథకాలను కేటాయిస్తారు.
👉గ్రామీణ జనాభాకు రోజుకు తలసరి 40 లీటర్ల తాగునీటిని సరఫరా చేయడం. ఎడారి అభివృద్ధి పథకం కింద రోజుకు పశువులకు అదనంగా 30 లీటర్ల నీటిని అందించడం.
👉ప్రతి 250 మందికి చేతిపంపు ద్వారా సురక్షిత నీరు సరఫరా చేయడం. యాక్సిలరేటెడ్ గ్రామీణ నీటి సరఫరా పథకం (ఏఆర్‌డబ్ల్యూఎస్‌పీ), స్వధార జాతీయ గ్రామీణ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థలు పర్యవేక్షిస్తాయి.
👉భారత్ నిర్మాణ్‌లో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా భరోసా కల్పించడమే దీని లక్ష్యం. కేంద్రప్రభుత్వమే పూర్తిగా నిధులను రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాకుల కేటాయిస్తుంది. అన్ని పరిస్థితుల్లో గ్రామీణ జనాభాకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయడం.
👉2017 నాటికి కనీసం 50శాతం గ్రామీణ జనాభాకు తాగునీటిని అందించడం.