సమగ్ర బాలల సంరక్షణ పథకం (ICPS – Integrated Child Protection Scheme)
👉 సమగ్ర బాలల సంరక్షణ పథకం (ICPS)ను 2009-10 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటికే అమల్లో ఉన్న వివిధ బాలల సంరక్షణ పథకాలన్నింటిని కొత్త నిబంధనలతో రూపొందించిన దీని పరిధిలోకి తీసుకువచ్చారు.
👉 2004, ఫిబ్రవరి 9న అమల్లోకి వచ్చిన నేషనల్ చిల్డ్రన్ చార్టర్ (National Children’s Charter)- 2003 లోని సూచనల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
👉ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మహిళా శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో అమలవుతున్నది.
👉పిల్లల రక్షణకు, నిస్సాహాయ పరిస్థితుల్లో ఉన్న బాలలు, ఆపదలో ఉన్న చిన్నారులకు ఈ పథకం రక్షణ కల్పిస్తుంది.
👉ఈ పథకాన్ని అమలు చేయడానికి స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను, సొసైటీలు, ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ)లను ఐసీపీఎస్ ఏర్పాటు చేస్తుంది.
👉జిల్లా స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ, రక్షణ కార్యక్రమాలను డీసీపీయూ పర్యవేక్షిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వరంలో అమలవుతుండగా అందులో సెంట్రల్ అడాప్షన్ రిసోస్స్ అథారిటీ, సెంట్రల్ ప్రాజెక్టు సపోర్టు యూనిట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లి కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ పనిచేస్తున్నాయి.
👉రాష్ట్ర స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ, స్టేట్ అడాప్షన్ అండ్ రిసోర్స్ ఏజెన్సీ, స్టేట్ ప్రాజెక్టు సపోర్టు యూనిట్, స్టేట్ అడాప్షన్ రికమెండేషన్ కమిటీ ఉంటాయి. జిల్లా, మండల స్థాయిల్లో కూడా ఇలాంటి