మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meals Scheme)
👉 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం. పేద కుటుంబాలకు చెందిన బాల బాలికలు మధ్యలోనే బడి మానివేయకుండా ప్రాథమికస్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకు చదువు కొనసాగేలా చూడటమే దీని ముఖ్యోద్దేశం.
👉1995లో జాతీయ పోషకాహార సంస్థ సూచన మేరకు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు పెంచడంతో పాటు తరగతి గదిలో ఆకలిబాధలు పడకుండా విద్యా ర్థులు చదువుకోవాలనే లక్ష్యంతో కేంద్రం అమలు చేస్తున్నది.
👉స్వాతంత్య్రానికి పూర్వం 1925లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టారు.
👉దేశంలోనే మొదటిసారిగా 1960లో తమిళనాడులోని కామరాజ్ నాడార్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తృత పరిచింది.
👉1980లో గుజరాత్, 1995లో కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి.
👉2001, నవంబర్ 28న సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. మొదట్లో కొన్ని రాష్ర్టాలు దీన్ని వ్యతిరేకించినా 2005 నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది.
👉ప్రస్తుతం దేశంలోని 29 రాష్ర్టాలతో పాటు 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అమలులో ఉంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 450 కేలరీలు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు 700 కేలరీల పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తున్నారు.
👉ఈ పథకం కింద 2014-15 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా 11.56 లక్షల పాఠశాలల్లో 10.22 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది.