ఎంపీల్యాడ్స్ (MPLADS – Member of Parliament Local Area Development Scheme)
👉1993, డిసెంబర్ 23న ప్రధాని పీవీ నరసింహారావు ఎంపీల్యాడ్స్‌ను ప్రకటించారు.
👉కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నిర్వహణ కింద దీని మార్గదర్శకాలను 1994, ఫిబ్రవరిలో అమల్లోకి తెచ్చారు.
👉దీని ముఖ్యోద్దేశం పార్లమెంట్ సభ్యులు (లోక్‌సభ, రాజ్యసభ) తమ నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం.
👉ప్రధానంగా తాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రోడ్లు ఇతర సౌకర్యాలను మెరుగుపర్చటం.
👉దీన్ని కేంద్రపభుత్వం అమలు చేస్తుండగా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నోడల్ ఏజెన్సీలు నిర్వహణ కొనసాగిస్తున్నాయి. జిల్లా అధికారులు పనుల మంజూరు నిధుల కేటాయింపు బాధ్యతలు చేపడతారు.
👉ఈ పథకానికి సంబంధించిన నిధులను పూర్తిగా కేంద్రప్రభుత్వమే భరిస్తుంది. లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన సభ్యులకు నిబంధనల మేరకు నిధులు కేటాయించే అధికారం ఉంటుంది. పార్లమెంట్ అభ్యర్థి తన నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులను వెచ్చిస్తారు.
👉ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీ జనాభాకు ఏడాదికి 15 శాతం, ఎస్టీ జనాభాకు ఏడాదికి 7.5 శాతం చొప్పున కేటాయించిన నిధుల నుంచి ఖర్చు చేయాలి.
👉ఎంపీ సూచన మేరకు జిల్లా అధికారులు పనుల మంజూరు, నిధుల విడుదల, ఇతర పనులను పూర్తి చేస్తారు.
👉మొదటిసారిగా 1993-94లో ఏడాదికి రూ 5 లక్షలు కేటాయించారు. 1994-95లో రూ. కోటికి పెంచగా, 1998-99లో రూ. 2 కోట్లు చేయగా, 2011-12లో రూ. 5 కోట్లకు పెంచారు.