Type Here to Get Search Results !

Vinays Info

ఇందిరాగాంధీ మాతృత్వ సహ్యోగ్ యోజన (IGMSY – Indira Gandhi Matritva Sahyog Yojana)

ఇందిరాగాంధీ మాతృత్వ సహ్యోగ్ యోజన (IGMSY – Indira Gandhi Matritva Sahyog Yojana)

👉ఈ పథకాన్ని 2010 అక్టోబర్‌లో 53 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మాత, శిశు సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

👉గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో రక్తహీనత, పోషకాహార లోపం సమస్యలను అధిగమించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు అందిస్తుంది. దీని కింద గర్భిణులు, పాలి చ్చే తల్లుల్లో ప్రతి ఒక్కరికీ మూడు దశల్లో మొత్తం రూ. 4 వేలు ఇస్తారు.

👉పోస్టాఫీసు లేదా బ్యాంకు ఖాతా ద్వారా నగదును అందజేస్తారు.

👉19 ఏండ్లు లేదా ఆ పైన వయస్సు కలిగిన మహిళలు తొలి రెండు కాన్పులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

👉19 ఏండ్లలోపు వయస్సున్న గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అనర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే మహిళలకు కూడా ఈ పథకం వర్తించదు. వారికి ప్రసూతి సెలవు ఇస్తున్నందున ఈ పథకం నుంచి మినహాయించారు. మహిళ, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఈ పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section