మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA – Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో 2006, ఫిబ్రవరి 2న ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా మొదటి విడతలో 200 జిల్లాలు అమలు చేయగా, ఆ తర్వాత మరో 130 జిల్లాలకు విస్తరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
👉కూలీలు పని కల్పించాలని స్థానిక గ్రామ పంచాయతీ కి దరఖాస్తు ద్వారా లేదా మౌఖికంగానైనా తెలిపితే పరిశీలన చేసి అర్హులైన కుటుంబానికి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు అందజేస్తారు.
👉జాబ్ కార్డు కలిగిన కూలీలకు సాధారణంగా 15 రోజుల్లోగా పని చూపాలి. ఒకవేళ పని చూపకుంటే రోజువారీ వేతన అలవెన్సుల కింద నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
👉కనీస వేతనాల చట్టం – 1948 ప్రకారం కూలీలకు కనీస వేతనాలు చెల్లించాలి. రోజుకి రూ. 60కి తక్కువ కాకుండా, వారానికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలోనే ఉపాధి పనుల ప్రాజెక్టులను తయారు చేసి,ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలి.
👉నీటి పారుదల సౌకర్యాల పెంపు, చెట్ల పెంపకం, అటవీ వన సంరక్షణ, వరదల నియంత్రణ, ఎస్సీ, ఎస్టీ, దారిద్య్రరేఖకు దిగువ వర్గాల భూముల అభి వృద్ధి, చిన్న నీటిపారుదల సౌకర్యాలు చేపట్టాలి. ప్రాధాన్యత మేరకు సొంతంగా చేపట్టాల్సిన పనులపై గ్రామసభలో తీర్మానం చేస్తారు. ఉపాధిహామీలో చేపట్టిన పనులపై గ్రామసభను ఏర్పాటు చేసి సోషల్ ఆడిట్ (Social Audit) నిర్వహిస్తారు.
👉ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.