ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana)
🔹ఈ పథకాన్ని మోదీ 2015, మే 9న కలకత్తాలో ప్రారంభించారు. ఇది ప్రధానంగా వ్యక్తిగత ప్రమాద బీమా పథకం.
🔹ఈ పథకం కింద 18 నుంచి 70 ఏండ్ల వయస్సు ఉండి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు అర్హులు. ఈ పథకం 2015, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు కలిగినవారందరికీ సురక్ష బీమా యోజన సదుపాయం కలుగుతుంది.
🔹ఏడాది కేవలం రూ. 12 చెల్లింపు ద్వారా దుర్ఘటనస్థాయిని అనుసరించి రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనం కలుగుతుంది.
🔹ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వతంగా వికలాంగులైతే పరిహారం చెల్లిస్తారు.