అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)
🔹 ఈ పథకాన్ని 2015, మే 9న ప్రధాని మోదీ కలకత్తాలో ప్రారంభించారు. అసంఘటితరంగంలో ఉన్నవారికి వృద్ధాప్యంలో ఆసరా ఇచ్చేందుకు ఈ పథకం కింద 18 నుంచి 40 ఏండ్లు వయస్సు ఉండి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు అర్హులు.
🔹ఈ పథకం 2015, జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, 60 ఏండ్లు నిండిన తరువాత ప్రతి నెలా రూ. 1000 నుంచి 5000 వరకు పింఛన్ వస్తుంది. వయస్సును అనుసరించి ప్రీమియం ఉంటుంది.
🔹ఈ పథకంలో చేరే వ్యక్తి ఎంత మొత్తం తన చందాగా చెల్లిస్తాడో ఆ మొత్తంలో సగాన్ని ప్రభుత్వం కూడా జతచేస్తుంది.
🔹ఏడాదికి ప్రీమియం పరిమితి రూ. 1000 ఐదేండ్ల పాటు ఇలా ప్రభుత్వం జతచేస్తుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 3 లోగా ఈ పథకంలో చేరేవారికి వర్తిస్తుంది.