Type Here to Get Search Results !

Vinays Info

ప్రధాన్‌మంత్రి స్వాస్త్య సురక్షా యోజన (PMSSY – Pradhan Mantri Swasthya Suraksha Yojana)

ప్రధాన్‌మంత్రి స్వాస్త్య సురక్షా యోజన (PMSSY – Pradhan Mantri Swasthya Suraksha Yojana)

🔹దేశంలోని అన్ని ప్రాంతాల్లో అత్యున్నతమైన వైద్యసేవలు, వైద్య విద్యను అందించడానికి అవసరమైన వసతులను కల్పించడం, కొత్త హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీన్ని 2003లో ప్రకటించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తరహా సంస్థల ఏర్పాటుతోపాటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా నిర్మిస్తున్న దవాఖానల్లో 18 స్పెషాలిటీ విభాగాల్లో, 15 సూపర్ స్పెషాలిటీ, ఐసీయూ/యాక్సిడెంట్ ట్రామా, ఆయుష్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ (పీఎంఆర్) విభాగాల్లో మొత్తం 960 మంచాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్లు, పీఎంఆర్ విభాగం, ఆయుష్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం కింద తొలుత బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాంచల్ రాష్ర్టాల్లో ఎయిమ్స్‌లాంటి సంస్థలను ఏర్పాటు చేశారు. 2014-15లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పూర్వాంచల్ (ఉత్తరప్రదేశ్)రాష్ర్టాలకు ఎయిమ్స్‌ను కేటాయించారు. 2015-16లో అసోం, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, తమిళనాడు, బీహార్ రాష్ర్టాలకు కొత్తగా ఎయిమ్స్‌లను ప్రకటించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section