Type Here to Get Search Results !

Vinays Info

Indian Cost Guard day || ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ డే | భారతీయ తీర రక్షక దళ దినోత్సవం

ఫిబ్రవరి 1 నే ఎందుకు?

  • 1 ఫిబ్రవరి 1977 న తాత్కాలిక భారతీయ తీర రక్షక దళం (Indian Coast Guard) ఏర్పాటు చేయబడింది.
  • 1978 ఆగష్టు 18న పార్లమెంట్ తీర్మానం (Coast Guard Act - 1978) ఆధారంగా భారతీయ తీర రక్షక దళం ఏర్పాటు అయింది.

భారతీయ తీర రక్షక దళం:

స్థాపన: 1978 ఆగష్టు 18

Motto: వయం రక్షం (We Protect - మేము కాపాడతాం)

ప్రధాన కార్యాలయం: న్యూడిల్లీ 

1960లలో స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎక్కువ అవటం కారణంగా కస్టమ్స్ శాఖ వారికి తీర గస్తీకి నౌక దళం యొక్క అవసరం ఉండేది.

ఇందు కారణంగా భారతీయ ప్రభుత్వం నౌక మరియు Q దళ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. 1971 ఆగష్టులో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీర రక్షణకు కావాల్సిన వనరులను నౌక దళానికి సమకూర్చింది.

కొంత కాలం తరువాత అప్పటి నౌక దళాధిపతి అడ్మిరల్ కోహ్లీ (Admiral Sourendra Nath Kohli) (1973 - 1976) ఒక స్వతంత్ర బలగ ఏర్పాటునకు రక్షణ శాఖ కార్యదర్శికి ప్రతిపాదించారు.

ఇందు కారణముగా సెప్టెంబర్ 1974 లో రుస్తంజి కమిటీ (Rustamji Committee) ఏర్పాటు అయింది. ఈ కమిటీ చేసిన సిఫారసు ఆధారంగా, 1 ఫిబ్రవరి 1977 న తాత్కాలిక భారతీయ తీర రక్షక దళం ఏర్పాటు చేయబడింది. 

1978 ఆగష్టు 18 న పార్లమెంట్ తీర్మానం  (Coast Guard Act - 1978) ద్వారా భారతీయ తీరరక్షక దళం ఏర్పాటు అయింది.

వైస్ అడ్మిరల్ వి.ఏ. కామత్ (Vice Admiral V. A. Kamath) మొదటి అధిపతి గా నియమించబడ్డారు.

ప్రస్తుచ డైరెక్టర్ జనరల్ - కృష్ణస్వామి నటరాజన్ (1 జులై 2019 నుంచి)


దళం యొక్క విధులు:

భద్రత మరియు కృత్రిమ ద్వీపాల రక్షణ

సముద్రంలో మత్స్యకారులు మరియు నావికులకు రక్షణ మరియు సహాయం

కాలుష్య నియంత్రణతో సహా సముద్ర పర్యావరణం మరియు పర్యావరణ పరిరక్షణ

తీరం గురించి శాస్త్రీయ సమాచార సేకరణ

తీరప్రాంత సరి హద్దులను శత్రువుల బారినుండి కాపాడడం.

కస్టమ్స్‌ శాఖకు స్మగ్లింగ్‌ వ్యతిరేక చర్యల్లో తోడ్పాడు మొదలైనవి ఈ కోస్ట్‌గార్డ్‌ నిర్వహించే విధులు. 


నేడు.. *"ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ డే" సందర్భంగా..*✍సురేష్ కట్టా(సోషల్ టీచర్)
➖➖➖➖➖➖➖➖➖
*భారతీయ తీరరక్షకదళం 1977 ఫిబ్రవరి 1న ఏర్పాటయింది. 1978 ఆగస్ట్‌ 18న తీర రక్ష కదళ చట్టాన్ని చేయటంతో ఇది భారత యూ నియన్‌ సాయుధ బలంగా రూపొందింది.*

*తీరప్రాంత సరి హద్దులను శత్రువుల బారి నుండి కాపాడడం, తీరం ఆవలి పారిశ్రామిక స్థావరాల సంరక్షణ, ఆపదలో ఉన్న మత్స్యకారుల రక్షణ, కస్టమ్స్‌ శాఖకు స్మగ్లింగ్‌ వ్యతిరేక చర్యల్లో తోడ్పాడు, సముద్ర సంబంధ వాతావరణ రక్షణ మొదలైనవి ఈ కోస్ట్‌గార్డ్‌ నిర్వహించే విధులు.*

*రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోనిదైన ఈ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది.*

*తీరంపై రెప్పవాల్చని నిఘా!*

తీర ప్రాంతాల భద్రత చాలా తీవ్రమైన విషయం. యథాలాపంగా తీసుకొంటే ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుందో 2008 నాటి  ముంబయి దాడితో స్పష్టమైంది. ఆ చేదు అనుభవం నుంచైనా గుణపాఠాలు నేర్చుకొన్నారా అంటే, లేదనే అనిపిస్తోంది.

*తీర పరిరక్షణ అనగానే, అదేదో నౌకాదళం లేదా తీర పరిరక్షక దళం (కోస్ట్‌ గార్డ్‌) బాధ్యత అని భావించే పరిస్థితి ఉంది. స్థానిక పోలీసులకూ కీలకపాత్ర ఉంటుందని అనుకోం. నౌకాదళం, తీర రక్షక దళాలే ముఖ్యమైనవి. కాదనలేం. కానీ, శత్రువు దాడి జరిపే అవకాశాల్ని నిరోధించడం, దాడి జరిపితే తిప్పికొట్టడం సాయుధ దళాల ప్రధాన కర్తవ్యం.*

మన తీర ప్రాంతాల్లో నిత్యం వేల మంది జీవిక కోసం పడవలు నడుపుతుంటారు.అందువల్ల భద్రతాచర్యలు తీసుకొనే బాధ్యత ను వాటికే పరిమితం చేయలేం.

*ఆర్థికావసరం*

*తీర ప్రాంత భద్రత  వ్యూహాత్మకమే కాదు, ఆర్థికంగా అత్యవసరం కూడా. భారత తీర ప్రాంతమే అతిపెద్ద ఆర్థిక వనరు. దేశం 7,517 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి ఉంది. అందులో 5,423 కిలోమీటర్ల తీరం ద్వీపకల్పంలోనే ఉంది. భారతదేశ జనాభాలో దాదాపు 30శాతం తీర ప్రాంతాల్లోనే నివసిస్తోంది. నాలుగు మెట్రో నగరాల్లో రెండు (ముంబయి, చెన్నై) తీరంలోనే ఉన్నాయి. తీర ప్రాంతం 13 పెద్ద రేవులు, 187 చిన్న రేవులను కలిగి ఉంది. ఇవి కాకుండా కనీసం పది పెద్ద నగరాలు తీరం వెంబడి వెలిశాయి. ఆ రేవు పట్టణాలు ఏటా వేలకోట్ల రూపాయల వ్యాపారం, విస్తృత ఉపాధి అవకాశాల ద్వారా ప్రధాన ఆర్థిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ రేవు పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమంటే, మన ఆర్థిక వనరులను పరిరక్షించుకోవడం, వృద్ధిపరచుకోవడమే. అందుకే ఇది అత్యంత ముఖ్యమైన లక్ష్యం కావాలి.*

*భారతదేశ విదేశీ వాణిజ్యంలో- విలువపరంగా 77శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. భారతదేశపు సాగర ప్రాంత ప్రత్యేక ఆర్థిక మండలి దాదాపు 20లక్షల చదరపు కిలోమీటర్ల పరిధి ఉంది. పైగా ప్రపంచ వాణిజ్యంలో సుమారు 20శాతం భారత సాగర ప్రాంతాల ద్వారానే సాగుతోంది. సముద్రాల్ని వాణిజ్య నౌకలు విరివిగా ఉపయోగించుకోవడం సాధారణమే.*

ఒకదేశాన్ని ప్రపంచంలోని మిగతా ప్రాంతాలు, దేశాలతో కలిపే టెలికమ్యూనికేషన్‌ కేబుళ్లూ సముద్ర ప్రాంతాల నుంచి వెళుతున్నాయి. ప్రభుత్వం భారీయెత్తున ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడం మంచిదే. కానీ, వాటి ఫలాలు ప్రజలకు చేరాలంటే శాంతి భద్రతలు ముఖ్యం. అంతా అయిపోయాక అయ్యో అని బాధపడేకన్నా అంతర్గత, అంతర్జాతీయ స్థాయుల్లో ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా దీటుగా తిప్పికొట్టేలా తీరప్రాంత భద్రత వ్యవస్థను పటిష్ఠం, పరిపుష్టం చేయడం ముఖ్యం.

తీర ప్రాంతాల్లో ప్రమాదం ఉరుముతున్నమాట నిజం. దాని తీవ్రతను గుర్తించకపోయినా, లేదా విస్మరించినా- ముప్పు తప్పదు! ఈ దృష్ట్యానే తీరప్రాంత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకే కాదు, దేశరక్షణకూ ఇది కీలకం. ఈ అంశాన్ని తగిన స్థాయిలో పట్టించుకొనకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయి. చట్టాలను అమలు చేసే సంస్థలే తీరప్రాంత భద్రతాంశాన్ని చూసుకోవాలని అనుకొంటాం. వాటి పని అవి చేస్తున్నాయి. కానీ, ఎల్లవేళలా అవి ఆ పనిలో విజయం సాధించాలనేమీ లేదు. ఉగ్రవాదుల్ని అవి చాలావరకు గట్టిగా నిరోధిస్తూనే ఉండొచ్చు. ఏదో ఒక ఉగ్రవాద దాడి జరిగి భారీయెత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తే చాలు- వాటి కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. వ్యూహాత్మక రక్షణ, ఆర్థిక ప్రయోజనాల కోసమే కాదు, ప్రాంతీయ ఆధిపత్యానికీ తీరప్రాంత పటిష్ఠత ఎంత కీలకమో చైనా దూకుడు చాటిచెబుతోంది. చైనా గడచిన మూడేళ్లలో నౌకాదళ బలాన్ని, బలగాల్ని అనూహ్యంగా పెంచుకోవడమే కాకుండా యావత్‌ హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటోంది. భారత చుట్టుపక్కల దేశాల్లో నౌకాశ్రయాలు, స్థావరాలు అభివృద్ధిపరుస్తూ, ఇండియాను చక్రవ్యూహంలోకి నెడుతోంది. తీరప్రాంతాల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టగలిగేంత సామర్థ్యం ప్రస్తుతం భారత్‌కు లేదు.

*పొరుగు నుంచి ప్రమాదం*

భారత్‌ ఇరుగు-పొరుగు దేశాల్లో భౌగోళిక, రాజకీయ వాతావరణం పూర్తిగా విషమించిన నేటి పరిస్థితుల్లో తీరప్రాంత భద్రతాంశం మరింత ప్రాధాన్యం సంతరించుకొంది. భవిష్యత్తులో చిన్నపాటి ఘర్షణలెన్నో ఎదుర్కోవలసి రావచ్చు. అందుకోసం వనరులు చాలానే అవసరమవుతాయి. ఇస్లామిక్‌ రాజ్య(ఐస్‌) ఉగ్రవాదులు ఉరుముతున్నారు. పాకిస్థాన్‌ పరిణామాలూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. పాక్‌లో బాహాటంగానే తిరుగుతున్న హఫీజ్‌ సయీద్‌ లాంటి ఉగ్రవాదులు భారత్‌పై దాడులు జరుపుతామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఉగ్రవాదులు భారత పౌరులను, ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఎంతైనా ఉంది.

*పాకిస్థానీ యుద్ధనౌక పీఎన్‌ఎస్‌ జుల్ఫికర్‌ను స్వాధీనపరచుకోవడానికి ఇటీవల అల్‌ఖైదా ప్రయత్నించింది.*

*హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా నౌకాదళం దూకుడుగా చొచ్చుకొస్తోంది.*

ఈ పరిణామాల్ని చూస్తున్నప్పుడు- సముద్ర తీరప్రాంతం నుంచి ఉగ్రవాదం పోటెత్తే ప్రమాదం తీవ్రస్థాయిలోనే ఉన్నట్లు అర్థమవుతుందని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌కే ధోవన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యను తేలిగ్గా తీసుకోలేం.

పాకిస్థాన్‌ వంటి దేశాల్లో శిక్షణ పొందుతున్న ఉగ్రవాదుల్లో కొందరు స్వదేశీయులూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ భౌగోళిక స్వరూప స్వభావాలు; కీలక, వ్యూహాత్మక ప్రాంతాలు, ప్రదేశాలు, స్థావరాల గురించి వారికి క్షుణ్నంగా తెలిసే ఉంటుంది. మన కోస్తా ప్రాంతాల్లో భద్రతాపరమైన లొసుగులు, లోటుపాట్లను ఆసరా చేసుకొని, వారు మరోమారు చొరబడి ఉత్పాతం సృష్టించబోరన్న భరోసా లేదు. అందుకే తీర ప్రాంత రక్షణాంశానికి భారత ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేనంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
దీర్ఘకాలంలో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు వీలయ్యే ముందుజాగ్రత్త చర్యలే ముఖ్యమిప్పుడు. సవాలును సమర్థంగా తిప్పికొట్టేందుకు ఇదే ఉత్తమ మార్గం. ఈ దిశలో ప్రభుత్వం ఇప్పటికే కొంత ముందడుగు వేసింది.

2008లో ముంబయిలోని తాజ్‌ హోటల్‌ మీద ఉగ్రవాద దాడి తరవాత తీరప్రాంత భద్రతకు సంబంధించి మౌలిక సదుపాయాల పటిష్ఠీకరణకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోకపోలేదు.

*మూడంచెల్లో భద్రతకోసం ప్రయత్నించారు. మొదటి అంచెలో- రాష్ట్ర పోలీసుల నుంచి ఎంపిక చేసే మెరైన్‌ పోలీసులకు తీరం నుంచి 12 మైళ్ల దూరం వరకు గస్తీ కాసే బాధ్యతను అప్పగించారు. 12 నుంచి 200 మైళ్ల దూరం వరకు తీర పరిరక్షక దళం (కోస్ట్‌ గార్డ్‌), 200 నాటికల్‌ మైళ్ల అవతల నౌకాదళం భద్రత బాధ్యతలు చేపట్టాలని నిర్దేశించారు.*

*తీర ప్రాంత భద్రత పథకం రెండోదశను చేపడుతున్నట్లు సర్కారు 2010 సెప్టెంబరులో ప్రకటించింది. 2011 ఏప్రిల్‌ ఒకటి నుంచి దాని అమలు ఆరంభమైంది. కానీ, చైనా వంటి దేశాలతో పోల్చి చూసినప్పుడు ఈ విషయాల్లో భారత్‌ బాగా వెనకబడి ఉంది. డ్రోన్‌, మానవరహిత యుద్ధనౌకలపై పశ్చిమ దేశాలు కీలక పరిశోధనలు, పరీక్షలు నిర్వహిస్తున్నాయి.*

ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే, ఈ భద్రతను సమీక్షించి, పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది.

*ఆధునికీకరణే మార్గం..*

గడచిన కొన్నేళ్లలో ఆవిష్కృతమైన నవీన సాంకేతిక పరిజ్ఞానాలను సమర్థంగా ఉపయోగించుకోవాలి. అంతర్జాతీయ సాగర ప్రాంత సంస్థ ఒడంబడిక (2004) ప్రకారం- నౌకలన్నీ అసంకల్పిత గుర్తింపు వ్యవస్థలు కలిగి ఉండటం తప్పనిసరి. దాన్ని అనుసరించి- అన్ని నౌకలూ స్థానిక సాగర ప్రాంత పోలీసు కేంద్రంలో నమోదు చేసుకోవాలి. దాన్నిబట్టి వాటిని గుర్తించడానికి, అవి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే సోదాలూ నిర్వహించవచ్చు. రాడారు మీద కనబడే ఏ అనుమానాస్పద నౌకనైనా అడ్డగించవచ్చు. శక్తిమంతమైన నిఘా రాడార్లను విరివిగా ఏర్పాటు చేయడం ఎంతో ప్రయోజనదాయకం. భారత సాగర ప్రాంతంలోని ప్రత్యేక ఆర్థికమండలిలోనికి ప్రవేశించే అనుమానాస్పద నౌకలను నిరోధించడానికి అది అనువైన పద్ధతి.  ప్రభుత్వం తక్షణం మేల్కొని ఈ దిశలో వడివడిగా ముందడుగు వేస్తేనే మన భద్రతకు భరోసా!..
..సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section