దేశ వృద్ధిరేటు 7.1శాతం
దిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైనట్లు ఆర్థిక సర్వేలో వెల్లడించారు. 2017 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ఈరోజు లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2016-17లో వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 4.1 శాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 1.2శాతం ఎక్కువ.
ఆర్థిక సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ‘పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బందులున్నప్పటికీ దాని వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయి. ఏప్రిల్ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. కార్మిక, పన్నుల విధానాల్లో సంస్కరణలు తేవాలి. వస్త్ర, తోలు పరిశ్రమల బలోపేతానికి సంస్కరణలు అవసరం’.
💐💐💐💐💐💐💐💐💐
*బడ్జెట్*:👉 బడ్జెట్ అనేది బొగెట్టీ అనే ఫ్రెంచి పదం నుంచి వచ్చింది. బొగెట్టీ అంటే సంచి అని అర్థం.
ఒక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయ వ్యయాల స్వరూపమే బడ్జెట్.
👉ఏటా సెప్టెంబరులో బడ్జెట్ ప్రకటనను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్ర సంస్థలకు పంపిస్తారు.
👉నవంబరు నెలలో వివిధ వాణిజ్య మండళ్లురైతులు, ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు చర్చిస్తారు.
వాణిజ్య మండళ్లు తదితర సంఘాలతో ఆర్థికమంత్రి తుది సమావేశాలు నిర్వహిస్తారు.
ప్రణాళికలు రూపొందిస్తారు.
👉బడ్జెట్‌తో సంబంధమున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, ముద్రణకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, స్టెనోగ్రాఫర్లు, జాతీయ సమాచారశాస్త్ర కేంద్రం అధికారులను దిల్లీలోని నార్త్‌బ్లాక్(ఆర్థిక మంత్రిత్వశాఖ) కార్యాలయంలోకి తరలిస్తారు.
ఇక వారక్కడే ఉండాలి. ఇతర ప్రపంచంతో సంబంధాలుండవు. కుటుంబ సభ్యులు కూడా నేరుగా మాట్లాడే అవకాశముండదు. అంతకు ముందు నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక నిర్వహిస్తారు. హల్వాను ఆర్థిక మంత్రి సిబ్బందికి.. పంచి పెడుతారు.
👉ఆర్థికమంత్రి ప్రసంగాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు అర్థరాత్రి సమయంలో ముద్రణకు ఇస్తారు. బడ్జెట్ పత్రాలను నార్త్‌బ్లాక్‌లోని దిగువ భాగంలో ముద్రిస్తారు.బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యాక.. నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ తయారీ.. ముద్రణలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బయటకు వస్తారు.
👉బడ్జెట్ సమర్పణ తేదీని ప్రభుత్వం నిర్ణయించి.. లోక్‌సభ స్పీకర్‌కు ప్రతిపాదిస్తుంది. అక్కడ ఆమోదం లభించాక.. లోక్‌సభ సచివాలయం రాష్ట్రపతి ఆమోదం కోరుతుంది.లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పిస్తారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి బడ్జెట్ వివరాలను సంక్షిప్తంగా కేబినెట్‌కి వివరిస్తారు. ప్రధాని ఆమోదించాక.. రాష్ట్రపతి ఆమోదానికి బడ్జెట్ వివరాలను అక్కడకు పంపుతారు.
👉.లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పించాక ‘వార్షిక ఆర్థిక పత్రం’ను రాజ్యసభలో ప్రవేశపెడుతారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక ఆ రోజు సభలో ఏ చర్చా జరగదు.కొన్ని రోజుల తర్వాత బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. సభ వాయిదా పడుతుంది.రాజ్యాంగంలో బడ్జెట్ పదమే లేదు. ‘‘వార్షిక ఆర్థిక పత్రం’’గా పేర్కొన్నారు. వాడుకలో బడ్జెట్ అయింది.