Type Here to Get Search Results !

Vinays Info

ప్రపంచ కుష్టువ్యాధి నివారణ దినోత్సవం' || Anti leprosy day

'ప్రపంచ కుష్టువ్యాధి నివారణ దినోత్సవం'
సందర్భంగా..✍సురేష్ కట్టా(సోషల్ టీచర్
*🔻అది..1917 వ సంవతరం బీహార్ రాస్ట్రం చంపారణ్ గ్రామములో నీలి మందు పండిస్తున్న రైతులను బ్రిటిష్ వారు హింసిస్తున్నారు . తక్కువ కూలీ ఇచ్చి ఎక్కువ పనులు చేయిస్తున్దేవారు . తమ దేశానికి ఉత్పత్తి ని ఎగుమతి చేసుకుంటూ వాళ్ళు తయారు చేసిన బట్టలకు అద్దుకునేవారు . ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మహాత్మా గాంధి అక్కడకు చేరుకున్నారు . వాళ్ళ దయనీయ పరిస్థితులను కళ్ళారా చూశారు . ముందుండి విప్లవాన్ని నడిపించారు. ఈ సమయం లో ప్రతిరోజూ విప్లవకారులు , గాంధీజీ కలిపి ప్రార్ధన చేస్తుండేవారు.*

*🔻ఒకరోజు ప్రార్ధనకు ఓ వ్యక్తి రాకపోవడం గాంధి గమనించారు . విశ్రాంతి గదివైపు వెళ్ళేరు ... ఆ వ్యక్తీ ఓ చిన్న దీపపు వెలుగులో తన కాళ్ళకు , చేతులకు చిమ్ముతున్న చీము నెత్తురు తుడుచుకుంటున్నాడు . గాంధిజీ గుండె కరిగింది . అంటే తిన్నగా వ్యక్తీ వద్దకు వెళ్లి కట్లు కట్టి , సపర్యలు చేశారు . ఆరోజు నుంచి గాంధిజీ ప్రతిరోజూ కుష్టు రోగులకు సేవలు చేస్తుండేవారు.*

*🔻ఆయన సేవలకు గుర్తింపుగా గాంధిజీ వర్ధంతి జనవరి 30 న జాతీయ కుష్టు వ్యాధి నివారణ దదినోత్సవం గా జరుపుకుంటున్నారు.*

*🔻కుష్టువ్యాది బ్యాక్టీరియా (Mycobacterium leprae)వలన వచ్చే అతి సామాన్యమైన అంటువ్యాధి . ముఖ్యంగా చర్మానికి,నరాలకు (Nerves) సోకుతుంది . చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి సగటున మూడేళ్ళు పడుతుంది.*

*🔻దీనికి వయసు , లింగ బేధము లేదు.1973 లో హెన్సెన్(Hensen)  అనే నావే శాస్త్రవేత్త ఈ వ్యాది  కారకమైన సుక్ష్మజీవిని కనుగొన్నారు*

*🍥లక్షణాలు..*

*🔻శరీరం పై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ,కాళ్ళు , చేతులు తిమిర్లు గా ఉండడం ,ఎంతకీ మానని పుండ్లు ,చర్మము పై ముడతలు లాంటి కాయలు కనిపించడం ,మచ్చలపై నొప్పి తెలియక పోవడం వంటివి.*

*🍥వ్యాది నివారణ మార్గాలు..*

*🔻పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి . ఈ వ్యాది అంటు వ్యాధి , స్పర్చ ద్వారా , రోగినుండి వచ్చిన గాలి ద్వారా , సన్నిహిత సాన్నిధ్యం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.*

*🔻బహుళ ఔషధ  చికిత్సద్వారా నయం చేయవచ్చును . ముఖ్యంగా "దాప్సోనే(Dapsone) , "రిఫామ్పిసిన్ (Rifampsin)" మున్నగునవి . ప్రారంబము లో జబ్బును గుర్తించి మందులు వాడితే అంగవైకల్యాన్ని నివారించవచ్చును.*

*🔻ప్రాచీన కాలం నుండి మానవజాతిని పట్టిపీడిస్తున్న వ్యాధి. మనిషి నాడీ మండల వ్యవస్థ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చేతులు కాళ్లు దీని ప్రభావానికి ఎక్కువగా లోనవుతాయి. రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, బయోరంగం విస్తరిస్తుండడంతో ఈ వ్యాధికి మందులు వచ్చాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ప్రతి ఏడాది జనవరి 30న ప్రపంచ కుష్టు నివారణ దినోత్సవంగా జరుపుతుండగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా జనవరి 29న(జనవరి చివరి ఆదివారం/గాంధీజీ వర్దంతిన) జరుపుకున్నా-రు..ప్రజలకు  కుష్టు నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.*
..🕊సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section