Type Here to Get Search Results !

Vinays Info

Telangana State Geographical Features | తెలంగాణ ఉనికి

తెలంగాణ ఉనికి:

తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షిణాపథం అని పేర్కొంటారు.
దక్షిణాపథం అంటే నర్మద-తుంగభద్ర నదుల మధ్యగల ప్రాంతం. దక్షిణ భారతదేశానికి దారి అని అర్థం
ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న గోళార్ధం – ఉత్తరార్ధ గోళం
ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న ప్రాంతం – దక్షిణాసియా
ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న భారత ప్రాంతం- దక్షిణ భారతదేశం
ఉనికి రీత్యా తెలంగాణ ప్రాంతం విస్తరించి ఉన్న పీఠభూమి – దక్కన్ పీఠభూమి
దక్కన్ పీఠభూమి అతి పురాతనమైనది. అగ్ని, నీస్, సిస్ట్ శిలలతో ఏర్పడింది.
[27/01, 2:29 p.m.] VINAY KUMAR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్య ఘట్టాలు, సంఘటనలు

తెలంగాణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది – 2014, ఫిబ్రవరి 6
తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది – 2014, ఫిబ్రవరి 13
తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది – 2014, ఫిబ్రవరి 18
తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది – 2014, ఫిబ్రవరి 20
తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసింది – 2014, మార్చి 1
తెలంగాణ గెజిట్ ప్రకటన వెలువడింది – 2014, మార్చి 2
తెలంగాణ అపాయింటెడ్ డే జూన్-2 గా ప్రకటన వెలువడింది – 2014, మార్చి 4
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం – 2014 జూన్ 2
జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఏపీలో కలిపారు.
పూర్తిగా కోల్పోయిన మండలాలు – 5. అవి: 1. కుకునూరు 2. కూనవరం 3. వేలేరుపాడు 4. VR పురం (వర రామచంద్రాపురం) 5. చింతూరు
పాక్షికంగా కోల్పోయిన మండలాలు – 2. అవి: 1. భద్రాచలం 2. బూర్గంపహాడ్
భద్రాచలం మండలం నుంచి భద్రాచలం పట్టణం మినహా 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలను, బూర్గంపహాడ్ మండలం నుంచి 6 రెవెన్యూ గ్రామాలను, 4 గ్రామ పంచాయతీలు ఏపీలో కలిశాయి.
మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 327 రెవెన్యూ గ్రామాలను, 87 గ్రామ పంచాయతీలను కోల్పోయింది.
తెలంగాణ కోల్పోయిన విస్తీర్ణం – 2.76 లక్షల హెక్టార్లు (2,777 చదరపు కిలోమీటర్లు). ఇందులో 2 లక్షల హెక్టార్లు అటవీ విస్తీర్ణం.
ఏపీలో కలిసిన రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీల ద్వారా తెలంగాణ రాష్ట్రం కోల్పోయిన జనాభా – 1.90 లక్షలు
[27/01, 2:29 p.m.] VINAY KUMAR: రాష్ట్ర భౌగోళిక విస్తరణ, విస్తీర్ణం

15° 551′ నుంచి 19° 551′ ఉత్తర అక్షాంశాల మధ్య, 77° 151′ నుంచి 80° 471′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
భౌగోళిక విస్తీర్ణం – 1,12,077 చ.కి.మీ
దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం – 3.41 శాతం
దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం – 12
జనాభాపరంగా – 12వ స్థానం
అడవులపరంగా – 12వ స్థానం
అక్షరాస్యపరంగా – 28వ స్థానం (66.29 శాతం)
దేశంలో 20వ భూపరివేష్టిత రాష్ట్రం (Land-Locked State). అంటే సరిహద్దు చుట్టూ సముద్ర తీరం లేకుండా భూభాగమే ఉన్న ప్రాంతం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section