కౌలాస్‌నాలా ప్రాజెక్టు:
ఇది సావర్‌గావ్ గ్రామంలో ఉంది.
ఈ ప్రాజెక్టు కౌలాస్‌నాలా నదిపై ఉంది.
ఆయకట్టు సామర్థ్యం – 9000 ఎకరాలు
నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత లేకపోవడంతో దానికి ఎగువన సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు.
సింగూరు ప్రాజెక్టు
(మొగులిగుండ్ల బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు)
దీన్ని సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం వద్ద మంజీర నదిపై నిర్మించారు.
దీని ముఖ్య ఉద్దేశం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీరు అందించడం.
రాష్ట్ర చిహ్నాలు:
రాష్ట్ర పక్షి – పాలపిట్ట (శాస్త్రీయనామం – కొరాషియస్ బెంగాలెన్సిస్)
రాష్ట్ర జంతువు – మచ్చల జింక (శాస్త్రీయనామం – ఆక్సిస్ ఆక్సిస్)
రాష్ట్ర వృక్షం – జమ్మిచెట్టు (శాస్త్రీయనామం -ప్రోసోఫిస్‌సినరేరియా)
రాష్ట్ర పుష్పం – తంగేడు (శాస్త్రీయనామం – కేసియా అరిక్యులేటా)
రాష్ట్ర పండు -సీతాఫలం (శాస్త్రీయనామం – అనోనా స్కామోజా)
రాష్ట్ర చిహ్నం – కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూభాషల్లో తెలంగాణ ప్రభుత్వం,సత్యమేవ జయతే ఉన్నాయి.
రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన చిత్రకారుడు – ఏలె లక్ష్మణ్
రాష్ట్ర అధికారిక మాసపత్రిక – తెలంగాణ
రాష్ట్ర అధికారిక చానల్ – యాదగిరి
రాష్ట్ర అధికారిక పండుగలు – బతుకమ్మ, బోనాలు
బోనంలో ఉండే ఆహారం – పెరుగన్నం
లష్కర్ బోనాలు (సికింద్రాబాద్ మహంకాళి బోనాలు), హైదరాబాద్ బోనాలు.
పాలపిట్ట ఒడిశా, బీహార్‌లకు కూడా రాష్ట్ర పక్షే
జమ్మి చెట్టు ఆకులను దసరా పండుగ సమయంలో బంగారం అంటారు. సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా బంగారం అని బెల్లంను పిలుస్తారు.
తంగేడు పూలను బతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు.
తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారం – గటుక, వరి అన్నం
ECHS 64kb Card | ECHS 64kb Card Apply Online
ReplyDelete