Type Here to Get Search Results !

Vinays Info

కుంతల శాతకర్ణి

కుంతల శాతకర్ణి -ఇతను శాతవాహన రాజుల్లో 13వ వాడు. -శకులను ఓడించి తన పూర్వీకులు కోల్పోయిన మాళ్వా, మహారాష్ట్రలను తిరిగి పొందాడు. -కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం) రాసిన శర్వవర్మ, బృహత్కథ (పైశాచీ ప్రాకృతంలో) రాసిన గుణాఢ్యుడు ఈయన ఆస్థానంలోని వారే. -వాత్సాయనుడి కామసూత్రాలు, రాజశేఖరుడి కావ్య మీమాంసలో ఇతని ప్రశస్తి కనబడుతుంది. -చివరి కణ్వ వంశస్తుడైన సుశర్మను చంపి, మగధను ఆక్రమించినది కుంతల శాతకర్ణియేనని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. -కానీ మత్స్య పురాణం ప్రకారం 15వ రాజైన మొదటి పులోమావి సుశర్మను చంపి మగధను ఆక్రమించాడని తెలుపుతుంది. హాలుడు -శాతవాహన చక్రవర్తుల్లో 17వ రాజు హాలుడు. -ఇతను సారస్వతాభిమాని, సాహితీవేత్త. -ఈయన బిరుదు కవి వత్సలుడు. -ఇతను ప్రాకృతంలో 700 శృంగార పద్యాలను గాథాసప్తశతి అనే గ్రంథరూపంలో సంకలనం చేశాడు. ఈ విషయాన్ని బాణకవి తన హర్ష చరిత్ర గ్రంథంలో తెలిపాడు. -హాల చక్రవర్తి సింహళ రాకుమార్తె లీలావతిని సప్తగోదావరి తీరంవద్ద భీమేశ్వరుడి సన్నిధిలో వివాహం చేసుకున్నట్లు కుతూహలుడు తను రాసిన లీలావతి పరిణయం అనే కావ్యంలో పేర్కొన్నాడు. -హాలుని వివాహం జరిగిన ప్రాంతం నేటి జగిత్యాల జిల్లాలోని వేంపల్లి వెంకట్రావుపేట అని డా. నంగనభట్ల నర్సయ్య సాక్ష్యాధారాలతో నిరూపించాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section