రెండో శాతకర్ణి -ఇతను శాతవాహన రాజుల్లో 6వ వాడు. -అత్యధికంగా 56 ఏండ్లు పరిపాలించాడు. -ఇతడు శకులను, శుంగులను ఓడించి మాళ్వాను ఆక్రమించాడు. -ఇతని కాలంలోనే శక-శాతవాహన సంఘర్షణ ప్రారంభమైంది. -తెలంగాణలోనే కాకుండా ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాళ్వా ప్రాంతాల్లో కూడా ఇతని నాణేలు దొరికాయి. -ఇతని ఆస్థానంలోని వాసిష్టీపుత్ర ఆనందుడు సాంచీ స్థూప దక్షిణ ద్వారంపై ఒక శాసనాన్ని చెక్కించాడు. -యుగపురాణం ప్రకారం ఈయన మగధ, కళింగ ప్రాంతాలను కూడా పరి పాలించాడని తెలుస్తుంది. -ఈ విధంగా రెండో శాతకర్ణిని ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారత రాజుగా పేర్కొనవచ్చు. -రెండో శాతకర్ణి తర్వాత వరుసగా లంబోదరుడు, అపేలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కంద స్వాతి, మృగేంద్ర స్వాతికర్ణి, కుంతల శాతకర్ణి మొదలైన రాజులు పరి పాలించారు. వీరిలో చెప్పుకోదగ్గ రాజు కుంతల శాతకర్ణి మాత్రమే.