Type Here to Get Search Results !

Vinays Info

World Wetlands day | ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం

నేడు..ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
సందర్భంగా..✍సురేష్ కట్టా


*అతి వేగంగా అంతరించిపోతున్న చిత్తడినేల లు , భౌగోళికపరంగా , జీవ వైవిధ్య పరంగా చిత్తడినేలలు ఎంతో కీలకమైనవి . సముద్ర తీరప్రాంతాలలొనైనా , నదుల ప్రాంతాలలొనైనా సంవత్సరం లో అధిక కాలము నీరు నిలిచివుండి , తోతు తక్కువగా ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు గా పిలుస్తారు.*
*మంచినీటి , ఉప్పునీటి సరస్సులు , మడ అడవులలు కలిగిన సాగరసంగమ ప్రాంతాలు, బురద కయ్యలు , ఉప్పునీటి కయ్యలు , ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు వంటివన్నీ చిత్తడి నేలల కిందకే వస్తాయి.*
భూమినీ, నీటినీ అనుసంధానం చేసే చిత్తడి నేలలు ఇవి పర్యావరణ వ్యవస్థలో అత్యంత కీలకం. వీటినే ముద్దనీటి నేలలు,  బురదనేలలని కూడా పిలుస్తారు. 
ఆయా చిత్తడినేలల స్వభావాన్నిబట్టి కొన్ని ప్రాంతాలు చెట్లతోనూ, మరికొన్నన్ని ప్రాంతాల్లో గడ్డితోనూ, ఇంకొన్ని చోట్ల పొదలతోను నిండిఉంటాయి. సంవత్సర కాలం‌లో కనీసం  కొన్నాళ్ళపాటు తడిగాఉండే నేలలను “చిత్త్తడి నేలాలు” గా పిలుస్తాము. ఇవి సహజమైనవి కావచ్చు లేక కృత్రిమమైనవీ (మానవ నిర్మితమైనవీ) కావచ్చు. చిత్తడినేలల ఉపయోగం
జలవనరులు మానవాళి మనుగడకు ఎంతో కీలకం . అందుకే మానవ సంస్కృతి నదీ తీరాలలోనే విలసిల్లినది . సింధు , గంగానది , కృష్ణానదీ , గోదావరీ నదీతీరాలలోనే విలసిల్లినది . నేడు మహానగరములు గా భాసిల్లుతున్న కలకత్తా , ముంబయి , చెన్నై , టొకియో, న్యూయార్క్ వంటివన్నీ జలవనరుల ఆధారముగా ఎదిగినవే , అన్ని దిక్కులనుండి అక్కడికి ప్రజలను ఆకర్షించడానికి మూలము ఆ నగరాల ఆర్ధికసంపద అయితే , ఆ ఆర్ధిక సంపదను అందించినది ఆ ప్రాంతాలలో ఉన్న చిత్తడి నేలలే .
మానవాళికీ వన్యప్రాణికీ జవజీవాలను అందివ్వడంలో చిత్తడినేలలు ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నాయి.
పలురకాలైన మొక్కలకూ, వణ్యప్రాణు లకు ఆవాసం కల్పిస్తున్నాయి.
నీటిని వడగట్టి, శుభ్రపరిచి నిలవచేస్తాయి. వరదనీటిని సేకరించి నిల్వ చేస్తాయి.
గాలి, నీటి తుఫానులను పీల్చుకుంటాయి.  ప్రకృతికి అందాన్ని చేకూరుస్తాయి. స్పాంజి  మాదిరిగా నీటిని పీల్చుకొని నదుల గమనాన్ని సాధారణవేగానికి పరిమితం చేస్తున్నాయి.
చిత్తడినేలలగుండా ప్రవహించే నీటిని వడగట్టి శుధ్ధిపరుస్తాయి. చిత్తదినేలలలోఉండే మొక్కలు నీటి క్షయాన్ని నిలువరించడానికి ఉపయోగపడ్తాయి.
*కుంచించుకుపోతున్న చిత్తడినేలల పరిరక్షణ, సముధ్ధరణలకై కార్యాచరణ చేపట్టడానికి యునెస్కో ఇరాన్ దేశం రామసర్ నగరం‌లో 1971 సం. ఫిబ్రవరి 2 వతేదీన 169 దేశాలతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని “ప్రపంచ చిత్తడినేలల  దినోత్సవాన్ని”నిర్వహిస్తారు.  చిత్తడినేలల దినోత్సవాన్ని 1997నుండి నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఒక అనుష్టానాన్ని (theme) ప్రకటిస్తారు.*
*తొలిసారిగా ప్రపంచ చిత్తడి నే లల దినోత్సవాన్ని 1997 లో ఫిబ్ర వరి 02 న జరిపారు . నాటి నుండి ప్రతియేటా ఈ దినోత్సవం జరుగుతోంది. ఒక్కొక్క సం"   ఒక కొత్త అంశం మీద దృష్టి పెడు తూ ఈ దినోత్సవాన్ని జరుపుతు న్నారు.*
*ఈ  2017 సంవత్సరంకు గాను* *theme:*
*"Wetlands for Disaster Risk Reduction" అని ప్రకటించారు.*
*భారతదేశం‌లో నదులు, సెలయేళ్ళు, వ్యవసాయభూములు మినహా భారతదేశం‌లో 41లక్షల హెక్టార్ల చిత్తడినేలలు ఉండేవి. వీటిలో 15 లక్షలు సహజమైనవికాగా 26 లక్షలు మానవ నిర్మితమైనవి. తీరప్రాంత చిత్తడినేలలు దాదాపు 7 వేల చదరపుకిలోమీటర్లు. వ్యాపారత్మక ధోరణి మరియు ఆర్ధిక దోపిడీలవిధానాలవల్ల చిత్తడినేలలు అత్యంత కనిష్టానికి కుదించుకుపోవడం తద్వారా పర్యావరణం‌లో అనూహ్యమైన వికృత మార్పులు సంభవించాయి. ఆప్రభావంతో  వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమ వంటివి కోలుకోలేకుండా దెబ్బతిన్నాయి.*
జీవపర్యావరణ వ్యవస్థ తిరిగి జవజీవాలుపొందడానికి చిత్తడినేలల పునరుధ్ధరణ అత్యంత యుధ్ద్ధప్రాతిపదికన చేపట్టవలసిన సమయం ఆసన్నమైంది. విధ్వసమైన చిత్తడి నేలలపునరుధ్ధరణ కంటే ముందుగా ఇప్పటికింకా మిగిలిఉన్నవాటిని కాపాడుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలు, కార్యక్రమాలకంటే చిత్తడినేలల పరిరక్షణలో పౌరభాగస్వామ్యం కావాలి. నగరాల్లో ఇంటిచుట్టూ సిమెంటు పూతపూస్తున్నారు. దీనితో నీళ్ళు  భూమిలో ఇంకే అవకాశం‌లేక వరదగామారి లోతట్టుప్రాంతాలను మూంచివేయడం జరుగుతున్నది.  సహజసిధ్ధంగా నీళ్ళు నిలిచే అవకాశమున్నచోట అది మురికిగుంటగా మారకుండా చూసుకోవదం తొలి ప్రాధాన్యత.
*చిత్తడినేలాల పరిరక్షణ పౌరఉద్యమంగా మారినప్పుడే జీవపర్యావరణాలు సమగ్రాతను సంతరించుకుంటాయి. ఈ అవగాహన కుటుంబ స్థాయినుండి సమాజానికి చేరినప్పుడే ఆశవహ మైన మార్పులు వస్తాయి.ఆ దిశగా  మనందరం కృషిచేద్దాం..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section